India vs South Africa: రెండో టెస్టులో ఓటమి దిశగా భారత్..  క్లీన్ స్వీప్ పరాభవం తప్పేనా ?

India vs South Africa: తొలి వికెట్ కు 59 పరుగులు జోడించారు. తొలి సెషన్ లో సౌతాఫ్రికా 3 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది.

India vs South Africa

రెండో టెస్టు(India vs South Africa)లో భారత్ ఓటమి దిశగా సాగుతోంది. సిరీస్ ఓటమి ఖాయమైపోగా.. ఇప్పుడు డ్రా చేసుకునే పరిస్థితి కూడా కనిపించడం లేదు. దీంతో మరో క్లీన్ స్వీప్ పరాభవం ముంగిట నిలిచిన భారత్ 25 ఏళ్ల తర్వాత సౌతాఫ్రికాకు సిరీస్ సమర్పించుకోబోతోంది. ఊహించినట్టుగానే నాలుగోరోజు కూడా సౌతాఫ్రికాదే ఆధిపత్యంగా నిలిచింది. వికెట్ నష్టపోకుండా 27 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన సఫారీ ఓపెనర్లు మరోసారి మంచి ఆరంభాన్నే ఇచ్చారు.

తొలి వికెట్ కు 59 పరుగులు జోడించారు. తొలి సెషన్ లో సౌతాఫ్రికా(India vs South Africa) 3 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. ఆచితూచి ఆడడంతో టీ బ్రేక్ సమయానికి 107/3 తో నిలిచింది. అయితే రెండో సెషన్ లో భారత బౌలర్లు విఫలమవ్వడంతో సౌతాఫ్రికా ఆధిపత్యం కొనసాగింది. స్టబ్స్, డీ జోర్డ్ అటాకింగ్ బ్యాటింగ్ తో స్కోర్ పెంచారు. దీంతో ఆ సెషన్ లో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయింది.

లంచ్ బ్రేక్ సమయానికి 220/4 స్కోర్ తో ఉన్న సౌతాఫ్రికాను భారత బౌలర్లు పెద్దగా ఇబ్బంది పెట్టలేకపోయారు. జోర్జ్, స్టబ్స్ నిలకడగా ఆడుతూ పరుగులు సాధించారు. డీ జోర్జ్ ఔటైన తర్వాత స్టబ్స్ దూకుడు పెంచాడు. ముల్గర్ కూడా బౌండరీలు బాడడంతో చూస్తుండగానే ఆధిక్యం 530 దాటింది.

India vs South Africa

లంచ్ తర్వాత డిక్లేర్ చేయకుండా మూడో సెషన్ లో కూడా సౌతాఫ్రికా బ్యాటింగ్ చేసేందుకే నిర్ణయించుకుంది. స్టబ్స్ సెంచరీ ముంగిట ఔటైన వెంటనే రెండో ఇన్నింగ్స్ ను 260/5 దగ్గర డిక్లేర్ చేసింది. దీంతో 549 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ ముందుంచింది. ఇక్కడ నుంచి సౌతాఫ్రికా వ్యూహం మరింత బాగా పనిచేసిందనే చెప్పాలి. భారత ఓపెనర్లను ఔట్ చేయాలనే లక్ష్యం నెరవేర్చుకుంది.

తొలి ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ చేసి జైస్వాల్ , కేఎల్ రాహుల్ వెంటవెంటనే ఔటయ్యారు. ఈ దశలో సాయి సుదర్శన్, కుల్దీప్ యాడవ్ పట్టుదలగా ఆడుతూ మరో వికెట్ పడకుండా రోజును ముగించారు. నాలుగో రోజు ఆటముగిసే సమయానికి భారత్ 2 వికెట్లకు 27 రన్స్ చేసింది. విజయం కోసం భారత్ 522 పరుగులు చేయాల్సి ఉండగా.. చేతి లో 8 వికెట్లున్నాయి. భారత బ్యాటర్ల వైఫల్యాల బాటను చూస్తే చివరిరోజు క్రీజులో నిలిచి డ్రా చేసుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. ఒకవేళ మ్యాచ్ డ్రాగా ముగిసినా కూడా సిరీస్ 1-0తో సౌతాఫ్రికా సొంతమవుతుంది. అప్పుడు సొంతగడ్డపై మరో క్లీన్ స్వీప్ పరాభవం తప్పినట్టవుతుంది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version