Ind vs Aus: దెబ్బ అదుర్స్ కదూ.. మూడో టీ20లో భారత్ విజయం

Ind vs Aus: డేవిడ్ 38 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 74 పరుగులు చేయగా.. స్టోయినిస్ 39 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 64 పరుగులు చేశాడు.

Ind vs Aus

ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ ట్వంటీ సిరీస్ లో టీమిండియా బోణీ కొట్టింది. రెండో టీ ట్వంటీలో పరాజయం పాలై వెనుకబడిన భారత్ మూడో టీ ట్వంటీ(Ind vs Aus)లో విజయం సాధించి సిరీస్ ను 1-1తో సమం చేసింది. బౌలింగ్ లో అర్షదీప్ సింగ్, బ్యాటింగ్ లో వాషింగ్టన్ సుందర్ అదరగొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.

ఈ (Ind vs Aus)మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తుది జట్టులో భారత్ మూడు మార్పులు చేసింది. జితేశ్ శర్మ, అర్షదీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్ లను తీసుకుని.. హర్షిత్ రాణా, సంజూ శాంసన్, కుల్దీప్ యాదవ్ లను తప్పించింది. హర్షిత్ రాణా కోసం గత రెండు మ్యాచ్ లలోనూ బెంచ్ కే పరిమితమైన అర్షదీప్ సింగ్ తాను ఎంత విలువైన బౌలరో పవర్ ప్లేలోనే చూపించాడు.

ప్రమాదకరమైన ఇంగ్లీస్, ట్రావిస్ హెడ్ లను ఔట్ చేశాడు. తర్వాత మిఛెల్ మార్ష్ 11, మిఛ్ ఓవెన్ కూడా ఔటవడంతో ఆసీస్ కష్టాల్లో పడినట్టు కనిపించింది. ఈ దశలో టిమ్ డేవిడ్, స్టోయినిస్ విధ్వంసం సృష్టించారు. ముఖ్యంగా టిమ్ డేవిడ్ భారీ షాట్లతో రెచ్చిపోయాడు. భారత బౌలర్లపై విరుచుకుపడుతూ సిక్సర్లు, ఫోర్లు బాదేశాడు. అటు స్టోయినిస్ కూడా దూకుడుగా ఆడడంతో ఆసీస్ స్కోర్ వేగం ఫస్ట్ గేర్ లో సాగింది.

Ind vs Aus

టిమ్ డేవిడ్ 38 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 74 పరుగులు చేయగా.. స్టోయినిస్ 39 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 64 పరుగులు చేశాడు. చివర్లో మాథ్యూ షార్ట్ కూడా దూకుడుగా ఆడడంతో ఆస్ట్రేలియా 186/6 స్కోర్ చేసింది. భారత బౌలర్లలో అర్షదీప్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 35 రన్స్ కు 3 వికెట్లు పడగొట్టాడు. వరుణ్ చక్రవర్తి 2, శివమ్ దూబే 1 వికెట్ పడగొట్టారు.

ఛేజింగ్ లో భారత్ కూడా దూకుడుగానే ఆరంభించింది. అభిషేక్ శర్మ, గిల్ తొలి వికెట్ కు 33 రన్స్ జోడించారు. వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో ఔటైన తర్వాత సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఇన్నింగ్స్ కొనసాగించారు. సూర్య కెప్టెన్ ఇన్నింగ్స్ కోసం ఆశించిన ఫ్యాన్స్ కు మరోసారి నిరాశే మిగిలింది. స్కై 24 , తిలక్ వర్మ 29 , అక్షర్ పటేల్ 17 రన్స్ కు ఔటవడంతో భారత్ చివర్లో ఒత్తిడిలో పడినట్టు కనిపించింది.

కానీ వాషింగ్టన్ సుందర్ మెరుపు ఇన్నింగ్స్ తో రెచ్చిపోయాడు. భారీ షాట్లతో ఆసీస్ బౌలర్లకు షాకిచ్చాడు. కేవలం 23 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 49 రన్స్ చేయగా.. జితేశ్ శర్మ కూడా ధాటిగా 22 రన్స్ చేయడంతో భారత్ 18.3 ఓవర్లలో టార్గెట్ ను అందుకుంది. బౌలింగ్ లో 3 వికెట్లు తీసిన అర్షదీప్ సింగ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. ఇదిలా ఉంటే ఆసీస్ బౌలర్లలో ఎల్లిస్ మూడు వికెట్లు తీయగా.బార్ట్‌లెట్, స్టోయినీస్ ఒక్కో వికెట్ తీసారు.

కాగా ఈ మైదానంలో ఇదే భారీ టీ20 స్కోర్ అలాగే అత్యధిక ఛేజింగ్ కూడా ఇదే. అటు ఈ గ్రౌండ్ లో కంగారూలకు ఇదే తొలి ఓటమి. ప్రస్తుతం ఐదు మ్యాచ్ ల సిరీస్ (Ind vs Aus)లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. సిరీస్ లో నాలుగో టీ ట్వంటీ గురువారం గోల్డ్ కోస్ట్ లో జరుగుతుంది.

Women: మహిళల సొంత గుర్తింపు కోసం ఇలా ట్రై చేయండి.. చిన్న వ్యాపారాలతో రోల్ మోడల్‌గా నిలబడండి

Exit mobile version