TVK Vijay : వారిద్దరి మధ్య రిలేషన్ నిజమే..కలిసి తిరిగేస్తున్న విజయ్-త్రిష

TVK Vijay : తమిళ నిర్మాత కల్పాత్తి ఎస్ సురేష్ తనయుడి వెడ్డింగ్ రిసెప్షన్‌లో దళపతి విజయ్, కథానాయిక త్రిష జంటగా కనిపించారు

TVK Vijay

నిప్పు లేకుండా పొగ రాదంటారు.. అలాగే సెలబ్రిటీల విషయంలో ఇది చాలా సార్లు రుజువైంది కూడా… ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ తెరపైనే కాకుండా తెర వెనుక కూడా కలిసి తిరుగుతున్నప్పుడు వాళ్లిదరి మధ్య ఏదో ఉండే ఉంటుందన్నది అందరికీ తెలిసిన విషయమే. ఎంత తప్పించుకుని తిరుగుదామనుకున్నా సెలబ్రిటీలు కావడంతో అది సాధ్యం కాదు. అందులోనూ మన దేశంలో అస్సలు కుదిరే పని కాదు. అదే రిలేషన్ పై ప్రశ్నిస్తే మాత్రం సదరు హీరో, హీరోయిన్లు ఫైర్ అయిపోతుంటారు. కానీ అసలు సంగతి మాత్రం వారిని దగ్గర నుంచి చూసినవాళ్ళకు తెలుసు.

ఇప్పుడు ఇదంతా చెబుతోంది తమిళ స్టార్ విజయ్(TVK Vijay), నటి త్రిష గురించే… మొన్నటి వరకూ మా ఇద్దరి మధ్యా ఎలాంటి సంబంధం లేదంటా త్రిష నానా హడావుడి చేసింది. డేటింగ్ విమర్శలు చేసిన బీజేపీ నాయకుడికి లీగల్ నోటీసు ఇచ్చి క్షమాపణలు కూడా చెప్పించుకుంది. కట్ చేస్తే విజయ్ భార్య విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కడంతో మొత్తం వ్యవహారమంతా పబ్లిక్ అయిపోయింది. పేరు చెప్పకపోయినా విజయ్ తన పిటిషన్ లో ఓ నటితో విజయ్ కు ఎఫైర్ ఉందని ఆరోపించడంతో ఆమె మరెవరో కాదు త్రిషేనని అందరికీ అర్థమైంది.

మరి భార్య ఎలాగూ అందరికీ తెలిసేలా చేసిందనో, భవిష్యత్తులో ఇక తామిద్దరం కలిసే ఉంటాం కదా అనుకునో విజయ్, త్రిష ఇప్పుడు చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారు. తాజాగా ఓ వివాహ వేడుకకు విజయ్(TVK Vijay) తో కలసి హాజరైన త్రిష అందరకీ షాక్ ఇచ్చింది. నిర్మాత కల్పతి ఎస్.సురేష్ కుమారుడి వివాహం చెన్నైలో జరిగింది. ఈ వేడుకకు విజయ్, త్రిష ఒకే కారులో కలిసే వచ్చారు. విజయ్ పట్టు పంచె, ఆ డ్రెస్ కి మ్యాచింగ్ అయ్యే చీరలో త్రిష కనిపించారు. ఇద్దరూ కలసివచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో ఓ రేంజ్ లో వైరల్ అయింది.

TVK Vijay

విజయ్ భార్య విడాకులు కోరడానికి కారణం త్రిషతో ఉన్న ఎఫైరే. ఇలాంటి సమయంలో త్రిషతో కలసి వివాహ వేడుకకు విజయ్ రావడంతో అందరూ షాక్ అయ్యారు. ఇకపై తామిద్దరం కలిసే ఉంటామన్న విషయం చెప్పకనే చెప్పేశారు. కోర్టు విచారణకు హాజరయ్యేందుకు విజయ్ నోటీసు కూడా అందుకున్నాడు.

అయితే ఇటీవలే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి, పార్టీ పెట్టి , వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో కోర్టు బయటే ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు విజయ్(TVK Vijay) ప్రయత్నిస్తున్నాడు. భార్యకు రూ.250 కోట్లు ఆఫర్ తో ప్రతిపాదన కూడా చేసినట్టు సమాచారం. సంగీతను విజయ్ 1999లో పెళ్ళి చేసుకున్నాడు. వీరికి సంజయ్, దివ్ సాష అనే ఇద్దరు పిల్లలు. గత మూడేళ్లుగా విజయ్, సంగీత మధ్య విభేదాలు మొదలయ్యాయి.

విజయ్ లో మార్పు రాలేదంటూ సంగీత విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే ఎన్నికల ముంగిట ఈ వ్యక్తిగత వివాదాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించుకోకుంటే విజయ్ ఇమేజ్ కూడా దెబ్బతినడం, అది ఎన్నికలపై ప్రభావం చూపడం ఖాయమని అంచనా వేస్తున్నారు.

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version