World Cup 2025: కంగారెత్తిస్తారా ? ఆసీస్ తో సెమీఫైట్ కు భారత్ రెడీ

World Cup 2025: పూర్తిగా డామినేట్ చేస్తూ కివీస్ ను నిలువరించి సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. తర్వాత చివరి లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయినప్పటకీ బౌలర్లు మంచి ప్రాక్టీస్ చేసుకున్నారు.

World Cup 2025

మహిళల వన్డే ప్రపంచకప్(World Cup 2025) లో రెండో సెమీఫైనల్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ఆతిథ్య భారత జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో తలపడబోతోంది. వరుసగా రెండు విజయాలతో మెగాటోర్నీని ఘనంగా ప్రారంభించిన భారత్ తర్వాత హ్యాట్రిక్ ఓటములతో వెనుకబడిపోయింది. గెలిచే మ్యాచ్ లను చేజేతులారా చేజార్చుకుంది. దీంతో ఒక దశలో సెమీస్ కు వెళ్ళడం కష్టమన్న పరిస్థితి వచ్చింది. కానీ చివరికి న్యూజిలాండ్ తో డూ ఆర్ డై పోరులో చెలరేగిపోయింది.

పూర్తిగా డామినేట్ చేస్తూ కివీస్ ను నిలువరించి సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. తర్వాత చివరి లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయినప్పటకీ బౌలర్లు మంచి ప్రాక్టీస్ చేసుకున్నారు. ఇప్పుడు ఆస్ట్రేలియాతో సెమీస్ లో గెలిచి వరల్డ్ కప్ ఫైనల్లో(World Cup 2025) అడుగుపెట్టాలని భారత్ ఎదురుచూస్తోంది. అయితే అది అంత ఈజీ కాదు. ఎందుకంటే డిఫెండింగ్ ఛాంపియన్ అన్ని విభాగాల్లోనూ అత్యంత బలంగా ఉంది. అసలు టోర్నీలో అపజయమే ఎరుగని జట్టుగా నిలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాకు తగ్గట్టే అదరగొడుతూ సెమీస్ కు దూసుకొచ్చింది. అలాంటి కంగారూలను ఓడించాలంటే భారత్ అంచనాలు మించి రాణించాల్సిందే.

World Cup 2025

బ్యాటింగ్ లో ఓపెనర్ ప్రతీకా రావల్ గాయంతో దూరమవడం భారత్ కు మైనస్ గా మారింది. బంగ్లాతో మ్యాచ్ (World Cup 2025)లో ఫీల్డింగ్ చేస్తూ కాలు మెలిక పడి ఆమె టోర్నీకే దూరమైంది. ప్రతీకా స్థానంలో లేడీ సెహ్వాగ్ షెఫాలీ వర్మ రావడం బలాన్ని పెంచిందనే చెప్పాలి. మెగా టోర్నీకి ముందు ఫామ్ కోల్పోవడంతో ఆమెను సెలక్టర్లు పక్కన పెట్టారు. అయితే ఇటీవల దేశవాళీ టీ20 టోర్నీలో షెఫాలీ మళ్ళీ దుమ్మురేపింది.

దీంతో షెఫాలీపై భారీ అంచనాలే ఉన్నాయి. కంగారూలపై షెఫాలీ మెరుపు ఆరంభాన్నిస్తే భారీస్కోరుకు పునాది పడినట్టే. అలాగే స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్ కౌర్ , దీప్తి శర్మ ఫామ్ లో ఉన్నారు. వీరితో పాటు జెమీమా, హర్లిన్ డియోల్, రిఛా ఘోష్ కూడా చెలరేగితే తిరుగుండదు. బౌలింగ్ లో మాత్రం భారత్ మరింత మెరుగు పడాల్సి ఉంటుంది. ముఖ్యంగా డెత్ ఓవర్స్ లో భారీగా పరుగులిస్తుండడం ఇబ్బందిగా మారింది. ఈ కారణంగానే మూడు మ్యాచ్ లలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. క్రాంతి గౌడ్, స్నేహా రాణా, శ్రీచరణి రాణిస్తే విజయంపై ఆశలు పెట్టుకోవచ్చు.

మరోవైపు తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తున్న ఆస్ట్రేలియా మరోసారి ఫైనల్ కు చేరుకోవాలని ఉవ్విళ్ళూరుతోంది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉంది. రిజర్వ్ డే ఉండడం కాస్త ఊరటనిచ్చినా ఆ రోజు కూడా సాధ్యం కాకుండా ఆస్ట్రేలియా ఫైనల్ కు చేరుతుంది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version