Tirumala: తిరుమలలో శ్రీవారి ఆస్థానం, కళ్యాణోత్సవం రద్దు వివరాలు!

Tirumala: దీపావళి నాడు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఆలయంలోని బంగారు వాకిలి ముందు ఉన్న ఘంటా మండపంలో ఈ దీపావళి ఆస్థానం జరుగుతుంది.

Tirumala

తిరుమల(Tirumala) క్షేత్రంలో దీపావళి పండుగ సందర్బంగా, భక్తుల కోలాహలం మధ్య అక్టోబరు 20వ తేదీన శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానాన్ని టీటీడీ అత్యంత వైభవంగా, శాస్త్రోక్తంగా నిర్వహించనుంది. ఈ ఉత్సవానికి సంబంధించిన ఘట్టాలు, సేవల వివరాలు భక్తులకు కనువిందు చేయనున్నాయి. దీపావళి నాడు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఆలయంలోని బంగారు వాకిలి ముందు ఉన్న ఘంటా మండపంలో ఈ దీపావళి ఆస్థానం జరుగుతుంది.

ఆస్థానంలో భాగంగా, ఉత్సవమూర్తి అయిన శ్రీమలయప్పస్వామివారు తమ దేవేరులైన శ్రీదేవి, భూదేవిలతో కలిసి ఘంటా మండపంలో ఏర్పాటు చేసిన సర్వభూపాల వాహనంపై విహరించి, ఆలయానికి ఆభిముఖంగా ఉన్న గరుడాళ్వార్‌కు అభిముఖంగా వేంచేపు చేస్తారు. ఈ ఉత్సవంలో ముఖ్యమైన పాత్ర వహించే సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారిని కూడా స్వామివారి ఎడమ పక్కన మరొక పీఠంపై దక్షిణ ఆభిముఖంగా వేంచేపు చేస్తారు. ఈ అద్భుత ఘట్టం తర్వాత, అర్చక స్వాములు ఆగమ శాస్త్రం ప్రకారం స్వామివారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదనలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. దీంతో దీపావళి ఆస్థానం ఘట్టం పూర్తవుతుంది.

Tirumala

ఇక సాయంత్రం వేళల్లో కూడా స్వామివారి సేవలు భక్తులకు నేత్రానందాన్ని కలిగించనున్నాయి. సాయంత్రం 5 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు సహస్ర దీపాలంకరణ ‌సేవలో పాల్గొని, ఆ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల‌లో దివ్యంగా విహరించి భ‌క్తుల‌ను క‌టాక్షించ‌నున్నారు. అయితే, దీపావ‌ళి ఆస్థానం కారణంగా అక్టోబరు 20వ తేదీన జరగాల్సిన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం(Tirumala) వంటి ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. అలాగే, తోమాల, అర్చన వంటి కైంకర్యాలను కూడా భక్తులు లేకుండా ఏకాంతంగానే నిర్వహించనున్నారు. భక్తులు ఈ మార్పులను గమనించి, ఆస్థానంలో పాల్గొని శ్రీవారి కటాక్షం పొందొచ్చు.

Gold Scam: శబరిమల గోల్డ్ స్కామ్ పెళ్ళి కోసం దేవుడి బంగారం

Exit mobile version