Puja room: పూజ గదిలో ఏ దేవుళ్ల విగ్రహాలు, ఫోటోలు ఉండాలి? ఏవి ఉండకూడదు? తెలుసా మీకు..

Puja room:పూజ గదిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలి. పూజ గదిలో విగ్రహాలు లేదా ఫోటోల సంఖ్యను కూడా పరిమితంగా ఉంచుకోవాలి.

Puja room

ఇంట్లో పూజ గదికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం ఒక గది మాత్రమే కాదు, సానుకూల శక్తికి, పవిత్రతకు నిలయం. అందుకే పూజ గదిని వాస్తు నియమాల ప్రకారం శుభ్రంగా, పవిత్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. వాస్తు శాస్త్రం ప్రకారం, పూజ గదిలో ఏ విగ్రహాలు లేదా ఫోటోలను ఉంచాలి, వేటిని ఉంచకూడదనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

పూజ గది(Puja room)లో ఉంచదగిన విగ్రహాలు లేదా ఫోటోల గురించి చూస్తే.. రాధా-కృష్ణ(Radha Krishna) విగ్రహాన్ని పూజ గదిలో ఉంచడం చాలా శుభప్రదం. ఇది ప్రేమ, సామరస్యం, అనుబంధానికి ప్రతీక. ఈ విగ్రహాలను పూజించడం వల్ల ఇంట్లో శాంతి, సంతోషం పెరుగుతాయి.

పూజ గది(Puja room)లో ఎల్లప్పుడూ ప్రశాంత భంగిమలో విగ్రహాలు అంటే ప్రశాంతంగా, సంతోషంగా లేదా ఆశీర్వదించే భంగిమలో ఉన్న దేవుళ్ల విగ్రహాలను మాత్రమే ఉంచాలి. ఇలాంటి విగ్రహాలు ఇంట్లో సానుకూల వాతావరణాన్ని ప్రోత్సహిస్తాయి.

puja room

పూజ గది(puja room)లో ఉంచకూడని విగ్రహాలు చూస్తే..విష్ణువు-శివలింగం కలిపి ఉంచవద్దు: శివ, విష్ణువు ఇద్దరినీ ఒకే చోట, ఒకే వేదికపై ఉంచకూడదు. ఎందుకంటే వీరిని పూజించే పద్ధతులు వేర్వేరుగా ఉంటాయి. ఇది పూజలో భేదాన్ని సృష్టిస్తుంది.

బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడి విగ్రహాలను లేదా చిత్రాలను కలిపి పూజ గదిలో ఉంచకూడదు. వాస్తు నియమాల ప్రకారం ఇది సరైనదిగా పరిగణించబడదు. కాళికాదేవి, శనీశ్వరుడు, రాహువు, కేతువు వంటి ఉగ్ర స్వభావం గల దేవతల విగ్రహాలను ఇంట్లో పూజ గదిలో ఉంచకూడదు. ఈ దేవతలను ప్రత్యేక ఆచారాలతో, ప్రత్యేక స్థలాల్లో పూజించాల్సి ఉంటుంది.

దేవతల విగ్రహాలను కోపంగా లేదా విధ్వంసం చేస్తున్న భంగిమలో ఉన్నవి పూజ గదిలో ఉంచడం మంచిది కాదు. ఇది ఇంట్లో ప్రతికూల శక్తిని సృష్టిస్తుంది. పడకగదిలో హనుమంతుడి విగ్రహాన్ని లేదా చిత్రాన్ని ఉంచకూడదు. హనుమంతుడు బ్రహ్మచారి కాబట్టి, ఆయన విగ్రహాన్ని ప్రత్యేకంగా పూజ గదిలో మాత్రమే ఉంచాలి.

puja room

మరణించిన కుటుంబ సభ్యుల చిత్రాలను లేదా విగ్రహాలను పూజ గదిలో ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల పూజ స్థలం పవిత్రత దెబ్బతింటుందని వాస్తు చెబుతుంది.అలాగే పూజ గదిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలి. ప్రతిరోజూ శుభ్రం చేసి, దుమ్ము లేకుండా చూసుకోవాలి. పూజ గదిలో విగ్రహాలు లేదా ఫోటోల సంఖ్యను కూడా పరిమితంగా ఉంచుకోవాలి.

గమనిక: ఈ సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని శాస్త్రీయంగా ధృవీకరించలేము కాబట్టి.. పాఠకులు తమ నమ్మకాల మేరకు ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవచ్చు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Exit mobile version