ICC U19 World Cup 2026 : కుర్రాళ్ళు అదరగొట్టేస్తారా ?..అండర్ 19 వరల్డ్‌కప్ కు అంతా రెడీ

ICC U19 World Cup 2026 : అండర్-19 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ వచ్చేసింది..ఇండియా తొలి మ్యాచ్ ఎప్పుడంటే?

ICC U19 World Cup 2026

ఒకవైపు భారత్ , న్యూజిలాండ్ వన్డే సిరీస్…మరోవైపు మహిళల ఐపీఎల్..ఇప్పటికే క్రికెట్ ఫ్యాన్స్ పూర్తి వినోదాన్ని ఆస్వాదిస్తుండగా వారి ఆనందాన్ని మరింత రెట్టింపు చేసేందుకు మరో మెగా టోర్నీ కూడా రెడీ అయింది. కుర్రాళ్ల మధ్య హోరాహోరీ సమరాలకు వేదికగా నిలిచే
అండర్ 19 వరల్డ్‌కప్ 2026 ( ICC U19 World Cup 2026 )కు అంతా సిద్దమైంది.

సౌతాఫ్రికా వేదికగా గురువారం నుంచే ఈ మెగా టోర్నీకి మొదలు కాబోతోంది. ఈ టోర్నీలో భారత్ టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. భారత్ ఇప్పటి వరకు అత్యధికంగా ఐదు సార్లు 2000, 2008, 2012, 2018, 2022లలో టైటిల్ గెలిచింది.అండర్ 19 ఆసియా కప్ లో రన్నరప్ గా నిలిచిన భారత్ కుర్రాళ్ళు గత వారం సౌతాఫ్రికాతో యూత్ వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన ఫుల్ జోష్ లో ఉంది.

వార్మప్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడినా.. భారత్‌ ఫామ్ పై అనుమానాలు లేవు. ఆయుష్ మాత్రే సారథ్యంలోని భారత యువ జట్టు తొలి మ్యాచ్‌లో అమెరికా అండర్ 19 టీమ్‌తో తలపడబోతోంది. టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీపైనే అందరి చూపు ఉంది. గత ఏడాది కాలంగా వైభవ్ సూర్యవంశీ దుమ్ము రేపుతున్నాడు. ఐపీఎల్ , తర్వాత ఆసియా కప్ రైజింగ్ స్టార్స్, అండర్ 19 ఆసియా కప్, సౌతాఫ్రికా టూర్..ఇలా వరుసగా అన్ని సిరీస్ లలో పరుగుల వరద పారించాడు. ఇపుడు ఈ మెగా టోర్నీలో కూడా వైభవ్ రెచ్చిపోయి ఆడితే కప్పు గెలవడం ఖాయం.

ICC U19 World Cup 2026

అతనితో పాటు హైదరాబాదీ బ్యాటర్ ఆరోన్ జార్జ్, మల్హోత్ర, అభిజ్ఞాన్ కుందు, ఆయుష్ మాత్రేలతో భారత బ్యాటింగ్ లైనప్ అత్యంత బలంగా ఉంది. అయితే ఆయుష్ మాత్రే ఫామ్‌లో లేకపోవడం టీమిండియాను కలవరపెడుతుంది. ఈ టోర్నిలో భారత్–పాకిస్థాన్ వేర్వేరు గ్రూపుల్లో ఉన్నాయి. దీంతో గ్రూప్‌ లీగ్ దశలో ఈ రెండు జట్లు తలపడే అవకాశం లేదు. మొత్తం 16 జట్లు 2026 మెగా ఈవెంట్‌లో పాల్గొననుండగా వీటిని నాలుగు గ్రూపులుగా విభజించారు. 23 రోజుల్లో 41 మ్యాచ్‌లు జరగనున్నాయి.

భారత్ ఆడే మ్యాచులకు బులవాయో ఆతిధ్యం ఇస్తోంది. భారత్.. జనవరి 15 యూఎస్ఏ తో, జనవరి 17న బంగ్లాదేశ్, జనవరి 24న న్యూజిలాండ్ తో తలపడనుంది. కాగా, రౌండ్ రాబిన్ సిస్టమ్‌లో గ్రూప్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రతి గ్రూప్ నుంచి టాప్-3 జట్లు సూపర్-6 దశకు అర్హత సాధిస్తాయి. రెండు సూపర్-6 గ్రూప్‌లలో టాప్-2గా నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు చేరుతాయి. అనంతరం గెలిచిన దేశాలు ఫైనల్‌లో పోటీపడుతాయి.

Kamakshi Vratam: వివాహ, సంతాన ప్రాప్తి కోసం కామాక్షి వ్రతం.. 16 శుక్రవారాలు ఇలా చేస్తే కోరికలు నెరవేరడం ఖాయం!

Exit mobile version