T20: హ్యాట్రిక్ కొట్టాలి.. సిరీస్ పట్టాలి

T20: ఆల్ రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ మంచి ఫామ్ లో ఉండగా.. కెప్టెన్ సూర్యకుమార్,. ఓపెనర్ గిల్ ఈ మ్యాచ్ లోనైనా సత్తా చాటాలని భారత్ ఎదురుచూస్తోంది.

T20

భారత జట్టు ఆస్ట్రేలియా టూర్ చివరి అంకానికి చేరింది. వన్డే సిరీస్ కోల్పోయి, టీ ట్వంటీ (T20)సిరీస్ ఆరంభంలో తడబడిన టీమిండియా తర్వాత వరుసగా రెండు విజయాలతో అదరగొట్టింది. ఆల్ రౌండ్ షోతో ఆకట్టుకుంటున్న భారత్ ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో కొనసాగుతూ సిరీస్ విజయంపై కన్నేసింది. బ్రిస్బేన్ వేదికగా శనివారం జరిగే ఆఖరి మ్యాచ్ లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతోంది.

ఆల్ రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ మంచి ఫామ్ లో ఉండగా.. కెప్టెన్ సూర్యకుమార్,. ఓపెనర్ గిల్ ఈ మ్యాచ్ లోనైనా సత్తా చాటాలని భారత్ ఎదురుచూస్తోంది. మరోవైపు సిరీస్ సమం చేయాలని ఆసీస్ పట్టుదలగా ఉంది. నిజానికి టీ ట్వంటీ ప్రపంచకప్ విజయం తర్వాత షార్ట్ ఫార్మాట్ లో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. పైగా వచ్చే ఏడాది సొంతగడ్డపై జరిగే ప్రపంచకప్ కు ముందు జట్టు కూర్పును సెట్ చేసుకునేందుకు ఈ సిరీస్ ను ఉపయోగించుకుంటోంది. ఈ క్రమంలో బ్యాటింగ్ ఆర్డర్ లోనూ, తుది జట్టులోనూ పలు మార్పులు చేస్తోంది.

అంతా బాగానే ఉన్నా అభిషేక్ శర్మ మెరుపులు ఇంకా పూర్తిస్థాయిలో కనిపించలేదు. అన్నింటికీ మించి శుభమన్ గిల్ టీ20(T20) ఫార్మాట్ లో అదరగొట్టలేక విమర్శలు ఎదుర్కొంటున్నాడు. నాలుగో టీ ట్వంటీ(T20)లో 46 రన్స్ చేసినా అత్యంత నిదానంగా ఆడాడు. అసలు అది టీ ట్వంటీ ఫార్మాట్ కు సెట్ అయ్యే బ్యాటింగ్ లా కనిపించలేదంటూ సెటైర్లు వస్తున్నాయి. ఐపీఎల్ లో అదరగొట్టే గిల్ మరీ డిఫెన్సివ్ మోడ్ లో ఎందుకు ఆడుతున్నాడనేది అర్థం కావడం లేదు.

T20

మరోవైపు మూడో ప్లేస్ లో ప్రయోగాలను గంభీర్ కంటిన్యూ చేస్తున్నాడు. గత మ్యాచ్ లో సూర్యను ఆపి దూబేను పంపించగా.. పర్వాలేదనిపించే ఇన్నింగ్స్ ఆడాడు. మరి ఇదే ఆర్డర్ కొనసాగిస్తాడా లేక రెగ్యులర్ ఆర్డర్ నే ఫాలో అవుతాడా అన్నది చూడాలి. ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భారీ ఇన్నింగ్సే బాకీ ఉన్నాడు. కెప్టెన్ అయిన తర్వాత సూర్యకుమార్ పెద్దగా ఆడింది లేదు.

అతని గణాంకాలే దీనికి నిదర్శనం. ఈ మ్యాచ్ లోనైనా స్కై మెరుపులు చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. తిలక్ వర్మ, జితేశ్ శర్మ కూడా మెరుపులు మెరిపిస్తే తిరుగుండదు. అయితే తుది జట్టులోకి నితీశ్ కుమార్ రెడ్డి వస్తే దూబేను తప్పించాల్సి ఉంటుంది. బౌలింగ్ లో బుమ్రా, అర్షదీప్ లను కంటిన్యూ చేయనుండగా.. అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఆల్ రౌండ్ షోతో సూపర్ ఫామ్ లో ఉన్నారు.

మరోవైపు గత మ్యాచ్ లో భారీ టార్గెట్ కాకున్నా ఆస్ట్రేలియా చేతులెత్తేసింది. ఎన్నో అంచనాలకు దాదాపు 2 నెలల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన మాక్స్ వెల్ ఫ్లాప్ అయ్యాడు. ఇప్పుడు సిరీస్ చేజారకుండా ఉండాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో ఆసీస్ స్టార్ ప్లేయర్లు రాణించాల్సిందే.

భారత స్పిన్నర్లకు కంగారూలు క్రీజులో నిలవలేకపోతుండడం వారికి మరింత ఒత్తిడి పెంచుతోంది. భారత్, ఆసీస్ ఐదో టీ ట్వంటీకి ఆతిథ్యమిస్తున్న బ్రిస్బేన్ పిచ్ సాధారణంగా పేసర్లకు అనుకూలిస్తుంది. అయినప్పటకీ బ్యాటర్లు క్రీజులో కుదురుకుంటే మాత్రం పరుగుల వరదే. బిగ్ బాష్ లో చాలా సార్లు ఇక్కడ హైస్కోర్లు నమోదయ్యాయి.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version