Joe Root: ఐదేళ్లలో 24 సెంచరీలు.. టెస్టుల్లో అతని ”రూటే” సెపరేటు

Joe Root: సెంచరీల మీద సెంచరీలు బాదేస్తున్నాడు ఇంగ్లాండ్ క్రికెటర్ జో రూట్.. ఆరేళ్ళలో 26 సెంచరీలు బాదాడంటే రూట్ ఏ విధంగా ఆడుతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Joe Root

ఒక క్రికెటర్ సత్తా ఏంటనేది టెస్ట్ ఫార్మాట్ తోనే తెలుస్తుంది. ఎందుకంటే టీ20 తరహాలో ధనాధన్ షాట్లు బాదేయడం కాదు.. వన్డే తరహాలో దూకుడుగా ఆడడం కాదు.. టెస్టుల్లో ఓపిగ్గా ఆడాలి.. భారీ ఇన్నింగ్స్ లు నిర్మించాలి. అన్నింటికీ మించి పరిస్థితులకు తగ్గట్టు నిదానంగా ఆడాలి.. అలా ఆడడమే కాదు సెంచరీల మీద సెంచరీలు బాదేస్తున్నాడు ఇంగ్లాండ్ క్రికెటర్ జో రూట్.. ఆరేళ్ళలో 26 సెంచరీలు బాదాడంటే రూట్ ఏ విధంగా ఆడుతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రీజులో కుదురుకున్నాడంటే సెంచరీ అందాల్సిందే. తద్వారా సమకాలిన క్రికెట్ లో తిరుగులేని రికార్డులు సొంతం చేసుకుంటున్నాడు.

తాజాగా యాషెస్ సిరీస్ చివరి టెస్టులోనూ రూట్ (Joe Root) అదరగొట్టాడు. ఆస్ట్రేలియా గడ్డపై యాషెస్ సెంచరీ కోసం గత కొన్నేళ్లుగా ఎదురుచూసాడు. చివరికి ఈ సారి దానిని అందుకున్నాడు. ఒకసారి సెంచరీల వేట మొదలుపెట్టిన రూట్ జోరుకు అడ్డే లేకుండా పోతోంది. తాజాగా రూట్ సిడ్నీ టెస్టులో తన 41వ సెంచరీ బాదాడు. ఈ ఇన్నింగ్స్‌తో లెజెండరీ రికీ పాంటింగ్ రికార్డును సమం చేయడమే కాదు టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో మూడో ప్లేస్ కు దూసుకొచ్చాడు. అతని కంటే ముందు సచిన్ టెండూల్కర్, జాక్ కల్లిస్ మాత్రమే ఉన్నారు.

Joe Root

35 ఏళ్ల రూట్ కు ఈ సిరీస్‌లో ఇది రెండో శతకం. విశేషమేమిటంటే పాంటింగ్ 168 టెస్టుల్లో 41 సెంచరీలు పూర్తి చేస్తే.. రూట్ 163 టెస్టుల్లోనే 41 శతకాల ఘనతను అందుకున్నాడు. ప్రస్తుతం అత్యధిక టెస్ట్ సెంచరీల జాబితాలో సచిన్ టెండూల్కర్ 51 సెంచరీలు, జాక్ కల్లీస్ 45 సెంచరీలతో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఇదిలా ఉంటే గత ఐదేళ్లలో రూట్ సెంచరీల రికార్డు చూస్తే మతిపోవాల్సిందే.

2021 తర్వాత ఇప్పటి వరకూ ఏకంగా 24 శతకాలు బాదేశాడు. 2020 వరకూ విరాట్ కోహ్లీ ఫ్యాబ్-4 జాబితాలో మొదటి స్థానంలో ఉండేవాడు. అప్పుడు కోహ్లీ ఖాతాలో 27 టెస్ట్ సెంచరీలు ఉండగా.. రూట్ కేవలం శతకాలు మాత్రమే సాధించాడు. 2021 తర్వాత నుంచి రూట్ రికార్డుల వేటకు టెస్ట్ క్రికెట్ కూడా తలవంచింది. ఈ ఐదేళ్లలో రూట్ 24 శతకాలు చేస్తే.. స్మిత్ కేవలం 10 సెంచరీలు మాత్రమే చేయగలిగాడు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం అత్యధిక పరుగుల జాబితాలోనూ రూట్ సచిన్ రికార్డు దిశగా దూసుకెళుతున్నాడు. టెస్టుల్లో సచిన్ 200 మ్యాచ్ లు ఆడిన 15,921 పరుగులు చేస్తే.. ప్రస్తుతం రూట్ 13,937 పరుగులు చేశాడు. మరో 1984 పరుగులు చేస్తే సచిన్ రికార్డును దాటేస్తాడు. మరో రెండేళ్లలో రూట్ ఈ రికార్డు బ్రేక్ చేసే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఈ దశాబ్దపు అత్యుత్తమ ఆటగాడిగా రూట్ చరిత్ర సృష్టించడం ఖాయం.

Rashi:శివాజీ,అనసూయ మధ్యలో రాశి..నెక్స్ట్ ఎవరు? ..సారీతో శుభం కార్డు పడేనా?

Exit mobile version