Sankranthi:సంక్రాంతి తేదీల గందరగోళం.. మరి పండితులు ఏం చెబుతున్నారు?

Sankranthi సంక్రాంతి పండుగను జనవరి 14న జరుపుకోవాలా లేక 15న జరుపుకోవాలా అన్న చర్చ పెద్దగానే నడుస్తోంది.

Sankranthi

తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి(Sankranthi) విషయంలో ఈ ఏడాది రకరకాలుగా వార్తలు వినిపించడంతో సామాన్య భక్తులలో కొంత గందరగోళం నెలకొంది. పండుగను జనవరి 14న జరుపుకోవాలా లేక 15న జరుపుకోవాలా అన్న చర్చ పెద్దగానే నడుస్తోంది. దీనికి ప్రధాన కారణం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే మకర సంక్రమణ సమయం అంటున్నారు పండితులు.

నిజానికి పంచాంగకర్తలు , జ్యోతిష్య నిపుణుల విశ్లేషణ ప్రకారం, ఈ గందరగోళం వెనుక రెండు రకాల సిద్ధాంతాలు ఉన్నాయి.అంటే పూర్వ సిద్ధాంతం అలాగే దృక్ సిద్ధాంతం అనే రెండు గణనలు ఉన్నాయి.

పూర్వ సిద్ధాంతం ప్రకారం, జనవరి 14 రాత్రి 9:12 గంటలకు ఈ సంక్రమణం జరుగుతుంది. శాస్త్రం ప్రకారం రాత్రి పూట సంక్రమణం జరిగితే, మరుసటి రోజు పండుగ జరుపుకోవాలి. దీని ప్రకారం చూస్తూ జనవరి 15న పండుగ జరుపుకోవాలి. తిరుమల, శ్రీశైలం, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం , శృంగేరి పీఠం ఇదే సిద్ధాంతాన్ని అనుసరించి జనవరి 15న సంక్రాంతిగా నిర్ణయించాయి.

Sankranthi

ఇక రెండోది అయిన ఆధునిక ఖగోళ గణనల ఆధారంగా రూపొందించిన దృక్ సిద్ధాంతం ప్రకారం.. జనవరి 14 మధ్యాహ్నం 3:07 గంటలకే సంక్రమణం జరుగుతుంది. దీని ప్రకారం జనవరి 14నే సంక్రాంతి(Sankranthi) పండుగ చేసుకోవాలని కంచి కామకోటి పీఠం వంటి వారు సూచిస్తున్నారు. జనవరి 14 మధ్యాహ్నం 3:07 గంటలకే పెద్దలకు బట్టలు పెట్టడానికి మంచి సమయమని చెబుతున్నారు. ఏది ఏమైనా, మెజారిటీ ఆలయాలు , పీఠాలు జనవరి 15నే పండుగగా ప్రకటించాయి.

Depression :శ్రీలంక వద్ద తీరం దాటిన వాయుగుండం.. ఈ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు,పెరగనున్న చలి

Exit mobile version