Asia Cup: రెచ్చగొట్టారు అందుకే చితక్కొట్టా ఫైనల్లో ఇన్నింగ్స్ పై తిలక్ వర్మ

Asia Cup: ఎయిర్ పోర్టులో భారీ అభిమానుల మధ్య స్వాగతం అందుకున్న తిలక్ వర్మకు తన క్రికెట్ అకాడమీలోనూ అభిమానులు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు.

Asia Cup

ఆసియాకప్ (Asia Cup)టోర్నీ ఆరంభం నుంచీ చప్పగానే సాగినా… ఫైనల్ మాత్రం అభిమానులకు అసలైన కిక్కు ఇచ్చింది. ఉత్కంఠ పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై భారత్ విజయం సాధించి తొమ్మిదో సారి ట్రోఫీని సొంతం చేసుకుంది. అయితే ఈ విజయం వెనుక అసలైన హీరో హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మనే.. ఎందుకంటే 20 రన్స్ కే 3 వికెట్లు కోల్పోయినప్పుడు ఎంత ఒత్తిడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Asia Cup

అలాంటి ఒత్తిడిలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన తిలక్ వర్మ జట్టును గెలిపించాడు. సంజూ శాంసన్ , శివమ్ దూబేలతో కీలక పార్టనర్ షిప్స్ నెలకొల్పి విజయాన్నందించాడు. పాక్ పై టైటిల్ విజయం దక్కడంతో తిలక్ వర్మ కూడా చాలా ఎమోషనల్ అయ్యాడు. తాజాగా స్వదేశానికి తిరిగి వచ్చిన తిలక్ వర్మకు హైదరాబాద్ లో సొంత అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. తాను క్రికెట్ ట్రైనింగ్ తీసుకున్న లింగపల్లిలోని లేగల క్రికెట్ అకాడమీని సందర్శించిన తిలక్ వర్మ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడాడు.

Asia Cup

ఈ సందర్భంగా ఆసియాకప్(Asia Cup) ఫైనల్లో తాను ఆడిన ఇన్నింగ్స్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ఫైనల్ మ్యాచ్ లో పాక్ ఆటగాళ్ళు చాలాసార్లు రెచ్చగొట్టారన్నాడు. తాను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా పనికిమాలిన మాటలు మాట్లాడుతూ స్లెట్జింగ్ చేశారన్నాడు. ఇది ముంబై కాదు… ఇది ఐపీఎల్ కాదంటూ పాక్ వికెట్ కీపర్ మాట్లాడిన మాటలు స్టంప్స్ మైక్ లో రికార్డయ్యాయి.

Asia Cup

వాళ్ళు రెచ్చగొట్టినా తాను సహనం కోల్పోకుండా బ్యాట్ తో జవాబిచ్చానని గుర్తు చేసుకున్నాడు. వాళ్ళ మాటలకు కోపం వచ్చినా ఉద్వేగానికి లోనుకాకుండా బ్యాటింగ్ పైనే ఫోకస్ పెట్టానని చెప్పాడు. కాసేపు క్రీజులో ఉంటే పెద్ద ఇన్నింగ్స్ ఆడే కాన్ఫిడెన్స్ వస్తుందని,. తాను అదే చేశానని తిలక్ వర్మ చెప్పుకొచ్చాడు. మ్యాచ్ గెలిచిన తర్వాత ఎంతో గర్వంగా అనిపించిందని, అందుకే మైదానంలోనే పంచ్ లు విసురుతూ సెలబ్రేట్ చేసుకున్నట్టు గుర్తు చేసుకున్నాడు. భారత్ గెలుపును పాక్ ఆటగాళ్ళు జీర్ణించుకోలేకపోయారని, అందుకే మ్యాచ్ తర్వాత మొహం చాటేశారని తిలక్ వర్మ చెప్పాడు.

ఎయిర్ పోర్టులో భారీ అభిమానుల మధ్య స్వాగతం అందుకున్న తిలక్ వర్మకు తన క్రికెట్ అకాడమీలోనూ అభిమానులు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. వారిని ఉత్సాహపరుస్తూ జాతీయ జెండా పట్టుకుని ఆసియాకప్ విజయాన్ని తిలక్ వర్మ సెలబ్రేట్ చేసుకున్నాడు. తిలక్ వర్మ రాకతో లింగపల్లి లేగల క్రికెట్ అకాడమీలో పండుగ వాతావరణం నెలకొంది. వందలాది మంది అభిమానులు తిలక్ వర్మను చూసేందుకు తరలివచ్చారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version