Tilka Varma
అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న టీ20 (T20) ప్రపంచకప్ కు ఇంకా నెల రోజులే టైముంది. ఇప్పటికే టోర్నీలో ఆడనున్న చాలా దేశాలు తమ తమ జట్లను ప్రకటించాయి. ఈ మెగాటోర్నీకి ముందు అన్ని జట్లు పలు సిరీస్ లు ఆడుతూ సన్నద్ధమవుతున్నాయి.
భారత్ కూడా న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ తర్వాత ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడబోతోంది. ఇటువంటి పరిస్థితుల్లో భారత్ కు బిగ్ షాక్ తగిలింది. టీమిండియా స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ ( Tilak Varma ) టీ20 ప్రపంచకప్ కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీ ఆడుతున్న తిలక్ బుధవారం అనూహ్యంగా అనారోగ్యానికి గురయ్యాడు.
జమ్మూ కాశ్మీర్ తో మ్యాచ్ సందర్భంగా తిలక్ కు ( Tilak Varma ) వృషణాల్లో తీవ్రమైన నొప్పి వచ్చింది. హుటాహుటిన హాస్పిటల్ కు తీసుకెళ్లి స్కానింగ్ చేయించారు. తిలక్ కు టెస్టిక్యులర్ టోర్షన్ గా నిర్థారణ కావడంతో ఎమర్జెన్సీ సర్జరీ చేశారు. సర్జరీని విజయవంతంగా పూర్తి చేసినట్టు డాక్టర్లు తెలిపారు.
ప్రస్తుతం ఈ యువక్రికెటర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు హైదరాబాద్ జట్టు వర్గాలు తెలిపాయి. అయితే తిలక్ వర్మ మళ్లీ క్రికెట్ ఆడేందుకు సమయం పట్టనుంది. ఎంతకాలం రెస్ట్ అవసరమన్నది తెలియకున్నా కనీసం 3-4 వారాలు దూరమయ్యే అవకాశముందని భావిస్తున్నారు.
దీంతో ముందు న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ కు అతను దూరమవడం ఖాయమైంది. అదే సమయంలో ఫిబ్రవరి మొదటి వారం నుంచి మొదలుకానున్న టీ20 ప్రపంచకప్ కు సైతం దూరం కానున్నట్టు సమాచారం. ప్రస్తుతం తిలక్ వర్మ ( Tilak Varma ) సర్జరీకి సంబంధించి బీసీసీఐ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
అలాగే మళ్లీ ఎప్పుడు అందుబాటులోకి వస్తాడనేది కూడా సందిగ్ధంగానే మారింది. ఫిట్ నెస్ సాధించి సీవోఈ నుంచి క్లియరెన్స్ వస్తే తప్ప జట్టులో చేరే అవకాశాలు లేవు. ఫిబ్రవరి 7 నుంచి భారత్ , శ్రీలంక వేదికలుగా టీ20 ప్రపంచకప్ జరుగుతుంది. ఒకవేళ తిలక్ ( Tilak Varma ) ప్రపంచకప్‌కు దూరమైతే మాత్రం టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పాలి.
ఎందుకంటే రెండేళ్లుగా ఈ హైదరాబాదీ క్రికెటర్ అద్భుతంగా రాణిస్తున్నాడు. అత్యంత నమ్మదగిన బ్యాటర్ గానూ పేరు తెచ్చుకున్నాడు. ఇటీవల ఆసియాకప్ ఫైనల్లోనూ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అలాంటి తిలక్ వర్మ ( Tilak Varma ) లేకపోవడం పెద్ద లోటుగానే చెప్పాలి. ఇప్పుడు బీసీసీఐ అతన్ని స్థానాన్ని భర్తీ చేసే ప్లేయర్ కోసం వెతుకుతోంది.
T20:నాన్ స్టాప్ టీ20 ఫెస్టివల్..క్రికెట్ ఫ్యాన్స్ కు పూనకాలే
