World Cup: మన అమ్మాయిలే రారాణులు..  వన్డే వరల్డ్ కప్ విజేత భారత్

World Cup: 300 పైగా టార్గెట్ ఉంచాలన్న పట్టుదలతో వీరిద్దరూ ఆడారు. ఈ క్రమంలో దీప్తి శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా... షెఫాలీ సెంచరీకి 13 పరుగుల దూరంలో వెనుదిరిగింది.

World Cup

ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూస్తున్న కల(World Cup) నెరవేరింది.. రెండుసార్లు చేతికి అందినట్టే అంది చేజారిన ప్రపంచకప్ ను ఈ సారి భారత మహిళల జట్టు అద్భుతంగా ఒడిసి పట్టుకుంది. ఆల్ రౌండ్ షోతో సౌతాఫ్రికాను చిత్తు చేసి ప్రపంచ విజేతలుగా నిలిచింది. ముందు అసలు టోర్నీకే ఎంపికవని లేడీ సెహ్వాగ్ షెఫాలీ వర్మ ఇటు బ్యాట్ తోనూ, అటు బాల్ తోనూ అదరగొట్టింది. మరో ఆల్ రౌండర్ దీప్తి శర్మ సైతం 5 వికెట్లతో సౌతాఫ్రికా పతనాన్ని శాసించింది.

ఓవరాల్ గా టైటిల్ పోరులో ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన హర్మన్ ప్రీత్ అండ్ కో తొలిసారి వరల్డ్ కప్ (World Cup)ను ముద్దాడింది. వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా ఛేజింగ్ వైపే మొగ్గు చూపింది. దీంతో మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు షెఫాలీ, స్మృతి మంధాన అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. పవర్ ప్లేలో దంచికొట్టారు. తొలి వికెట్ కు వీరిద్దరూ 104 పరుగులు జోడించారు. స్మృతి హాఫ్ సెంచరీకి దగ్గరలో ఔటైనా జెమీమాతో కలిసి షెఫాలీ తన దూకుడును కంటిన్యూ చేసింది.

ఒకవైపు షెఫాలీ దూకుడుగా ఆడుతున్నా మరోవైపు వికెట్లు పడ్డాయి. జెమీమా 24, హర్మన్ ప్రీత్ 20 రన్స్ కే ఔటవడంతో భారత్ తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. ఈ దశలో దీప్తి శర్మ , షెఫాలీతో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడింది.

World Cup

300 పైగా టార్గెట్ ఉంచాలన్న పట్టుదలతో వీరిద్దరూ ఆడారు. ఈ క్రమంలో దీప్తి శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా… షెఫాలీ సెంచరీకి 13 పరుగుల దూరంలో వెనుదిరిగింది. చివర్లో రిఛా ఘోష్ మెరుపులు మెరిపించడంతో భారత్ 298 పరుగులు చేసింది. వరల్డ్ కప్(World Cup) ఫైనల్లో 299 పరుగుల టార్గెట్ అంటే చిన్న విషయమేమీ కాదు. ఎందుకంటే ఫైనల్లో ఉండే ఒత్తిడి అందరికీ తెలిసిందే.

ఆరంభం నుంచే సౌతాఫ్రికాపై ఆ ఒత్తిడి స్పష్టంగా కనిపించింది. ఆచితూచి ఆడి సింగిల్స్ కే పరిమితమైన సఫారీలను క్రమం తప్పకుండా భారత బౌలర్లు దెబ్బకొట్టారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఫామ్ లో ఉన్న కెప్టెన్ లారా వోల్వార్ట్ మాత్రం జట్టును గెలిపించేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. ఈ క్రమంలో సెంచరీ కూడా సాధించింది. చివర్లో ఆమెకు సపోర్ట్ చేసే బ్యాటర్లు లేకపోవడంతో భారీ షాట్ కు ప్రయత్నించి ఔటైంది.

వోల్వార్ట్ క్యాచ్ మ్యాచ్ కు టర్నింగ్ పాయింట్ గాా చెప్పాలి. ఎందుకంటే అమన్ జోత్ దాదాపుగా వదిలేసిందనుకున్న దశలో బంతిని అద్భుతంగా పట్టుకుంది. అటు మిడిల్ ఓవర్స్ లో దీప్తి శర్మ, షెఫాలీ వర్మ కీలక వికెట్లు తీస్తూ సఫారీల జోరుకు చెక్ పెట్టారు. ఫలితంగా సౌతాఫ్రిా 246 పరుగులకే ఆలౌటైంది. భారత్ ప్రపంచకప్ గెలవడం ఇదే తొలిసారి. ఫైనల్లో ఆల్ రౌండ్ షో ప్రదర్శన చేసిన షెఫాలీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, టోర్నీ మొత్తం అదరగొట్టి ఏకంగా 22 వికెట్లు తీసిన దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version