Shani: ఏలినాటి శని దోషాలతో సతమతమవుతున్నారా? ఈ రెండు శనివారాలు ఇలా చేయండి..

Shani: ప్రస్తుతం పుష్య మాసం చివరికి చేరుకుంది. జనవరి 18న అమావాస్యతో పుష్యమాసం ముగిసిపోనుంది.

Shani

హిందూ ధర్మంలో ప్రతీ మాసానికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. కార్తీక మాసం శివుడికి, మార్గశిరం విష్ణువుకి ఎలాగో.. పుష్యమాసం శనీశ్వరునికి (Shani) అలా అత్యంత ఇష్టమైన కాలం అని పురాణాలు చెబుతాయి. పౌర్ణమి నాడు పుష్యమి నక్షత్రం ఉండటం వల్ల దీనికి పుష్యమాసం అని పేరు వచ్చింది. ఈ ఏడాదిమాసం శనివారంతోనే ప్రారంభం కావడం విశేషంగా చెప్పొచ్చు.

ప్రస్తుతం పుష్య మాసం చివరికి చేరుకుంది. జనవరి 18న అమావాస్యతో పుష్యమాసం ముగిసిపోనుంది. ఈ లోపు వచ్చే రెండు శనివారాలు అంటే జనవరి 10 , జనవరి 17 శని దోష నివారణకు అత్యంత కీలకమైన రోజులుగా పండితులు చెబుతున్నారు

ఇంకా చెప్పాలంటే శని దోష నివారణకురెండురోజులు అద్భుత అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వంటి దోషాలతో బాధపడేవారు.. ఈ మాసంలో శనిదేవుని నిష్టగా ఆరాధిస్తే సత్ఫలితాలు లభిస్తాయి.

ముఖ్యంగా జనవరి 10, 17 తేదీల్లో వస్తున్నశనివారాల్లో నవగ్రహ ప్రదక్షిణలు చేయడం.. అలాగే, శనీశ్వరునికి (Shani) నువ్వుల నూనెతో తైలాభిషేకం నిర్వహించడం వల్ల కష్టాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. అలాగే శని వాహనమైన కాకికి ఆహారం అందించడం వల్ల శనీశ్వరుని కరుణ లభిస్తుంది.

పుష్యమాసంలో కేవలం శని (Shani)ఆరాధన మాత్రమే కాదట.. పితృ తర్పణాలకు కూడా విశేషమైన ప్రాముఖ్యత ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఈ నెల 10, 11, 12 తేదీల్లో వచ్చేతిస్రోష్టకాలసమయంలో పితృదేవతలకు నువ్వులు, నీళ్లు వదిలి తర్పణాలు అర్పిస్తే.. పెద్దల ఆశీస్సులు మెండుగా లభించడమే కాకుండా పితృదోషాలు తొలగి కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి.

Shani

శని పూజ చేసేటప్పుడు కానీ ప్రతిరోజూ ఉదయం కానీక్రింది శ్లోకాన్ని పఠించడం వల్ల మానసిక ప్రశాంతత, కార్యసిద్ధి కలుగుతాయి:

నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం

ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం

నల్లని కాంతితో ప్రకాశించేవాడు, సూర్యపుత్రుడు, యముడికి సోదరుడు అలాగే ఛాయాదేవికి సూర్యునికి జన్మించినవాడు అయిన శనీశ్వరునికి నేను నమస్కరిస్తున్నాను అని భావం.

జనవరి 18తో పుష్యమాసం ముగిసి, 19 నుంచి మాఘ మాసం ప్రారంభం కాబోతోంది. కాబట్టికొద్దిరోజులను భక్తితో వినియోగించుకుని శనిదేవుడి (Shani), పితృదేవతల కృపకు పాత్రులవ్వండి.

Panchangam:పంచాంగం

Exit mobile version