TTD good news
తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూసే స్థానికులకు , భక్తులకు శుభవార్త! వైకుంఠ ద్వార దర్శనం (Vaikuntha Dwara Darshan) కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు కసరత్తులు పూర్తి చేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి తొక్కిసలాట లాంటి ఘటనలు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని టీటీడీ నిర్ణయించింది.
వైకుంఠ ద్వార దర్శనం తేదీలు(TTD good news), టోకెన్ల పంపిణీ..
టీటీడీ నిర్ణయం ప్రకారం, శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు మొత్తం 10 రోజుల పాటు కల్పించనున్నారు.డిసెంబర్ 30వ తేదీ నుంచి ప్రారంభమై, జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం ఉంటుంది.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్.. దర్శనం కోసం భక్తులు నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని టీటీడీ అధికారులు తెలిపారు.
టోకెన్ల వ్యవస్థ (మొదటి 3 రోజులు).. ఈడిప్ (eDip) అనే వ్యవస్థ ద్వారా టోకెన్లను పంపిణీ చేయనున్నారు. మొదటి మూడు రోజులు (డిసెంబర్ 30, 31, జనవరి 1) మాత్రమే ఈ టోకెన్లు తీసుకున్న భక్తులకు శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు.
మిగిలిన 7 రోజులు సర్వదర్శనం.. ఆ తర్వాత మిగిలిన 7 రోజులు (జనవరి 2 నుంచి 8 వరకు) సర్వదర్శనం (ఉచిత దర్శనం) ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ సమయంలో టోకెన్లు తీసుకోకుండానే భక్తులు దర్శనానికి వెళ్లవచ్చని పేర్కొన్నారు.
టీటీడీ అధికారులు తిరుమల , తిరుపతి స్థానికుల కోసం ప్రత్యేక ఏర్పాటు చేశారు.తిరుమల , తిరుపతి ప్రాంతాలకు చెందిన భక్తులకు జనవరి 6, 7, 8 తేదీలలో ఆన్‌లైన్‌లో టోకెన్లు పంపిణీ చేస్తామని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. స్థానికులకు దర్శనంలో ప్రాధాన్యత ఇవ్వడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.
గతంలో వైకుంఠ ద్వార దర్శన సమయంలో జరిగిన తొక్కిసలాట, తోపులాట ఘటనలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి టీటీడీ మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, క్యూ లైన్లలో సరైన నిర్వహణ, పంపిణీ కేంద్రాలలో పారదర్శకత , భద్రతా చర్యలు తీసుకునేందుకు అధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు.
