Brahmotsavam : శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఎప్పుడు, ఎవరు ప్రారంభించారో తెలుసా?

Brahmotsavam:తిరుమల శ్రీవారి వార్షిక ఉత్సవాలను మొదట స్వయంగా బ్రహ్మదేవుడే నిర్వహించాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ ఉత్సవాలకు 'బ్రహ్మోత్సవాలు' అనే పేరు వచ్చింది.

Brahmotsavam

శ్రీవారి బ్రహ్మోత్సవాలు (Brahmotsavam)అంటే కేవలం తొమ్మిది రోజుల పండుగ మాత్రమే కాదు. అది మనసులోని అహంకారాన్ని, కాలుష్యాన్ని తొలగించి, ఆత్మకు పరమానందాన్ని రుచి చూపించే ఒక గొప్ప ఆధ్యాత్మిక యాత్ర. ఈ ఉత్సవాల వెనుక ఉన్న పౌరాణిక, తాత్విక విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రహ్మోత్సవా(Brahmotsavam)ల వెనుక పురాణ నేపథ్యం..తిరుమల శ్రీవారి వార్షిక ఉత్సవాలను మొదట స్వయంగా బ్రహ్మదేవుడే నిర్వహించాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ ఉత్సవాలకు ‘బ్రహ్మోత్సవాలు’ అనే పేరు వచ్చింది. వీటిని బ్రహ్మదేవుడు భూలోకంలో మానవులందరికీ పరమానందాన్ని, మోక్షాన్ని అందించే మార్గంగా ప్రారంభించారని అంటారు. ఈ ఉత్సవాలు వర్ష ఋతువులో జరుగుతాయి కాబట్టి వీటిని ‘వార్షిక బ్రహ్మోత్సవాలు’ అని కూడా పిలుస్తారు. ఈ వైభవాన్ని చూసి అన్నమయ్య కూడా నానా దిక్కుల నరులెల్ల వానలలోనే వత్తురు కదిలి అని తన పాటలో వర్ణించారు.

Brahmotsavam

బ్రహ్మోత్సవాలకు వెళ్లే ప్రతి భక్తుడు ముందుగా తన మనసులోని కల్మషాలను తొలగించుకోవాలి. ఇల్లు శుభ్రం చేసుకుని పండుగకు సిద్ధమైనట్లుగా, మనసును భక్తితో శుద్ధి చేసుకోవాలి. ఇలా దీక్షితులై వెళ్లిన భక్తులకు కొండంత ఆనందం, అణువణువూ బ్రహ్మమయమైన అనుభూతి కలుగుతుంది. అన్నమయ్య చెప్పినట్లుగా వేదములే శిలలై వెలసినది ఈ కొండ. ఈ కొండకు చేరుకున్న భక్తుడు, గోపురం దాటిన వెంటనే పొందే అనుభూతి సామాన్యమైనది కాదు. అది కేవలం అతని అడుగులకే కాదు, జన్మజన్మల దోషాలను కడిగేస్తుంది. ఆ అనుభూతే సాలగ్రామ శిలామూర్తి రూపంలో సాక్షాత్కారం అవుతుంది.

Brahmotsavam

ఈ ఉత్సవాలు భక్తులకు ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తాయి. దేహం మరణిస్తే అది నిర్యాణం (సాధారణ మరణం). కానీ, ‘నేను’ అనే అహంకారం నశిస్తే అది నిర్వాణం (మోక్షం). ఈ బ్రహ్మోత్సవాలు మనలోని అహంకారాన్ని తొలగించి, మనల్ని నిర్వాణం వైపు నడిపిస్తాయి. అందుకే ఈ మహోత్సవం భక్తులందరికీ ‘నిర్వాణ సోపానం’ అధిరోహించడానికి ఒక మార్గంగా నిలుస్తుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఒక భక్తి యాత్ర ముగింపు కాదు.. ఇది ఒక కొత్త ఆధ్యాత్మిక యాత్రకు ఆరంభం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Exit mobile version