Vijay: విజయ్ హజారేకు కొత్త జోష్.. దేశవాళీ బరిలో స్టార్ ప్లేయర్స్

Vijay: సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా జాతీయ జట్టుకు సిరీస్ లు లేనప్పుడు ప్రతీ ఒక్కరూ దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ రూల్ తీసుకొచ్చింది.

Vijay

సాధారణంగా దేశవాళీ క్రికెట్ టోర్నీలు జరుగుతున్నప్పుడు సీనియర్ ప్లేయర్స్ జాతీయ జట్టు బిజీ షెడ్యూల్ లో ఎవ్వరూ ఆడరు. అయితే ఈ సారి మాత్రం విజయ్ హజారే (Vijay)కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీమిండియా క్రికెటర్లు చాలా మంది బరిలోకి దిగుతుండడమే దీనికి కారణం.  మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, శుభమన్ గిల్, అర్షదీప్ సింగ్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి వంటి టీమిండియా ప్లేయర్స్ అందరూ విజయ్ హజారే (Vijay)ట్రోఫీ ఆడుతున్నారు.

సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా జాతీయ జట్టుకు సిరీస్ లు లేనప్పుడు ప్రతీ ఒక్కరూ దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ రూల్ తీసుకొచ్చింది. అలా ఆడిన వారినే సెలక్టర్లు పరిగణలోకి తీసుకుంటారని స్పష్టం చేయడంతో కోహ్లి, రోహిత్ తో సహా సీనియర్లు చాలా మంది చాలా రోజుల తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడేందుకు రెడీ అయ్యారు. ఈ టోర్నీకి సంబంధించి రోకో జోడీపైనే అందరి చూపు ఉంది.

ఎందుకంటే 2027 వన్డే ప్రపంచకప్ ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్న రోహిత్, కోహ్లి అప్పటి వరకూ తమ ఫిట్ నెస్, ఫామ్ కొనసాగించుకోవడానికి దేశవాళీ మ్యాచ్ లు ఆడాల్సిందేనని బీసీసీఐ స్పష్టం చేసింది. దీంతో రోకో ద్వయం గత వారం నుంచే ప్రిపరేషన్ లో బిజీగా ఉంది. సిక్కిం, ఉత్తరాఖండ్ తో మ్యాచ్ ల కోసం రోహిత్ సిద్ధమయ్యాడు. ఈ టోర్నీలో 18 మ్యాచ్ లు ఆడిన హిటా మ్యాన్ 600 పరుగులు చేశాడు.

Vijay

అటు ఆంధ్రతో మ్యాచ్ కోసం కోహ్లి బెంగళూరు వెళ్ళి ప్రాక్టీస్ లో చెమటోడుస్తున్నాడు. దాదాపు 15 ఏళ్ళ తర్వాత విరాట్ విజయ్ హజారే (Vijay)ట్రోఫీ ఆడుతున్నాడు. ఈ టోర్నీలో అతనికి అద్భుతమైన రికార్డుంది. 2008-09 సీజన్ లో 7 మ్యాచ్ లు ఆడిన కింగ్ నాలుగు సెంచరీలతో 534 రన్స్ చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.

ఇటీవల సౌతాఫ్రికాతో సిరీస్ లో వరుస సెంచరీలతో అదరగొట్టిన విరాట్ ఇప్పుడు విజయ్ హజారే(Vijay)లోనూ చెలరేగిపోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వీరితో పాటు టీ ట్వంటీ ప్రపంచకప్ జట్టులో చోటు దక్కని శుభమన్ గిల్ కూడా తన ఫామ్ అందుకునేందుకు పట్టుదలగా ఉన్నాడు. వచ్చే నెలలో న్యూజిలాండ్ సిరీస్ కు ముందు సీనియర్లందరికీ విజయ్ హజారే(Vijay)

ట్రోఫీ సన్నాహకంగా ఉపయోగపడుతుండని చెప్పొచ్చు. వీరే కాదు ఢిల్లీ కెప్టెన్ గా ఎంపికైన రిషబ్ పంత్ , గిల్ , అర్షదీపిసింగ్, అభిషేక్ శర్మ వంటి ప్లేయర్స్ కూడా సత్తా చాటేందుకు ఉవ్విళ్ళూరుతున్నారు. కివీస్ తో వన్డే సిరీస్ జనవరి 11 నుంచి ఆరంభం కానుండగా.. ఈ లోపు జరిగే కొన్ని మ్యాచ్ లలో వీరందరినీ విజయ్ హజారేలో చూడొచ్చు.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version