IND vs SA T20I: టీ20 సిరీస్ మనదే..  అహ్మదాబాద్ లో సౌతాఫ్రికా చిత్తు

IND vs SA T20I: ఆఖరి మ్యాచ్(IND vs SA T20I) లో 30 పరుగుల తేడాతో గెలిచి 3-1 తో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లోటాస్ గెలిచిన సౌతాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది.

IND vs SA T20I

టెస్ట్ సిరీస్ (IND vs SA T20I)లో క్లీన్ స్వీప్ పరాభవానికి వన్డే సిరీస్ విజయంతో రివేంజ్ తీర్చుకున్న టీమిండియా ఇప్పుడు టీ ట్వంటీ సిరీస్(IND vs SA T20I) విజయంతో మరో దెబ్బకొట్టింది. పొట్టి ఫార్మాట్ లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ సఫారీలను చిత్తు చేసింది. అహ్మదాబాద్ లో హార్థిక్ పాండ్యా. తిలక్ వర్మ విధ్వంసం సృష్టిస్తే.. బ్యాటింగ్ పిచ్ పై వరుణ్ చక్రవర్తి బంతితో మ్యాజిక్ చేశాడు.

దీంతో ఆఖరి మ్యాచ్(IND vs SA T20I) లో 30 పరుగుల తేడాతో గెలిచి 3-1 తో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లోటాస్ గెలిచిన సౌతాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. భారత తుది జట్టులో మూడు మార్పులు జరిగాయి. గిల్ స్థానంలో సంజూ శాంసన్, హర్షిత్ రాణ స్థానంలో బుమ్రా, కుల్దీప్ యాదవ్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చారు. ప్రపంచకప్ కోసం జట్టు ఎంపిక జరగనున్న నేపథ్యంలో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకునేలా ఆడాడు. భారీ షాట్లతో సఫారీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

IND vs SA T20I

అటు అభిషేక్ శర్మ కూడా దూకుడుగా ఆడాడు. వీరిద్దరూ తొలి వికెట్ కు 5.4 ఓవర్లలోనే 63 పరుగులు జోడించారు. అభిషేక్ 34 , సంజూ శాంసన్ 37 పరుగులకు ఔటయ్యారు. సూర్యకుమార్ యాదవ్ మరోసారి ఫెయిలయ్యాడు. అయితే హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ, హార్థిక్ పాండ్యాతో కలిసి ఇన్నింగ్స్ కొనసాగించాడు. ముఖ్యంగా పాండ్యా విధ్వంసం సృష్టించాడు. వచ్చీ రావడంతోనే తొలి బంతినే సిక్సర్ బాదాడు.

తర్వాత సఫారీ బౌలర్లను ఎడాపెడా బాదేశాడు. అతని బ్యాటింగ్ కు బంతులు బుల్లెట్లలా బౌండరీలకు దూసుకెళ్ళాయి. అటు తిలక్ వర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా..పాండ్యా కేవలం 16 బంతుల్లోనే ఫిఫ్టీ కంప్లీట్ చేసుకున్నాడు. టీ ట్వంటీల్లో భారత్ తరపున ఇది రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ. పాండ్యా, తిలక్ విధ్వంసంతో భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 231 పరుగులు చేసింది. హార్థిక్ పాండ్యా 25 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్ల 63 , తిలక్ వర్మ 73 పరుగులు చేశారు.

ఛేజింగ్ లో సౌతాఫ్రికా కూడా దూకుడుగా ఆడింది. ఓపెనర్లు హెండ్రిక్స్ , డికాక్ తొలి వికెట్ కు 69 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో డికాక్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. హెండ్రిక్స్ ను వరుణ్ చక్రవర్తి ఔట్ చేశాడు. తర్వాత బ్రెవిస్ కూడా దూకుడుగా ఆడడంతో సౌతాఫ్రికా (IND vs SA T20I)సంచలనం సృష్టించేలా కనిపించింది.

అయితే మిడిల్ ఓవర్లలో భారత బౌలర్లు సౌతాఫ్రికాను కట్టడి చేశారు. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలించినా వరుణ్ చక్రవర్తి తన స్పిన్ మాయాజాలం చూపించాడు. 4 వికెట్లతో సఫారీలను దెబ్బకొట్టాడు. దీంతో సౌతాఫ్రికా వరుసగా వికెట్లు కోల్పోయింది. సౌతాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 4 , బుమ్రా 2 , పాండ్యా , అర్షదీప్ ఒక్కో వికెట్ తీశారు.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version