Asia Cup: తెలుగోడి దెబ్బ…పాకిస్తాన్ అబ్బా టీమిండియాదే ఆసియాకప్

Asia Cup: వీరోచిత ఇన్నింగ్స్ కాదు హీరోచిత ఇన్నింగ్స్ తో ఆసియాకప్ ఫైనల్లో దుమ్మురేపాడు. ఫైనల్ ముందు వరకూ తిలక్ వర్మ సంచలన ఇన్నింగ్స్ లతో మెరిస్తే...

Asia Cup

ఇది కదా విజయం… ఇది కదా అసలైన ఆనందం.. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ కు సరిహద్దుల్లోనే కాదు క్రికెట్ గ్రౌండ్ లోనూ బుద్ధి చెబుతూ వారిని చిత్తు చేసిన భారత జట్టు ఆలియాకప్ విజేతగా నిలిచింది. తెలుగోడి దెబ్బ… పాకిస్థాన్ అబ్బా అనేలా హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మ భారత్ ను గెలిపించాడు.

వీరోచిత ఇన్నింగ్స్ కాదు హీరోచిత ఇన్నింగ్స్ తో ఆసియాకప్ ఫైనల్లో దుమ్మురేపాడు. ఫైనల్ ముందు వరకూ తిలక్ వర్మ సంచలన ఇన్నింగ్స్ లతో మెరిస్తే… తుది పోరులో తిలక్ వర్మ అద్భుతమైన బ్యాటింగ్ తో జట్టుకు టైటిల్ అందించాడు. అంతేకాదు పహల్గామ్ ఉగ్రదాడిలో అమరులైన వీరులకు విజయతిలకం దిద్ది నివాళి అర్పించాడు.

Asia Cup

ఊహించినట్టుగానే ఆసియా కప్(Asia Cup) ఫైనల్ ఉత్కంఠతో ఊపేసింది. అసలు సిసలు క్రికెట్ మజాను అందించింది. ఆరంభంలో పాకిస్తాన్ బ్యాటింగ్ చూసిన తర్వాత కనీసం 200 ప్లస్ రన్స్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ పాక్ ఓపెనర్లను ఔట్ చేశాక ఆ జట్టులో మిగిలిన బ్యాటర్లకు భారత బౌలర్లు అవకాశం ఇవ్వలేదు. భారత్ స్పిన్ త్రయం వరుసగా వికెట్లు తీస్తూ కట్టడి చేశారు.

ఈ టోర్నీ ఆరంభం నుంచీ అద్భుతంగా రాణిస్తున్న కుల్దీప్యాదవ్ ఫైనల్లోనూ 4 వికెట్లు తీసి పాక్ ను చావు దెబ్బ కొట్టాడు. అటు అక్షర్ పటేల్ , వరుణ్ చక్రవర్తి, బుమ్రా కూడా రెండేసి వికెట్లు తీయడంతో పాక్ 19.1 ఓవర్లలో ౧౪౬ రన్స్ కు అలౌట్ అయింది.

చిన్న టార్గెట్ కావడంతో భారత్ ఈజీగా గెలుస్తుందని అంతా ఊహించారు. కానీ ఊహించని విధంగా పాక్ బౌలర్లు రాణించారు. ఆరంభంలోనే అభిషేక్ శ‌ర్మ‌, గిల్ , సూర్య కుమార్ యాదవ్ ఔట్ అయ్యారు. ఈ దశలో తిలక్ వర్మ, సంజూ శాంసన్ జట్టును ఆదుకున్నారు. కీలక పార్టనర్ షిప్ తో మ్యాచ్ ను నిలబెట్టారు. ముఖ్యంగా తిలక్ వర్మ అద్భుతమైన షాట్లతో దుమ్ము రేపాడు. అటు సంజూ శాంసన్ కూడా చెలరేగడంతో భారత్ ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. అయితే సంజూ ఔట్ అయ్యాక శివమ్ దూబేతో కలిసి తిలక్ మరో కీలక పార్టనర్ షిప్ నెలకొల్పాడు. దీంతో ఒత్తిడి తగ్గుతూ వచ్చింది. చివర్లో పాక్ బౌలర్లు డాట్స్ వేయడం, దూబే ఔట్ అవ్వడంతో కాస్త టెన్షన్ నెలకొంది. కానీ తిలక్ వర్మ భారీ సిక్సర్ తో రిలీఫ్ ఇచ్చాడు. తర్వాత రింకూ సింగ్ విన్నింగ్ షాట్ కొట్టడంతో భారత్ వరుసగా రెండోసారి ఆసియా కప్ ను సొంతం చేసుకుంది. అలాగే ఓవరాల్ గా తొమ్మిదో సారి ఆసియా కప్ గెలిచిన జట్టుగా చరిత్ర సృష్టించింది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version