Mohammed Shami: మహ్మద్ షమీకి ఛాన్స్..  కివీస్ తో సిరీస్ కు పిలుపు ?

Mohammed Shami: కివీన్తో వన్డే సిరీస్ కు అతన్ని ఎంపిక చేస్తారని వార్తలు వస్తున్నాయి. 2023 వన్డే ప్రపంచకప్ లో షమీ (Mohammed Shami)అద్భుతంగా రాణించాడు.

Mohammed Shami

భారత క్రికెట్ జట్టులో ఇప్పుడు అంతా యువ ఆటగాళ్లదే హవా.. ముఖ్యంగా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎక్కువ శాతం యువ క్రికెటర్లకే జట్టులో ప్రాధాన్యత దక్కుతోంది. ఈ క్రమంలోనే స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి సైతం టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చింది. అటు బౌలింగ్ లోనూ జట్టులో ఎక్కువ మంది యువ పేనర్లకే చోటు దక్కుతోంది. దీంతో సీనియర్ పేసర్లు బుమ్రా, సిరాజ్ తప్పిస్తే మిగిలిన వారికి నిరాశే మిగులుతోంది.

సీనియర్ పేనర్ మహ్మద్ షమీ(Mohammed Shami) విషయంలో ఇదే జరిగింది. దాదాపు 9 నెలలుగా జాతీయ జట్టుకు అతను దూరమయ్యాడు. ఫిటెనెస్ నమస్యలు కూడా ప్లేస్ లేకపోవడానికి కారణమయ్యాయి. సహజంగానే ఫాస్ట్ బౌలర్లకు గాయాలు, ఫిటెనెస్ సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. షమీ(Mohammed Shami) ఫిటెనెస్ నమస్యలను అధిగమించి దేశవాళీతో రాణిస్తున్నా సెలక్టర్లు కొంతకాలంగా పట్టించుకోవడం లేదు. దీనిపై విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఈ వెటరన్ పేసర్ కు మళ్లీ పిలుపు దక్కనున్నట్లు సమాచారం.

కివీన్తో వన్డే సిరీస్ కు అతన్ని ఎంపిక చేస్తారని వార్తలు వస్తున్నాయి. 2023 వన్డే ప్రపంచకప్ లో షమీ (Mohammed Shami)అద్భుతంగా రాణించాడు. ఆ మెగా టోర్నీలో లీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచాడు. అయితే తర్వాత చీలమండ గాయంతో ఇబ్బంది పడడం, నర్జరీ చేయించుకోవడం.. ఈ కారణంగా ఏడాది పాటు ఆటకు దూరమయ్యాడు. అదే సమయంలో యువ పేనర్లు జట్టులోకి రావడంత షమీని మెల్లిగా సైడ్ చేసేసారు. ఇంగ్లాండ్ తో టీ20 సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇచ్చిన షమీ ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా ఎంపికయ్యాడు.

Mohammed Shami

ఛాంపియన్స్ ట్రోఫీలో రాణించినా సెలక్టర్లు అతన్ని పట్టించుకోలేదు. ఇక ఐపీఎల్ 2025 సీజన్ లో ఘోరంగా విఫలమవడంతో జాతీయ జట్ట ఎంపికలో పరిగణలోకి కూడా రాకుండా పోయాడు. ఇంగ్లాండ్, వెస్టిండీన్, సౌతాఫ్రికా సిరీస్ లకు సైతం అతన్ని ఎంపిక చేయలేదు. దీంతో ఈ బెంగాల్ పేనర్ కెరీర్ ముగిసినట్టేనని అంతా భావించారు. ఫిటెనెస్ తో లేని కారణంగానే ఎంపిక చేయలేదంటూ బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అగార్కర్ చేసిన కామెంట్స్ కు షమీ ఆటతోపాలు మాటతోనూ కౌంటర్ ఇచ్చాడు. తాను ఫిట్ గా లేకుంటే రంజీలు ఎలా ఆడతానంటూ ఎదురు ప్రశ్నించాడు.

అంతేకాదు రంజీ ట్రోఫీలో బెంగాల్ తరపున బరిలోకి దిగి అద్భుత ప్రదర్శనలతో చెలరేగిపోయాడు. 20 వికెట్లతో సెలక్టర్లకు సవాల్ విసిరాడు. ఈ క్రమంలో అతన్ని పక్కన పెట్టడంపైనా, అగార్కర్ చెప్పిన ఫిటెనెస్ కారణంపైనా విమర్శలు వెల్లువెత్తాయి. పైగా దేశవాళీ ప్రదర్శనలతోనే జట్టును ఎంపిక చేస్తున్నామంటూ పడేపదే చెబుతున్న అగార్కర్, గంభీర్లను షమీ (Mohammed Shami)తన ప్రదర్శనలతో డిఫెన్స్ లో పడేశాడు.

ఇటీవల భారత పేస్ బౌలింగ్ బుమ్రా లేకుంటే బలహీన పడిందన్న అభిప్రాయం కూడా షమీ వైపు మళ్లీ చూసేలా చేసినట్టు పలువురు భావిస్తున్నారు. రంజీ ట్రోఫీ మాత్రమే కాదు తర్వాత జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీలోనూ షమీ (Mohammed Shami)అదరగొట్టాడు. దీంతో సెలక్టర్లు వచ్చే న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు అతన్ని ఎంపిక చేసే అవకాశాలున్నాయి. ఈ సీనియర్ పేనర్ ఇప్పటి వరకూ 64 టెస్టుల్లో 229, 105 వన్డేల్లో 206, 25 టీ ట్వంటీల్లో 27 వికెట్లు తీశాడు. కివీస్ పైనా చెలరేగితే 2027 వన్డే ప్రపంచకప్ ప్రాబబుల్స్ లోనూ అతన్ని పరిగణలోకి తీసుకునే ఛాన్సుంది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version