Lord Shiva’s third eye
పరమశివుడిని వర్ణించేటప్పుడు అత్యంత ప్రముఖంగా కనిపించే లక్షణం ఆయన ‘మూడో కన్ను’ (జ్ఞాన నేత్రం-Lord Shiva’s third eye). ఈ కన్ను కేవలం ఒక అలంకారం కాదు, అది సృష్టి లయకారుడైన శివుడి శక్తికి, యోగా రహస్యాలకు, అంతిమ జ్ఞానానికి ప్రతీక. మూడో కన్ను వెనుక ఉన్న పౌరాణిక కథ, ఆధ్యాత్మిక రహస్యం , యోగా సైన్స్ గురించి లోతైన విశ్లేషణ ఉందంటారు నిపుణులు.
పౌరాణిక కథనం ప్రకారం, దేవతల కోరిక మేరకు తారకాసురుడిని సంహరించడానికి శివపార్వతుల వివాహం అవసరం అయ్యింది. అయితే, శివుడు లోతైన ధ్యానంలో ఉండటం వల్ల, మన్మథుడు (ప్రేమ దేవత) శివుడి ఏకాగ్రతను భగ్నం చేయడానికి పూల బాణాన్ని సంధించాడు. శివుడి ధ్యానం భంగమై, ఆయన తన మూడో కన్ను(Lord Shiva’s third eye) తెరిచి, దాని నుంచి వచ్చిన ప్రచండ అగ్నితో మన్మథుడిని క్షణాల్లో భస్మం చేశారు. ఈ ఘటన శివుడి కోపాన్ని, ఆ కన్నుకున్న వినాశకర శక్తిని వెల్లడిస్తుంది. కానీ, ఈ వినాశనం అనేది కేవలం భౌతికమైనది కాదు, అహంకారాన్ని, మోహాన్ని, భ్రమలను దహించి, సత్యాన్ని స్థాపించేదిగా చెబుతారు.
అధ్యాత్మికం ,యోగా శాస్త్రంలో, మూడో కన్ను మన రెండు కనుబొమ్మల మధ్య ఉండే ఆజ్ఞా చక్రంతో ముడిపడి ఉంది. ఈ ప్రాంతంలోనే పీనియల్ గ్రంథి (Pineal Gland) ఉంటుంది, దీనిని కొందరు ‘మెదడు యొక్క ఆధ్యాత్మిక కేంద్రం’గా అభివర్ణిస్తారు.
జ్ఞాన నేత్రం.. ఈ కన్ను సత్య దృష్టి మరియు అంతర్ దృష్టి (Intuition)ని సూచిస్తుంది. సాధారణ రెండు కళ్ళతో మనం భౌతిక ప్రపంచాన్ని చూస్తే, మూడో కన్నుతో మనం దాగి ఉన్న అంతర్గత సత్యాన్ని, మనస్సు యొక్క లోతులను, గత-భవిష్యత్తులను కూడా చూడగలుగుతాం.
అజ్ఞా చక్రం.. ధ్యానం, యోగా మరియు శ్వాస వ్యాయామాల (ప్రాణాయామం) ద్వారా కుండలినీ శక్తిని మేల్కొలిపినప్పుడు, ఈ శక్తి క్రమంగా ఆజ్ఞా చక్రాన్ని చేరుకుంటుంది. ఆజ్ఞా చక్రం మేల్కొంటే, వ్యక్తులు మోహం, ద్వేషం వంటి సంకెళ్ల నుంచి విముక్తి పొందుతారు.
పిల్లలలో ఆక్టివ్.. చిన్న పిల్లలలో పీనియల్ గ్రంథి చురుకుగా ఉండి, వారికి కొన్ని అతీంద్రియ శక్తులు, సహజ జ్ఞానం (Intuition) ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ, భౌతిక ప్రపంచంపై దృష్టి పెరగడం వల్ల ఈ గ్రంథి నిద్రాణమవుతుంది. శివుడి మూడో కన్ను అనేది ఈ జ్ఞాన గ్రంథిని సదా చురుకుగా ఉంచుకోవడానికి సంకేతం.
శివుని మూడో కన్ను(Lord Shiva’s third eye) కేవలం భయాన్ని కలిగించడానికే కాదు.. అది జ్ఞానానికి, వైరాగ్యానికి , అశాశ్వతమైన భౌతిక ప్రపంచాన్ని దహించి, శాశ్వతమైన సత్యం వైపు నడిపించే దివ్య శక్తికి ప్రతీక. ప్రతి మనిషిలోనూ ఈ మూడో కన్ను యొక్క శక్తి దాగి ఉంది, దాన్ని ధ్యానం ద్వారా మేల్కొల్పడమే జీవిత పరమార్థం.
