Vaibhav: నా షూ కిందరా నీ స్థానం.. పాక్ బౌలర్ కు ఇచ్చిపడేసిన వైభవ్

Vaibhav: ఈ మ్యాచ్ లో భారత యువ సంచలన వైభవ్ సూర్యవంశీ ఆరంభంలో మెరుపు బ్యాటింగ్ చేశాడు. క్రీజులో ఉన్నది కొద్దిసేపే అయినా, ఆడింది 10 బంతులే అయినా పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

Vaibhav

వరల్డ్ క్రికెట్ లో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే అదొక యుద్ధమే.. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా తెగిపోవడంతో ఇరు జట్లు కేవలం ఐసీసీ టోర్నీలు, ఆసియాకప్ వంటి వాటిలోనే తలపడతున్నాయి. ఈ మ్యాచ్ క్రికెట్ కు మించి ఉంటుంది. భావోద్వేగాలతో కూడిన సమరంగా చెబుతుంటారు. సీనియర్ క్రికెట్ టీమ్, అయినా భారత్ ఏ జట్టు అయినా, అండర్ 19 జట్టు అయినా ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య స్లెడ్జింగ్ , గొడవలు సర్వసాధారణం… తాజాగా అండర్ 19 ఆసియాకప్ ఫైనల్లో భారత్, పాకిస్థాన్ తలపడ్డాయి.

ఈ మ్యాచ్ లో భారత యువ సంచలన వైభవ్ సూర్యవంశీ ఆరంభంలో మెరుపు బ్యాటింగ్ చేశాడు. క్రీజులో ఉన్నది కొద్దిసేపే అయినా, ఆడింది 10 బంతులే అయినా పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. దీంతో సహనం కోల్పోయిన పాక్ ఆటగాళ్లు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా తనను ఔట్ చేసిన తర్వాత ఓవరాక్షన్ చేస్తున్న పాక్ పేసర్ కు వైభవ్ సూర్యవంశీ గ్రౌండ్ లోనే ఇచ్చిపడేశాడు.

Vaibhav

మొదట రెండు ఓవర్లు పాక్ బౌలర్లను వైభవ్(Vaibhav) ఆటాడుకున్నాడు. భారత స్కోరు 49 పరుగుల వద్ద ఉన్నప్పుడు వైభవ్ సూర్యవంశీ.. అలీ రజా బౌలింగ్‌లో కీపర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ టోర్నీలో సూపర్ ఫామ్‌లో ఉన్న వైభవ్ సూర్యవంశీ వికెట్ పడటంతో పాక్ ఆటగాళ్లంతా సంబరాల పేరుతో కాస్త అత్యుత్సాహం ప్రదర్శించారు. ఔటై సైలెంట్‌గా పెవిలియన్ వైపు వెళ్తున్న వైభవన్ పాక్ పేసర్ అలీ రజా రెచ్చగొట్టాడు. మరో పాక్ ప్లేయర్ కూడా అతడిని ఉద్దేశించి ఓ చెప్పరాని కామెంట్ చేశాడు. దీంతో చిర్రెత్తిన వైభవ్‌ ఘాటుగా బదులిచ్చాడు. వెనక్కి తిరిగి పాక్ జట్టుకు తన షూను చూపించాడు.

దీంతో మీ స్థానం నా షూ కిందరా అని వైభవ్(Vaibhav) చెబుతున్నట్టు వీడియో చూస్తే అర్థమవుతోంది. దీంతో సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. పాక్ ఓవరాక్షన్ కు వైభవ్ గట్టిగానే ఇచ్చిపడేశాడంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పాక్ బౌలర్లను అంపైర్ల్ వారించారు. వైభవ్(Vaibhav) ను కూడా పెవిలియన్ కు పంపించడంతో గొడవ సద్దుమణిగింది. ఆటతీరు ఎలా ఉన్నా పాక్ ఓవరాక్షన్ తగ్గలేదంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో భారత్ 191 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మొదట బ్యాటింగ్ కు దిగిన పాక్ అండర్ 19 జట్టు 347 పరుగులు చేయగా.. భారత్ 156 పరుగులకే ఆలౌటైంది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version