Monalisa: కుంభమేళా సెన్సేషన్ మోనాలిసా వివాహం..చిన్న వయసులోనే పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది?

Monalisa : చేతిలో పూసల మాలలు పట్టుకుని, అమాయకత్వమే ఆభరణంగా చిరునవ్వు చిందిస్తూ కనిపించిన ఒక సాధారణ అమ్మాయిని.. కెమెరాలలో బంధించి సోషల్ మీడియాలో పెట్టడంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.

Monalisa

ఎప్పుడు ఎవరి జీవితం ఎలా మలుపులు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. సెలబ్రెటీలుగా ఓ వెలుగు వెలిగిన వాళ్లు ఎక్కడో ఫుట్‌పాత్‌పైనో కనిపించి షాకులు ఇచ్చిన ఘటనలు.. అలాగే ఎవరికీ ఏమాత్రం తెలియనివాళ్లు రాత్రికి రాత్రి స్టార్ తిరిగిపోయి సెలబ్రెటీలయిపోయిన సంఘటనలు చాలానే చూస్తుంటాం. అచ్చంగా అలాగే సెలబ్రెటీ అయిపోయిన ప్రయాగ్ రాజ్ మోనాలిసా మరోసారి వార్తల్లోకి ఎక్కింది. కెరీర్ స్టార్టింగ్‌లోనే పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది.

2025లో ప్రయాగరాజ్‌లో జరిగిన మహా కుంభమేళా ఎంత గ్రాండ్‌గా జరిగిందో అందరికీ తెలిసిందే. ఆ సమయంలో కోట్లాది మంది భక్తుల జనసమూహం, వేల సంఖ్యలో కెమెరాలు ఉంటుండగానే.. మరోవైపు కొన్ని కెమెరాలు మాత్రం ఒక్క చోటే ఆగిపోయాయి. చేతిలో రుద్రాక్ష పూసలు, వేరే ఇతర రకాల పూసల మాలలు పట్టుకుని, అమాయకత్వమే ఆభరణంగా చిరునవ్వు చిందిస్తూ కనిపించిన ఒక సాధారణ అమ్మాయిని.. కెమెరాలలో బంధించి సోషల్ మీడియాలో పెట్టడంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.

ఎందుకంటే అప్పటివరకు కేవలం పూసలమ్ముకునే(Monalisa) ఆ 18 ఏళ్ల యువతి..ఇంటర్నెట్‌ను శాసించే గ్లోబల్ సెన్సేషన్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. మంత్రముగ్ధుల్ని చేసే ఆ కళ్లు, స్వచ్ఛమైన పల్లెటూరి అందం.. ఒక పేదపిల్ల నుంచి గ్లామర్ ప్రపంచపు యువరాణిగా ఆమెను మార్చేశాయి. సినిమాల్లో అవకాశాలు క్యూ కడుతూ రెడ్ కార్పెట్ పరిచారు. అయితే తన కెరీర్ ఎదుగుతున్న సమయంలో, తన ప్రేమ కోసం కన్నతండ్రినే ఎదిరించి మరీ , ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కి మూడు ముళ్లు వేయించుకోవడంతో ఆమె మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది.

మలయాళంలో ‘నాగమ్మ’ అనే మూవీ షూటింగ్ కోసం సాక్షి ఖేర్ (Sakshi Kher) కేరళలో ఉన్న సమయంలో.. ఈ నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేరళకు చెందిన ఫర్మాన్ ఖాన్ అనే యువకుడితో ఎనిమిది నెలలుగా సాగుతున్న ప్రేమాయణం ఆమె తండ్రికి అస్సలు నచ్చలేదు. షూటింగ్ స్పాట్‌కు వచ్చి మరీ తన తండ్రి బలవంతంగా తీసుకువెళ్లేందుకు ప్రయత్నించడంతో, మోనాలిసా(Monalisa)లోని ఎదురు తిరిగింది.

Monalisa

పూసలమ్ముకునే రోజుల్లోనే ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న సాక్షి ఖేర్’ (Sakshi Kher), ఇప్పుడు తన జీవితం కోసం పోరాడటానికి వెనకాడలేదు. తిరువనంతపురం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, తన తండ్రి నుంచి తనకు ప్రాణహాని ఉందని, తన వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను మేజర్‌నని, తనకి నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు ఉందని పోలీసులకు చెప్పింది. అంతేకాదు పోలీసుల పర్యవేక్షణలోనే, తిరువనంతపురంలోని ఒక ఆలయంలో ఫర్మాన్ ఖాన్‌తో తాళి కట్టించుకుని తన ప్రేమను గెలిపించుకుంది. ఈ పెళ్లికి కేరళ మంత్రులు, ప్రముఖ రాజకీయ నాయకులు హాజరవ్వడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రస్తుతం హిందీలో ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ అనే సినిమాతో వెండితెరపై మెరవబోతున్న సాక్షి ఖేర్.. తెలుగులో ‘లైఫ్’ అనే సినిమాతో మన ప్రేక్షకులను కూడా పలకరించబోతోంది. మరి ఈ కుంభమేళా మోనాలిసా(Monalisa) ప్రయాణం ముందు ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version