Karthika Purnima
హిందూ సంప్రదాయంలో కార్తీక మాసానికి అత్యంత పవిత్ర స్థానం ఉంది. ఈ నెల రోజుల్లో చేసే పూజలు , దీపారాధనలు విశేష ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా, కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి(Karthika Purnima) (నవంబర్ 5, 2025) అత్యంత శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజు చేసే ప్రత్యేక పూజలు, నోములు, దీపారాధనలు ఏడాది పొడవునా చేసిన పుణ్యఫలితాన్ని అందిస్తాయని భక్తులు విశ్వసిస్తారు.
కార్తీక పౌర్ణమి(Karthika Purnima) శుభ తిథి , సమయాలు (2025)పంచాంగం ప్రకారం, కార్తీక పౌర్ణమి తిథి యొక్క ప్రభావం ఈ విధంగా ఉంది. నవంబర్ 4 పౌర్ణమి తిథి రాత్రి 10:30 గంటలకు ప్రారంభం కాగా.. పౌర్ణమి తిథి ముగింపు నవంబర్ 5, సాయంత్రం 6:48 వరకు ఉంటుంది. సూర్యోదయం నుంచి సాయంత్రం వరకు తిథి ప్రభావం నవంబర్ 5, 2025 న ఎక్కువగా ఉండటంతో, ఆ రోజునే కార్తీక పౌర్ణమి వ్రతాన్ని, పూజలను ఆచరించడం శ్రేయస్కరమని పండితులు చెబుతున్నారు.
నవంబర్ 5న పూజ, దీపారాధన శుభ ముహూర్తాలు..కార్యాచరణశుభ సమయం (నవంబర్ 5)పవిత్ర నదీ స్నానం ఉదయం 4:52 నుంచి ఉదయం 5:44 వరకు (బ్రహ్మ ముహూర్తం)ఉదయం పూజా సమయం ఉదయం 7:58 నుంచి ఉదయం 9:00 వరకు సాయంత్రం దీపారాధన సాయంత్రం 5:15 నుంచి సాయంత్రం 7:05 వరకు
365 వత్తుల (Karthika Purnima)దీపారాధన విశిష్టత , విధానం..
కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులు వెలిగించడం అనేది అత్యంత ముఖ్యమైన ఆచారం. ఈ దీపారాధన ఏడాది పొడవునా (365 రోజులు) దీపారాధన చేసిన అపారమైన పుణ్యఫలితాన్ని దక్కుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఉపవాసం ఉండి ఈ దీపారాధన చేయడం వలన భగవంతుని అనుగ్రహం లభిస్తుంది.
ముందుగా 365 వత్తులను గుత్తగా తయారుచేసి, వాటిని ఆవునెయ్యిలో పూర్తిగా నానబెట్టాలి. ఒక వెడల్పాటి మట్టి ప్రమిదను తీసుకుని, అందులో కొద్దిగా ఆవునెయ్యి పోయాలి. ఆ నానబెట్టిన 365 వత్తులను స్థంభం వలె నిలబెట్టాలి. వత్తులను వెలిగించడానికి అగ్గిపుల్ల లేదా కొవ్వొత్తిని ఉపయోగించకూడదు. అగరబత్తిని వెలిగించి, దాని సహాయంతో 365 వత్తులకు దీపారాధన చేయాలి.
దీపం వెలిగించిన తర్వాత మళ్లీ కొద్దిగా నెయ్యి వేయాలి. కుటుంబ సభ్యులు అందరూ భక్తితో 2-3 చుక్కలు నెయ్యిని ఆ దీపంలో వేయడం శుభప్రదం.తర్వాత దీపారాధన స్వరూపంలో ఉన్న కార్తీక దామోదరునికి పసుపు, కుంకుమ, అక్షింతలు సమర్పించాలి.
ఇంటి యజమాని స్వయంగా ఈ దీపారాధన చేస్తే అత్యుత్తమ ఫలితాలు ఉంటాయి. యజమాని దీపం వెలిగించే సమయంలో భార్య, పిల్లలు ఆయన చేయిని పట్టుకోవాలి లేదా ఆయనకు తగిలినా సరిపోతుంది. వత్తులు వెలిగించిన తర్వాత అక్షింతలు చల్లుతూ… “దామోదరం ఆవాహయామి” (విష్ణువుకు సంబంధించింది) లేదా “త్రయంబకం ఆవాహయామి” (శివునికి సంబంధించింది) అని పఠించాలి.
దీపారాధన సమయంలో శివుని అష్టోత్తరం, లింగాష్టకం లేదా పంచాక్షరి మంత్రం (“ఓం నమశ్శివాయ”) ను పఠించడం చాలా శ్రేయస్కరం. చివరగా అగర్ బత్తీలు వెలిగించి, నైవేద్యం సమర్పించి, హారతి ఇవ్వాలి.
కార్తీక పౌర్ణమి(Karthika Purnima) నాడు దీపారాధనతో పాటు ఈ కింద పేర్కొన్న ఆచారాలు పాటిస్తే శివానుగ్రహం , లక్ష్మీ కటాక్షం లభిస్తాయి.తెల్లవారుజామున నిద్రలేచి పవిత్ర నదిలో స్నానం చేయడం ముఖ్యం. నది స్నానం చేయలేనివారు స్నానం చేసే నీళ్లలో కొద్దిగా గంగాజలం లేదా పసుపును కలుపుకుని, పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేయాలి. ఇలా చేయడం వలన తెలిసి చేసిన, తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి.
గడపలకు పసుపు రాసి బొట్లు పెట్టాలి. బియ్యం పిండితో ఇంటి ముందు ముగ్గు వేయడం, ఇంటికి మామిడి తోరణాలు కట్టడం ఐశ్వర్యానికి సూచిక. ఈ రోజు ఆడవారు కాళ్లకు పసుపు రాసుకోవాలి. ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం శుభప్రదం. మట్టి దీపాలు లేదా పిండి దీపాలను (5 లేదా 7) వెలిగించొచ్చు. నారికేళ దీపం (కొబ్బరి దీపం) వెలిగిస్తే చాలా మంచిది. ఈ రోజు రావి చెట్టు కింద లేదా ఉసిరి చెట్టు కింద దీపారాధన చేస్తే పుణ్యం కలుగుతుంది. ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపాలు వెలిగిస్తే శుభ ఫలితాలు ఎదురవుతాయి.
మంత్ర జపం: “ఓం నమశ్శివాయ” లేదా “ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే మంత్రాన్ని 21 సార్లు జపిస్తే మంచిది.ఈ నియమాలతో కార్తీక పౌర్ణమిని ఆచరిస్తే, భక్తులకు అఖండ పుణ్యప్రాప్తి లభించి, శివుడు మరియు లక్ష్మీనారాయణుడి అనుగ్రహం సిద్ధిస్తుంది.
