IND Vs NZ ODI : శ్రేయాస్ కు చోటు..షమీకి నిరాశ

IND Vs NZ ODI : కెప్టెన్ శుభమన్ గిల్, స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ జట్టులోకి తిరిగి వచ్చారు. మెడ నొప్పి నుంచి కోలుకున్న గిల్ కెప్టెన్ గా మళ్లీ పగ్గాలు అందుకున్నాడు. అ

న్యూజిలాండ్ తో జరిగే మూడు వన్డేల (IND Vs NZ ODI)  సిరీస్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలో సమావేశమైన సెలక్షన్ కమిటీ సమావేశం మూడు గంటలకు పైగా సాగింది. సంచలన మార్పులుంటాయని భావించినా అలాంటివేమీ జరగలేదు. చాలా వరకూ ఊహించిన నిర్ణయాలే వచ్చాయి.

కెప్టెన్ శుభమన్ గిల్, స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ జట్టులోకి తిరిగి వచ్చారు. మెడ నొప్పి నుంచి కోలుకున్న గిల్ కెప్టెన్ గా మళ్లీ పగ్గాలు అందుకున్నాడు. అటు శ్రేయాస్ అయ్యర్ కూడా రికవర్ అయ్యాడు. బరువు తగ్గడం కాస్త ఆందోళన కలిగిస్తున్నా సెలక్టర్లు మాత్రం అతన్ని వైస్ కెప్టెన్ గా వన్డే జట్టులోకి ఎంపిక చేశారు. శ్రేయాస్ అయ్యర్ ఫిట్ నెస్ సాధిస్తేనే సిరీస్ లో ఆడతాడని బీసీసీఐ సెక్రటరీ దేవజీత్ సైకియా వెల్లడించారు. దీని కోసం విజయ్ హజారే ట్రోఫీలో అతను ఆడనున్నాడు.

 

బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ మెడికల్ టీమ్ శ్రేయాస్ ఫిట్ నెస్ అంచనా వేసి క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంది. ఒకవేళ క్లియరెన్స్ వస్తే జట్టుతో కలుస్తాడనీ, లేకుండా సీఓఈకి వెళతాడని సైకియా తెలిపారు. శ్రేయాస్ రావడంతో రుతురాజ్ గైక్వాడ్ పై వేటు పడింది. ఇటీవల సౌతాఫ్రికా సిరీస్ లో అదరగొట్టినా జట్టు కూర్పు దృష్ట్యా అతన్ని తప్పించక తప్పలేదు.

IND Vs NZ ODI

ఇక వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు చోటు దక్కింది. పంత్ ను ఎంపిక చేసే విషయంలో సెలక్షన్ కమిటీ తర్జన భర్జన పడింది. ఇషాన్ కిషన్ ను తీసుకుంటారని ప్రచారం జరిగినా పంత్ వైపే సెలక్టర్లు మొగ్గుచూపారు. అయితే కేఎల్ రాహుల్ కు బ్యాకప్ గానే పంత్ ను తీసుకున్నారు. మరోవైపు హర్థిక్ పాండ్యా, బుమ్రాలకు విశ్రాంతినిచ్చారు. టీ 20 ప్రపంచకప్ దృష్ట్యా వీరిద్దరికీ రెస్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

అయితే పాండ్యాకు పూర్తి ఓవర్ల కోటా ఇచ్చే విషయంపై సీవోఈ క్లియరెన్స్ ఇవ్వలేదని సమాచారం. బుమ్రా లేకపోవడంతో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ కు మళ్లీ వన్డే జట్టులో చోటు దక్కింది. గత కొంతకాలంగా సిరాజ్ కేవలం రెడ్ బాల్ ఫార్మాట్ కే పరిమితమయ్యాడు. పేస్ ఎటాక్ లో అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ కృష్ణ, హర్షిత్ రాణా చోటు దక్కించుకున్నారు.

అలాగే స్పిన్ విభాగంలో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ ఎంపికయ్యారు. బ్యాకప్ ఓపెనర్ గా జైస్వాల్ కు కూడా చోటు దక్కింది. దేశవాళీ క్రికెట్ లో వరుస సెంచరీలు చేసిన పడిక్కల్ కు , రుతురాజ్ గైక్వాడ్ కు జట్టు కూర్పు దృష్ట్యా చోటు దక్కలేదు. కాగా న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ జనవరి 11 నుంచి ప్రారంభం కానుంది.

న్యూజిలాండ్ తో ( IND Vs NZ ODI )వన్డే సిరీస్ కు భారత జట్టు.. శుభ్‌మన్ గిల్ (కెప్టెన్ ), రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్(వైస్ కెప్టెన్), రిషభ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్

IPL : బంగ్లా ప్లేయర్స్ పై ఐపీఎల్ బ్యాన్

Exit mobile version