Rishabh Pant: జనవరి 3న భారత జట్టు ఎంపిక.. పంత్ డౌట్.. ఇషాన్ కు ప్లేస్

Rishabh Pant: పంత్ గణాంకాలే దీనికి ఉదాహరణ. అదే సమయంలో ఇషాన్ కిషన్ దుమ్మురేపుతున్నాడు. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో అదరగొట్టాడు.

Rishabh Pant

న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టును జనవరి 3న ఎంపిక చేయనున్నారు. దీని కోసం చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ సారథ్యంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ముంబైలో సమావేశం కానుంది. ఈ సిరీస్ కు కోసం ఎంపిక చేసే జట్టులో పలు కీలక మార్పులు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కొందరు సీనియర్ ప్లేయర్స్ కు విశ్రాంతినివ్వనున్నారు. టీ20 ప్రపంచకప్ దృష్ట్యా బుమ్రా, పాండ్యాలకు రెస్ట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్(Rishabh Pant) కు చోటు దక్కడం అనుమానంగానే మారింది.

పంత్ (Rishabh Pant)స్థానంలో ఇషాన్ కిషన్ వైపు సెలక్టర్లు మొగ్గుచూపే అవకాశముంది. కారు ప్రమాదం తర్వాత రీఎంట్రీలో పంత్ వైట్ బాల్ ఫార్మాట్ లో అనుకున్న విధంగా రాణించలేకపోతున్నాడు. పంత్ గణాంకాలే దీనికి ఉదాహరణ. అదే సమయంలో ఇషాన్ కిషన్ దుమ్మురేపుతున్నాడు. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో అదరగొట్టాడు. సూపర్ ఫామ్ తో 500కు పైగా పరుగులు చేయడమే కాకుండా జార్ఖండ్ జట్టును ఛాంపియన్ గా నిలిపాడు. తర్వాత విజయ్ హజారే ట్రోఫీలోనూ సత్తా చాటాడు.

Rishabh Pant

ఈ ప్రదర్శనలతోనే టీ20 ప్రపంచకప్ కు ఎంపికయ్యాడు. ఇదిలా ఉంటే మెడనొప్పి నుంచి కోలుకున్న శుభమన్ గిల్ తిరిగి వన్డే జట్టు పగ్గాలు అందుకోనున్నాడు. అటు శ్రేయాస్ అయ్యర్ ఫిట్ నెస్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ నుంచి శ్రేయాస్ కు ఇంకా క్లియరెన్స్ సర్టిఫికేట్ రాలేదు. అతను ఆరు కిలోల బరువు తగ్గడం బీసీసీఐ మెడికల్ టీమ్ కొన్నాళ్లు విశ్రాంతి సూచించే అవకాశముంది. దీంతో శ్రేయాస్ స్థానంలో పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్ పోటీ పడుతున్నారు.

బౌలింగ్ లో బుమ్రాకు విశ్రాంతినివ్వనుండడంతో షమీకి చోటు దక్కే అవకాశముంది. అలాగే దేశవాళీ క్రికెట్ లో రాణిస్తున్న మరికొందరు పేర్లు కూడా చర్చకు వస్తాయని భావిస్తున్నారు. ఇక స్పిన్నర్లుగా జడేజా,. అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ , కుల్దీప్ యాదవ్ ఎంపిక ఖాయంగా కనిపిస్తోంది. కాగా కివీస్ తో వన్డేలకు వడోదర , రాజ్ కోట్ , ఇండోర్ ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ సిరీస్ ముగిసిన వెంటనే ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ జరుగుతుంది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version