Tulaja Bhavani: తుళజా భవానీ.. శత్రు నాశనం, విజయం ప్రసాదించే తల్లి

Tulaja Bhavani:తుళజాపూర్‌లో వెలసిన శ్రీ తుళజా భవానీ ఆలయం కేవలం ఒక శక్తిపీఠం మాత్రమే కాదు, మరాఠా సామ్రాజ్య వైభవానికి, వీరత్వానికి ప్రేరణాస్రోతస్సు.

Tulaja Bhavani

మహారాష్ట్రలోని తుళజాపూర్‌లో వెలసిన శ్రీ తుళజా భవానీ ఆలయం కేవలం ఒక శక్తిపీఠం మాత్రమే కాదు, మరాఠా సామ్రాజ్య వైభవానికి, వీరత్వానికి ప్రేరణాస్రోతస్సు. ఛత్రపతి శివాజీ మహారాజు నుంచి మరాఠా రాజవంశం వరకు అందరూ తుళజా భవానీని తమ కుల దైవంగా ఆరాధించేవారు. పురాణాల ప్రకారం, సతీదేవి శరీరంలోని ఎగువ పెదవి (ఊర్ధ్వ ఓష్ఠం) భాగం ఇక్కడ పడింది.

పురాణ వైభవం & చారిత్రిక ప్రాముఖ్యత..12వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని కదంబ వంశీయుడైన మరాఠా మహామండలేశ్వర మారదేవుడు నిర్మించాడు. నాటి నుంచి, పాలికర్ భోపే వంశస్థులు ఈ ఆలయ నిర్వహణ మరియు పూజా విధానాలను పర్యవేక్షిస్తున్నారు. మరాఠా చరిత్రలో తుళజా భవానీకి అపారమైన ప్రాముఖ్యత ఉంది. ఛత్రపతి శివాజీ మహారాజు ప్రతి యుద్ధానికి ముందు తుళజా భవానీని పూజించి, ఆమె ఆశీర్వాదం తీసుకుని వెళ్ళేవారు. భోన్‌స్లె రాజవంశం వారు ఈ దేవిని తమ ఇష్టదైవంగా భావించేవారు.

Tulaja Bhavani

తుళజా భవానీ(Tulaja Bhavani)ని తులజా, తురజా, త్వరితా, దుర్గా, పార్వతి, త్రిపుర సుందరి, భగవతి, అంబా, జగదంబా వంటి అనేక పేర్లతో వివిధ ప్రాంతాలలో పిలుస్తారు. దేవత విగ్రహం అష్టభుజ (ఎనిమిది చేతులు) రూపంలో ఉంది. ప్రతి చేతిలో వివిధ ఆయుధాలను ధరించి ఉంటుంది. ఈ రూపం భక్తులకు శత్రు నాశనం, విజయం మరియు కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయని విశ్వాసం.

ముఖ్యంగా సైనికులు, పోలీసులు ,రక్షణ రంగంలో పనిచేసే వారు ఈ దేవిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. నవరాత్రి, దసరా , చైత్ర నవరాత్రులలో లక్షలాది భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తారు. తుళజా భవానీ ఆలయం మరాఠా భక్తి ఉద్యమానికి ఒక కేంద్రంగా నిలిచింది.

సోలాపూర్ నుంచి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో తుళజాపూర్ ఉంది. ముంబయి , పూణే నుంచి రైలు, బస్సు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. సోలాపూర్ రైల్వే స్టేషన్ నుంచి తుళజాపూర్‌కు ప్రత్యేక బస్సులు నడుస్తాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Exit mobile version