Messi’s team: మెస్సీ జట్టుపై రేవంత్‌ రెడ్డి టీమ్‌ గెలుపు.. గోల్ కొట్టిన తెలంగాణ సీఎం

Messi's team: సీఎం రేవంత్ రెడ్డి చాకచక్యంగా ఆడి, గోల్ చేసి స్కోర్‌ను 1-1 పాయింట్లతో సమం చేశారు. మెస్సీ, రేవంత్ రెడ్డి ఇద్దరూ గ్రౌండ్‌లో 5 నిమిషాలపాటే ఆడారు.

Messi’s team

సాకర్ దిగ్గజం మెస్సీ రాకతో ఉప్పల్ స్టేడియం హోరెత్తిపోయింది. ఈ మ్యాచ్‌లో మెస్సీ టీమ్‌(Messi’s team)పై సింగరేణికి చెందిన ఆర్‌ఆర్‌ టీమ్‌ 3-0 గోల్స్‌ తేడాతో గెలిచింది. సింగరేణి ఆర్‌ఆర్‌ టీమ్‌ తరఫున సీఎం రేవంత్‌రెడ్డి, అపర్ణ టీమ్ తరఫున లియోనల్ మెస్సి బరిలోకి దిగారు.

Messi’s team

అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సీ (Messi’s team ) భారతదేశ పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) జట్ల మధ్య హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో ఇవాళ ఒక ఫ్రెండ్లీ ఫుట్‌బాల్‌ మ్యాచ్ (Friendly Football Match) జరిగింది. ‘గోట్ కప్ (GOAT Cup)’ పేరుతో ఈ ఎగ్జిబిషన్‌ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ను నిర్వహించారు.

సీఎం రేవంత్ రెడ్డి(revanth reddy) గోల్.. మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే, ముందు గోల్ చేసిన అపర్ణ టీమ్ ఆధిక్యంలో నిలిచింది. అప్పుడే సీఎం రేవంత్ రెడ్డి చాకచక్యంగా ఆడి, గోల్ చేసి స్కోర్‌ను 1-1 పాయింట్లతో సమం చేశారు. మెస్సీ, రేవంత్ రెడ్డి ఇద్దరూ గ్రౌండ్‌లో 5 నిమిషాలపాటే ఆడారు.

మెస్సీ(Messi’s team) ప్రతిభ.. సీఎం గోల్ చేసిన తర్వాత, లియోనెల్ మెస్సి పెనాల్టీ షూట్ అవుట్‌కు దిగి ఏకంగా రెండు గోల్స్ చేయడంతో స్కోర్ పెరిగింది. అయితే, మ్యాచ్ ఫలితం మాత్రం సింగరేణి ఆర్‌ఆర్‌ టీమ్‌కు (3-0) అనుకూలంగా వచ్చింది.

Messi’s team

ప్రత్యేక అతిథులు..ఈ మ్యాచ్‌ను వీక్షించడానికి అనేకమంది ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) కూడా స్టేడియానికి వచ్చి మ్యాచ్‌ను చూశారు. అలాగే, ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) కుమారుడు, కుమార్తె కూడా స్టేడియానికి రావడం విశేషం.

అభిమానులకు అభివాదం..మ్యాచ్ ముగిసిన తర్వాత లియోనెల్ మెస్సి , సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి గ్రౌండ్‌లో తిరుగుతూ, మ్యాచ్‌కు వచ్చిన అభిమానులకు అభివాదం చేశారు. తర్వాత..రెండు జట్లకు మెస్సీ పతకాలు (Medals) అందజేశారు. ఇక్కడికి వచ్చి తెలుగు వారిని కలవడం సంతోషంగా ఉందని, ఇక్కడి వారు చూపించిన అభిమానం ఎంతో శక్తినిచ్చిందని మెస్సీ చెప్పారు. మ్యాచ్‌కు ముందు ఇరు టీమ్‌లతో మెస్సీ, రేవంత్‌ రెడ్డి గ్రూప్ ఫొటోలు దిగారు. మెస్సీ గ్యాలరీలో ఉన్న అభిమానులకు ఫుట్‌బాల్ కిక్‌ చేసి గిఫ్ట్‌గా ఇవ్వడం ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version