IND vs WI: జైశ్వాల్ శతక్కొట్టుడు రెండో టెస్ట్ తొలిరోజు మనదే

IND vs WI: 24 ఏళ్ళ వయసులోనే అత్యధిక సెంచరీ చేసిన నాలుగో భారత బ్యాటర్ గా రికార్డులకెక్కాడు. అటు సాయి సుదర్శన్ కూడా ఆకట్టుకున్నాడు.

IND vs WI

సొంతగడ్డపై వెస్టిండీస్ (IND vs WI)తో జరుగుతున్న సిరీస్ లో భారత బ్యాటర్లు అదరగొడుతున్నారు. తొలి టెస్ట్ తరహాలోనే భారీ స్కోర్ దిశగా సాగుతోంది. తొలిరోజు పూర్తి ఆధిపత్యం కనబరిచిన భారత్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీ ఇన్నింగ్స్ హైలెట్ గా నిలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు ఓపెనర్లు జైస్వాల్, కేఎల్ రాహుల్ మంచి ఆరంభాన్నే ఇచ్చారు. తొలి వికెట్ కు 58 పరుగులు జోడించారు. రాహుల్ 38 రన్స్ కు ఔటైన తర్వాత సాయిసుదర్శన్ కలిసి జైస్వాల్(IND vs WI) ఇన్నింగ్స్ కొనసాగించాడు.

వీరిద్దరూ రెండో వికెట్ కు 193 పరుగులు జోడించారు. ఈ క్రమంలో జైస్వాల్ 145 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెస్ట్ కెరీర్ లో అతనికిది ఏడో శతకం. అలాగే మరో అరుదైన రికార్డును కూడా ఈ యువ ఓపెనర్ తన ఖాతాలో వేసుకున్నాడు. 24 ఏళ్ళ వయసులోనే అత్యధిక సెంచరీ చేసిన నాలుగో భారత బ్యాటర్ గా రికార్డులకెక్కాడు. అటు సాయి సుదర్శన్ కూడా ఆకట్టుకున్నాడు. వరుస అవకాశాలిస్తున్నా సద్వినియోగం చేసుకోలేకపోతున్న సాయి ఈ మ్యాచ్ లో పట్టుదలగా ఆడాడు. పెద్ద ఇన్నింగ్సే ఆడాలనే లక్ష్యంతో బ్యాటింగ్ చేసాడు. ఈ క్రమంలో టెస్టుల్లో తన తొలి హాఫ్ సెంచరీ సాధించాడు.

IND vs WI

రెండో సెషన్ లోనూ భారత్ ఆధిపత్యం కొనసాగింది. జైస్వాల్, సాయి సుదర్శన్ పార్టనర్ షిప్ ను బ్రేక్ చేసేందుకు విండీస్ బౌలర్లు చెమటోడ్చారు. చివరికి 87 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర సాయి సుదర్శన్ ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శుభమన్ గిల్ తో కలిసి జైస్వాల్ ఇన్నింగ్స్ నడిపించాడు. సెంచరీ తర్వాత ఈ యువ ఓపెనర్ గేర్ మార్చాడు. చూస్తుండగానే 150 ప్లస్ మార్క్ అందుకున్నాడు. అటు గిల్ కూడా నిలకడగా ఆడడంతో భారత్ మరో వికెట్ కోల్పోలేదు. తొలిరోజు ఆటముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 318 పరుగులు చేసింది. జైస్వాల్ 173 , గిల్ 20 రన్స్ తో క్రీజులో ఉన్నారు.

ఈ (IND vs WI)మ్యాచ్ లో విండీస్ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. వారికన్ ఒక్కడే కాస్త పర్వాలేదనిపించాడు. భారత్ కోల్పోయిన 2 వికెట్లూ అతనే తీశాడు. మిగిలిన బౌలర్లలో ఏ ఒక్కరూ ప్రభావం చూపలేకపోయారు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ టాస్ గెలిచి గిల్ తన కాయిన్ పరాజయాలకు బ్రేక్ వేశాడు. అటు భారత తుది జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు. ఆసీస్ టూర్ దృష్ట్యా స్టార్ పేసర్ బుమ్రాకు రెస్ట్ ఇస్తారని భావించినా కోచ్ గంభీర్ మాత్రం విన్నింగ్ కాంబినేషన్ ను మార్చేందుకు ఇష్టపడలేదు. రెండోరోజు భారత్ భారీస్కోర్ చేసి డిక్లేర్ చేసే అవకాశముంది. మరి తొలి టెస్టులో కనీస పోటీ ఇవ్వలేకపోయిన కరేబియన్లు ఇప్పుడైనా పోరాడతారేమో చూడాలి.

Deepika Padukone: నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ? వాళ్ళను అడగరెందుకు ?

Exit mobile version