Kamakhya
బ్రహ్మపుత్రా నది ఒడ్డున, నీలాచల్ గిరి పర్వతాలపై వెలసిన కామాఖ్య మందిరం, భారతదేశంలోని 51 శక్తిపీఠాలలో అత్యంత ముఖ్యమైనది , ఒక గొప్ప తాంత్రిక కేంద్రం. ఇది కేవలం ఒక దేవాలయం కాదు, స్త్రీ శక్తికి, సృష్టికి మూలమైన శక్తికి ఒక పవిత్రమైన నిలయం. పురాణాల ప్రకారం, దక్ష యజ్ఞం తర్వాత సతీదేవి దేహాన్ని శివుడు మోస్తున్నప్పుడు, ఆమె యోని భాగం ఈ పవిత్రమైన ప్రదేశంలో పడింది. అందుకే అమ్మవారు ఇక్కడ “కామేశ్వరి,” “కామరూపిణి,” , “జనని” అనే రూపాలలో పూజింపబడతారు. ఈ ఆలయంలో విగ్రహం ఉండదు, యోని ఆకారంలో ఉన్న ఒక రాతిని పూజిస్తారు. ఇది సృష్టికి మూలమైన శక్తికి ప్రతీక(Kamakhya).
విశేషమైన పురాణ చరిత్ర & అంబువాచీ మేళా..ఈ ఆలయం ఒక ప్రత్యేకమైన నమ్మకానికి ప్రసిద్ధి చెందింది – అదే “బ్లీడింగ్ గాడెస్” (ఋతుస్రావం అయ్యే దేవత). ప్రతి సంవత్సరం జూన్ నెలలో, అమ్మవారు ఋతుస్రావం పొందుతారని నమ్ముతారు, ఆ మూడు రోజులు అంబువాచీ మేళా నిర్వహిస్తారు.
ఈ సమయంలో ఆలయం పూర్తిగా మూసి ఉంటుంది. నాలుగు రోజుల తరువాత ఆలయం తెరిచి, అమ్మవారి రజోదర్శనాన్ని సూచించే ఎర్రని వస్త్రాన్ని ప్రసాదంగా భక్తులకు అందజేస్తారు. దీనినే “అంబువాచీ వస్త్రం” లేదా “సిందూరి” అంటారు.
ఈ ప్రసాదం రోగ నివారిణిగా, సంతాన దాయినిగా భక్తులు విశ్వసిస్తారు. ఒకప్పుడు కోచ్ రాజు నరనారాయణ గర్భగుడిలోకి ప్రవేశించాలని కోరగా, పూజారి కేందుకలాయ్ దానికి విరుద్ధంగా వ్యవహరించాడు. దానితో అమ్మవారు కోపించి, ఆ పూజారికి శిరస్సు ఖండించబడాలని శపించి, వారి వంశస్థులు గర్భగుడికి ప్రవేశించకుండా నిరోధించింది.
కామాఖ్య(Kamakhya) దేవిని పూజిస్తే మానసిక కోరికలు, సంతాన భాగ్యం, రోగాల నుంచి విముక్తి లభిస్తాయని భక్తులు నమ్ముతారు. గౌహతి విమానాశ్రయం లేదా రైల్వే స్టేషన్ నుంచి నీలాచల్ కొండపైకి టాక్సీ, ఆటోలు అందుబాటులో ఉన్నాయి. ఇది భక్తులకు ఒక ఆధ్యాత్మిక యాత్రగా, జీవితాన్ని మార్చే అనుభూతిని ఇస్తుంది.