Cricket: న్యూజిలాండ్ తో వన్డే సిరీస్..  శనివారం భారత జట్టు ఎంపిక

Cricket: కెప్టెన్ శుభమన్ గిల్ రీఎంట్రీ ఖాయమైంది. మెడనొప్పితో సౌతాఫ్రికా సిరీస్ మధ్యలోనే తప్పుకున్న గిల్ ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీ ఆడనున్నాడు.

Cricket

న్యూజిలాండ్ వన్డే సిరీస్ కోసం భారత (Cricket)జట్టును శనివారం ప్రకటించనున్నారు. దీని కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ ముంబైలో సమావేశం కానుంది. సౌతాఫ్రికాతో సిరీస్(Cricket) తర్వాత టీమిండియాకు 3 వారాల రెస్ట్ దొరికింది. అయినప్పటకీ పలువురు భారత క్రికెటర్లు విజయ్ హజారే ట్రోఫీలో బిజీగా ఉన్నారు. ఈ దేశవాళీ టోర్నీలో ప్రదర్శనను కూడా సెలక్టర్లు పరిగణలోకి తీసుకోనుండడంతో జట్టులో పలు మార్పులు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

కెప్టెన్ శుభమన్ గిల్ రీఎంట్రీ ఖాయమైంది. మెడనొప్పితో సౌతాఫ్రికా సిరీస్ మధ్యలోనే తప్పుకున్న గిల్ ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీ ఆడనున్నాడు. దీంతో కివీస్ తో సిరీస్ ద్వారా మళ్లీ జట్టు పగ్గాలు అందుకుంటాడు. శ్రేయాస్ అయ్యర్ రీఎంట్రీపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ నుంచి క్లియరెన్స్ రావాల్సి ఉంది. ఇక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతుండగా.. రుతురాజ్ గైక్వాడ్ , నితీశ్ కుమార్ రెడ్డిలకు చోటు ఖాయం. స్పిన ఆల్ రౌండర్ కోటాలో జడేజా, వాషింగ్టన్ సుందర్ లకు చోటు దక్కనుంది. బుమ్రాకు రెస్ట్ ఇస్తుండడంతో పేస్ ఎటాక్ లో అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ కృష్ణ, హర్షిత్ రాణా చోటు దక్కించుకునే అవకాశముంది.

ఇదిలా ఉంటే వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ కు చోటు దక్కే అవకాశాలు లేనట్టే. పంత్ అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నాడు. గతేడాది చాంపియన్స్‌‌ ట్రోఫీ, సౌతాఫ్రికాతో సిరీస్‌‌ కోసం ఎంపికైనప్పటకీ పంత్‌‌కు ఫైనల్‌‌ ఎలెవన్‌‌లో ఆడే ప్లేస్ లేకుండా పోయింది. కారు ప్రమాదం నుంచి తిరిగి వచ్చిన తర్వాత కొలంబోలో ఒకే ఒక్క వన్డే ఆడినా పెద్దగా ఆకట్టుకోలేదు.

Cricket

దీంతో వన్డే జట్టు వికెట్ కీపింగ్ రేసులో వెనుకబడ్డాడు. అదే సమయంలో కేఎల్ రాహుల్ ను సెలక్టర్లు వికెట్ కీపర్ బ్యాటర్ గా ఎంపిక చేశారు. ఇప్పుడు రాహుల్ తో పాటు ఇషాన్ కిషన్ కూడా పంత్ కు గట్టిపోటీనిస్తున్నాడు. జాతీయ జట్టుకు దూరమైన తర్వాత ఇషాన్ కిషన్ దేశవాళీ క్రికెట్ లో అదరగొడుతున్నాడు. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో 500 ప్లస్ పరుగులు చేయడం ద్వార టీ20 ప్రపంచకప్ కు ఎంపికయ్యాడు.

కివీస్ తో వన్డే సిరీస్(Cricket) కోసం మహ్మద్ షమీ రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. షమీ చివరిసారిగా గత ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు. 2023 వన్డే ప్రపంచకప్ లో అద్భుతమైన బౌలింగ్ తో లీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచిన షమీని గాయాలు వెంటాడాయి. గాయం నుంచి కోలుకుని మళ్లీ ఫిట్ నెస్ సాధించినా అనుకున్న రీతిలో రాణించలేదు.

ఫలితంగా జాతీయ జట్టుకు దూరమయ్యాడు. బుమ్రాకు విశ్రాంతినివ్వాలని సెలక్టర్లు భావిస్తుండడం కూడా షమీకి లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది. న్యూజిలాండ్‌(Cricket)తో జరిగే వన్డేలకు హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను కూడా తీసుకునే అవకాశం ఉంది.సిరాజ్ చివరిసారిగా 2025 అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్ ఆడాడు. కాగా జనవరి 11 నుంచి వడదోర వేదికగా ఈ మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version