Gautam Gambhir: గంభీర్.. నీకో దండం.. ఏకిపారేస్తున్న ఫ్యాన్స్

Gautam Gambhir: సౌతాఫ్రికాతో సిరీస్ ఆరంభానికి ముందు అసలు సఫారీ జట్టు కనీస పోటీ ఇస్తుందా అన్న అనుమానాలు వచ్చాయి. పైగా ఆ టీమ్ మన దేశంలో టెస్ట్ మ్యాచ్ గెలిచి 15 ఏళ్ళు దాటిపోయింది.

Gautam Gambhir

టెస్ట్ జట్టు కోచ్ గా గంభీర్ (Gautam Gambhir)పనికిరాడా.. అంటే అవుననే అనాల్సి వస్తోంది. హెడ్ కోచ్ గా అతను బాధ్యతలు చేపట్టిన తర్వాత కేవలం వైట్ బాల్ ఫార్మాట్ లో మాత్రమే మంచి ఫలితాలు వచ్చాయి. ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది.. ఆసియాకప్ నిలబెట్టుకుంది.. కానీ టెస్టుల్లో మాత్రం రోజురోజుకూ దారణంగా దిగజారిపోతోంది. పోనీ విదేశాల్లో మన సంగతి ఇంతేలే అనుకుని సరిపెట్టుకోవడానికి లేదు..

స్వదేశంలో అది కూడా మనకు అలవాటైన పిచ్ లపై వరుస సిరీస్ ఓటములు మింగుడు పడడం లేదు. గత ఏడాది న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ పరాభవం నుంచి పాఠాలు నేర్చుకోని గంభీర్ (Gautam Gambhir)ఇప్పుడు సౌతాఫ్రికా చేతిలోనూ మరో ఘోరపరాజయాన్ని చవిచూడబోతున్నాడు. అద్భుతం జరిగినా కూడా సౌతాఫ్రికా చేతిలో సిరీస్ ఓటమి ఖాయమైపోయింది. రెండో టెస్టులో భారత జట్టు గెలవడం అసాధ్యంగానే కనిపిస్తోంది. దీంతో ఫ్యాన్స్ గంభీర్ ను ఏకిపారేస్తున్నాడు. కోచ్ గా అతన్ని పీకిపారేయమంటున్నారు.

సౌతాఫ్రికాతో సిరీస్ ఆరంభానికి ముందు అసలు సఫారీ జట్టు కనీస పోటీ ఇస్తుందా అన్న అనుమానాలు వచ్చాయి. పైగా ఆ టీమ్ మన దేశంలో టెస్ట్ మ్యాచ్ గెలిచి 15 ఏళ్ళు దాటిపోయింది. ఈడెన్ టెస్టులో స్పిన్ పిచ్ ను ఎంచుకుని బొక్క బోర్లా పడిన భారత్ సిరీస్ లో వెనుకబడిపోయింది. పోనీ రెండో టెస్టుకైనా మంచి పిచ్ ను రెడీ చేసుకుందా అంటే అదీ లేదు. పైగా తుది జట్టు ఎంపిక దగ్గర నుంచి బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పుల వరకూ గంభీర్ (Gautam Gambhir)పిచ్చి ప్రయోగాలు కొంపముంచాయి.

Gautam Gambhir

ప్రతీసారీ ఆల్ రౌండర్లనే నమ్ముకుంటూ, స్పెషలిస్ట్ బ్యాటర్లను, స్పెషలిస్ట్ బౌలర్లను పక్కన పెట్టేయడం గంభీర్ (Gautam Gambhir)కు అలవాటుగా మారింది. మూడో స్థానంలో వాషింగ్టన్ సుందర్ ను ఆడించాలన్న పిచ్చి ప్రయోగం, సాయి సుదర్శన్ ను పక్కన పెట్టడం.. మళ్ళీ రెండో టెస్టుకు సుందర్ ను ఏడో స్థానంలో బ్యాటింగ్ కు దింపడం.. ఇలా పనికిమాలిన ప్రయోగాలు చేస్తూ ఓటములకు కారణమవుతున్నాడు.

అటు నితీశ్ కుమార్ రెడ్డిని ఆల్ రౌండర్ కోటాలోనే తీసుకున్నామని చెప్పినా కేవలం ఆరు ఓవర్లే బౌలింగ్ చేయించడం వెనుక లాజిక్ ఏంటో ఎవ్వరికీ అర్థం కాలేదు. బ్యాటర్లను టెస్ట్ ఫార్మాట్ కు తగ్గట్టు బ్యాటింగ్ చేసేలా కనీసం వారిలో స్ఫూర్తి కూడా నింపడం లేదంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే పలువురు సీనియర్ ఆటగాళ్ళను జట్టు నుంచి సాగనంపి తప్పు చేశాడంటున్నారు. అలాగే పుజారా, రహానే లాంటి టెస్ట్ స్పెషలిస్టులను పక్కన పెట్టి పూర్తిగా యువ ఆటగాళ్ళపైనే ఆధారపడి మూల్యం చెల్లించుకుంటున్నాడంటూ ఓ రేంజ్ లో తిట్టి పోస్తున్నారు. టెస్ట్ ఫార్మాట్ లో బ్యాటింగ్ స్థానాలను ఇష్టమొచ్చినట్టు మారుస్తూ మ్యూజికల్ ఛైర్ ఆడుకుంటున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version