IPL auction : ఐపీఎల్ వేలంలో స్టార్ ప్లేయర్లకు షాక్.. చరిత్ర సృష్టించిన కామెరూన్ గ్రీన్

IPL auction : ఇన్నాళ్లూ మిచెల్ స్టార్క్ పేరిట ఉన్న రికార్డును గ్రీన్ చెరిపివేసి, ఐపీఎల్ చరిత్రలోనే ఒక విదేశీ ప్లేయర్‌కు లభించిన అత్యంత భారీ ధరను సొంతం చేసుకున్నాడు.

IPL auction

ఐపీఎల్ 2026 వేలం(IPL auction)లో ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ మెగా వేలంలో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా గ్రీన్ రికార్డులకెక్కాడు. ఇన్నాళ్లూ మిచెల్ స్టార్క్ పేరిట ఉన్న రికార్డును గ్రీన్ చెరిపివేసి, ఐపీఎల్ చరిత్రలోనే ఒక విదేశీ ప్లేయర్‌కు లభించిన అత్యంత భారీ ధరను సొంతం చేసుకున్నాడు.

రూ. 2 కోట్ల బేస్ ప్రైజ్‌తో వేలం(IPL auction)లోకి వచ్చిన కామెరూన్ గ్రీన్ కోసం ఫ్రాంచైజీలు హోరాహోరీగా పోటీపడ్డాయి. ఆరంభంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మరియు రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య గట్టి పోటీ నెలకొంది. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కూడా రేసులోకి రావడంతో ధర ఒక్కసారిగా ఆకాశాన్ని తాకింది.

IPL auction

రాజస్థాన్ మధ్యలోనే తప్పుకున్నా, చెన్నై మరియు కోల్‌కతా పట్టు వదలకుండా పోటీ పడటంతో ధర రూ. 25 కోట్ల మార్కును దాటింది. చివరికి రూ. 25.20 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ గ్రీన్‌ను దక్కించుకుంది.

గతంలో 2024 వేలం(IPL auction)లో మిచెల్ స్టార్క్‌ను ఇదే కోల్‌కతా జట్టు రూ. 24.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడు ఆ రికార్డును గ్రీన్ బద్దలు కొట్టాడు. బ్యాటింగ్ బౌలింగ్ రెండింటిలోనూ రాణించగల సామర్థ్యం ఉండటం వల్లే గ్రీన్ కోసం కోల్‌కతా అంత భారీ మొత్తాన్ని వెచ్చించింది.

IPL auction

గ్రీన్ ఒక పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్. అతను గంటకు 140 కి.మీ. వేగంతో బౌలింగ్ చేయగలడు.అలాగే బ్యాటింగ్‌లో మిడిల్ ఆర్డర్‌లో వచ్చి బంతులను మైదానం నలువైపులా కొట్టగల అద్భుతమైన హిట్టింగ్ సామర్థ్యం ఉంది.వీటితో పాటు గ్రీన్‌కు ఇంకా చిన్న వయస్సే. అందుకే అతన్ని కొనుగోలు చేయడం ద్వారా దీర్ఘకాలికంగా జట్టుకు ఒక కీలకమైన ఆస్తి అనుకున్నారు.

ఒకవైపు గ్రీన్ రికార్డు ధర దక్కించుకోగా, మరోవైపు తొలి సెట్‌లో కొందరు స్టార్ ప్లేయర్ల పరిస్థితి అభిమానులను విస్మయానికి గురిచేసింది. పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్, డెవాన్ కాన్వే, జేక్ ఫ్రెజర్ మెక్‌గుర్క్ వంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపకపోవడం చర్చనీయాంశంగా మారింది. వీరందరూ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు. ప్రస్తుత ఫామ్ లేదా జట్ల అవసరాలకు తగ్గట్టుగా వారు లేకపోవడం దీనికి కారణం కావచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version