Siraj: సిరాజ్‌ను ఎస్పీని చేసేయండి సర్..రేవంత్‌కు ఫ్యాన్స్ డిమాండ్

Siraj: ఒంటి చేతితో మ్యాచ్ గెలిపించిన సిరాజ్... డీఎస్పీ పదవికి మాత్రమేనా? ఎస్పీ పదవివ్వాలని నెట్టింట దుమారం

Siraj

ఇంగ్లాండ్‌ను ఒంటిచేత్తో చిత్తుచేసిన హైదరాబాదు పులి మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj)ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాడు. ఓవల్ మైదానంలో ఆఖరి రోజున భారత్‌కు నలుగు వికెట్లు కావాల్సిన క్షణంలో వేట ప్రారంభించిన సిరాజ్, కేవలం స్పెల్ కాదు… సీరీస్ ను మార్చేశాడు. చకచకా వికెట్లు పడగొట్టి ఓడిపోయే మ్యాచ్‌ని తలకిందలు చేశాడు.

ఈ సిరీస్‌లో మొత్తం 23 వికెట్లు తీసి టాప్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచిన సిరాజ్(Siraj), రెండో ఇన్నింగ్స్‌లో పిచ్చెక్కించిన స్పెల్‌తో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కొట్టేశాడు. భారత జట్టులో ఐదు టెస్టులన్నీ ఆడిన ఏకైక పేసర్ కూడా ఇతడే కావడం గర్వకారణం. ఇంతటి మ్యాజిక్ తర్వాత మాజీ కోచ్ రవిశాస్త్రి కూడా కంట్రోల్ కోల్పోయాడు. ఇప్పటికి డీఎస్పీ కాదు… ఇంకో అడుగు పైకెళ్లిపోతాడు అంటూ ఎమోషన్ గా కామెంట్ చేశాడు.

ఇంతటి ఘనత సాధించిన సిరాజ్(Siraj), 2024 అక్టోబరులో రాష్ట్ర డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట మేరకు గ్రూప్-1 స్థాయి ఉద్యోగం లభించింది. రాష్ట్ర డీజీపీకి రిపోర్ట్ చేసిన తర్వాత సిరాజ్ అధికారికంగా పోలీసు అధికారిగా మారిపోయాడు.

Siraj

ఇప్పుడు ఇంకొక ప్రశ్న సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది . డీఎస్పీగా ఉంటేనే ఇలా గెలిపిస్తే… SP చేస్తే వరల్డ్‌కప్ కూడా ఒంటి చేత్తో దక్కిస్తుంది. తెలంగాణ పోలీసు శాఖ(Telangana Police) కూడా ఈ అగ్రశ్రేణి ఆటగాడిపై..“హీరో ఇన్ యూనిఫామ్ అండ్ స్పోర్ట్” అంటూ గర్వంతో పోస్టు చేసింది ..

నిజమే కదా… స్పోర్ట్స్‌లో స్పీడ్ ఉండేది పేస్‌తో కాదు, ప్యాషన్‌తో. అదే సిరాజ్ USP అంటున్నారు నెటిజన్లు. అంతేకాదు ఇక ఇప్పుడు కొత్త డిమాండ్‌ను తెర మీదకు తీసుకువస్తున్నారు. రాష్ట్రానికి గర్వకారణమైన ఈ బౌలర్‌కు ఇంకొంచెం గుర్తింపు ఇవ్వండి. దేశం కోసం, రాష్ట్రం కోసం, టెస్ట్ క్రికెట్ కోసం పోరాడిన ఈ బౌలర్‌కు DSP పదవితో ఆగొద్దు. ఇంకో లెవెల్ కి తీసుకెళ్లండని సీఎం రేవంత్‌ను రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి రేవంత్ రియాక్షన్ ఏంటో చూడాలి.

 

Exit mobile version