Tirumala: శ్రీవారి భక్తుల నుంచి ఫీడ్‌బ్యాక్.. టీటీడీ సరికొత్త అధ్యాయం

Tirumala : తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామివారి భక్తులకు అద్భుతమైన సేవలు అందించడమే లక్ష్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం ( TTD ) వినూత్న ప్రయత్నాలకు తెరతీసింది.

Tirumala : తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామివారి భక్తులకు అద్భుతమైన సేవలు అందించడమే లక్ష్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం ( TTD ) వినూత్న ప్రయత్నాలకు తెరతీసింది. భక్తుల నుంచే నేరుగా ఫీడ్‌బ్యాక్(Feedback) స్వీకరించి, ఆ సూచనల ఆధారంగా తమ సేవలను మరింత మెరుగుపరుచుకోవాలని నిర్ణయించింది. ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ, భక్తుల సంతృప్తిని అగ్రస్థానంలో నిలపడానికి టీటీడీ బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తోంది.

భక్తుల సేవ అంటేనే శ్రీవారి సేవ

తిరుమలకు విచ్చేసే (devotees) సంపూర్ణ సంతృప్తితో తిరుగు ప్రయాణం చేస్తేనే, దేవదేవుడైన శ్రీ వేంకటేశ్వరుడు కూడా సంతోషిస్తాడని టీటీడీ బలంగా విశ్వసిస్తోంది. అందుకే భక్తుల అనుభవాలను, అంచనాలను లోతుగా అర్థం చేసుకోవడానికి ఫీడ్‌బ్యాక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను ప్రారంభించింది. తిరుమల యాత్రలో ప్రస్తుతం అందుతున్న సేవలపై భక్తుల అభిప్రాయాలను తెలుసుకోవడం, అలాగే టీటీడీ నుంచి వారు ఇంకేం ఆశిస్తున్నారో తెలుసుకోవడం టీటీడీ ముఖ్య ఉద్దేశ్యం.

అభిప్రాయ సేకరణకు ఆధునిక, ప్రత్యక్ష పద్ధతులు

భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ సేకరించడానికి రకరకాల మార్గాలను ఉపయోగిస్తోంది. వీటిలో టెక్నాలజీ సాయంతో కొన్ని ..ఫేస్ టూ ఫేస్ సంభాషణతో కొన్ని ఉండనున్నాయి.

ఐవీఆర్‌ఎస్ (IVRS) ఈ-సర్వే:

భక్తులు తమ తిరుమల యాత్ర అనుభవంపై ఫోన్ ద్వారా అభిప్రాయాలను తెలియజేయవచ్చు.

అన్నప్రసాదం, కళ్యాణకట్ట, ఆలయ నిర్వహణ, వసతి, క్యూలైన్ల స్థితి, లగేజ్ కౌంటర్లు వంటి 16 కీలక అంశాలపై ప్రశ్నలు అడుగుతారు.

వాట్సాప్ ఫీడ్‌బ్యాక్ సిస్టమ్:

తిరుమల, తిరుపతిలోని వివిధ ముఖ్య ప్రదేశాలలో క్యూఆర్ కోడ్‌లను ఏర్పాటు చేశారు.

భక్తులు తమ మొబైల్‌తో ఈ క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేయడం ద్వారా టీటీడీ అభిప్రాయ సేకరణ పేజీని (వాట్సాప్ నంబర్: 9399399399) ఓపెన్ చేయొచ్చు.

అక్కడ తమ పేరు, సేవ విభాగాన్ని (ఉదా: శుభ్రత, లడ్డూ ప్రసాదం, దర్శన అనుభవం) ఎంచుకుని సులభంగా తమ అభిప్రాయాన్ని పంపొచ్చు.

శ్రీవారి సేవకుల ద్వారా ప్రత్యక్ష సర్వే:

తిరుమల, తిరుపతిలోని అనేక ప్రాంతాలలో శ్రీవారి సేవకులు స్వయంగా భక్తుల వద్దకు వెళ్లి అభిప్రాయాలను సేకరిస్తున్నారు.

వీరు టీటీడీ రూపొందించిన ప్రశ్నావళితో కూడిన ఒక మొబైల్ అప్లికేషన్‌ను ఉపయోగించి, భక్తుల నుంచి ప్రత్యక్ష అనుభవాలను నమోదు చేసుకుంటారు.

మొబైల్ యాప్ & బుకింగ్ పోర్టల్ ద్వారా (త్వరలో):

త్వరలోనే టీటీడీ మొబైల్ యాప్, టీటీడీ బుకింగ్ పోర్టల్ ద్వారా కూడా భక్తులు తమ విలువైన సలహాలు, సూచనలు అందించేందుకు ప్రత్యేక అప్లికేషన్‌ను అందుబాటులోకి తేనుంది.

టీటీడీ ఈ వినూత్న సర్వేల ద్వారా భక్తుల అభిప్రాయాలను నేరుగా సేకరించి, వాటిని విశ్లేషించి, సేవలను మరింత సమర్థవంతంగా, భక్తులకు మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రయత్నంలో భాగస్వాములై, మీ సలహాలు, సూచనలను అందించి టీటీడీ సేవలు మెరుగుపడటానికి సహకరించాలని భక్తులకు రిక్వెస్ట్ చేస్తోంది.

Exit mobile version