Revanth Reddy: రేవంత్ గ్రాఫ్ పెంచిన జూబ్లీహిల్స్..  సీనియర్లంతా గప్ చుప్

Revanth Reddy: ఈ ఉపఎన్నిక ఫలితంతోనే వారిని సైలెంట్ చేశారు. ఒకవిధంగా బీహార్ లో దారుణంగా ఓడిపోయిన పార్టీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు పెద్ద రిలీఫ్ ఇచ్చింది.

Revanth Reddy

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)గెలుపుగా మారింది. ఒక్కసారిగా రేవంత్ గ్రాఫ్ విపరీతంగా పెరిగింది. ఢిల్లీలో హై కమాండ్ దగ్గర…. జనంలోనూ రేవంత్ బలం పుంజుకున్నారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఓడిపోతే, సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని బాధ్యుడిని చేసేద్దామనుకున్న సీనియర్ నేతలు కూడా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు.

ఇదే దూకుడు కొనసాగిస్తే తెలంగాణలో మరోసారి కాంగ్రెస్ సర్కార్ వస్తుందని కాంగ్రెస్ క్యాడర్ నమ్ముతోంది. నిజానికి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలవడానికి అధికార కాంగ్రెస్ పార్టీ సర్వసక్తులు ఒడ్డింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితం రేవంత్ రెడ్డికి (Revanth Reddy)రిఫ రెండం అని టిఆర్ఎస్ ప్రకటించడంతో…. రేవంత్ కూడా దీన్ని సీరియస్ గానే తీసుకున్నారు. పోల్ మేనేజ్మెంట్ మొత్తం ఆయనే దగ్గరుండి చేశారు.

రేవంత్ సమన్వయం అద్భుతంగా పనిచేయడంతో ఊహించిన దానికంటే బంపర్ మెజారిటీతో ఎన్నికలు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచాడు. జూబ్లీ గెలుపు రేవంత్ రెడ్డికి కొత్త శక్తిని ఇచ్చింది. నిజానికి కాంగ్రెస్ పార్టీలో పలువురు సీనియర్లు రేవంత్ ను తక్కువగా చూస్తుంటారు. దీనికి ఈ ఉపఎన్నిక ఫలితంతోనే వారిని సైలెంట్ చేశారు. ఒకవిధంగా బీహార్ లో దారుణంగా ఓడిపోయిన పార్టీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు పెద్ద రిలీఫ్ ఇచ్చింది. అది రేవంత్ వల్లే సాధ్యమైందని ఐ కమాండ్ ఒక అభిప్రాయానికి వచ్చింది.

Revanth Reddy

నిన్న మొన్నటి వరకు సీఎం కి వ్యతిరేకంగా పార్టీలోనే కొందరు సీనియర్లు ఎప్పటికప్పుడు కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదులు పంపుతూనే ఉన్నారు. కానీ జూబ్లీహిల్స్ గెలుపు దెబ్బతో సీనియర్లంతా సెట్ అయిపోయారు. పార్టీ హై కమాండ్ కూడా కొద్దిరోజులపాటు ఫిర్యాదుల్ని పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.

కాంగ్రెస్ ఇప్పుడు కేవలం మూడు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. వచ్చే సారి వీటిలో నిలుపుకోవడానికి హస్తం పార్టీ తీవ్రంగానే కష్టపడాలి. దీంతో కాంగ్రెస్ అధిష్టానం ఆశలు మొత్తం తెలంగాణ పైనే ఉన్నాయి. ఇదే తరహాలో కష్టపడితే 2028 లో కూడా మరోసారి అధికారం అందకోవచ్చని అధిష్టానం భావిస్తోంది. జూబ్లీహిల్స్ గెలుపుతో తన నిరూపించుకున్న రేవంత్ నిర్మాణాత్మకంగానూ మరింత బలోపేతం అయ్యారు. ఇప్పుడు మంత్రులు మొత్తం రేవంత్ దారికొచ్చారు. దీంతో ఒక్క బైపోల్ రిజల్ట్ తో రేవంత్ తన గ్రాఫ్ పెంచుకున్నాడంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version