Vietnam or Bali:రూ. 50 వేలతోనే ఫారెన్ ట్రిప్.. వియత్నాం లేదా బాలి ట్రిప్ ప్లాన్ చేసుకుంటారా?

Vietnam or Bali: స్కాన్ సాఫ్ట్ వేర్ లేదా గూగుల్ ఫ్లైట్స్ వంటి యాప్స్ ద్వారా తక్కువ ధరలు ఎప్పుడున్నాయో చెక్ చేసుకోవాలి.

Vietnam or Bali

చాలామంది విదేశీ ప్రయాణమంటే లక్షల ఖర్చు అనుకుంటారు. కానీ విమాన టిక్కెట్ల నుంచి హోటళ్ల వరకు కొన్ని ట్రిక్స్ ఉపయోగిస్తే కేవలం యాభై వేల రూపాయలతో విదేశీ గడ్డపై అడుగు పెట్టొచ్చు.అక్కడ నచ్చిన ప్రదేశాలు చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు.

వియత్నాం , బాలి(Vietnam or Bali) ఈ రెండు కూడా భారతీయులకు బడ్జెట్ ఫ్రెండ్లీ దేశాలుగా చెప్పొచ్చు. వియత్నాంలో మన రూపాయి విలువ ఎక్కువగా ఉండటం అక్కడ మనకు ప్లస్ పాయింట్. ఉదాహరణకు ఒక రూపాయి అక్కడ దాదాపు 300 వియత్నామీస్ డాంగ్‌లకు సమానం అన్నమాట. అంటే మనం 50వేల రూపాయలు తీసుకెళ్లినా అక్కడ మనం లక్షాధికారులమే.

ఈ వియత్నాం , బాలి(Vietnam or Bali) ఫారెన్ ట్రిప్‌లో ప్రధాన ఖర్చు విమాన టిక్కెట్లు. వీటిని ఆరు నెలల ముందే బుక్ చేసుకుంటే మాత్రం చాలా ప్లస్ అవుతుంది. ఎలా అంటే రానుపోను పదిహేను నుంచి ఇరవై వేల లోపు దొరికే అవకాశం ఉంటుంది. స్కాన్ సాఫ్ట్ వేర్ లేదా గూగుల్ ఫ్లైట్స్ వంటి యాప్స్ ద్వారా తక్కువ ధరలు ఎప్పుడున్నాయో చెక్ చేసుకోవాలి.

వసతి విషయానికొస్తే, బాలిలో కేవలం వెయ్యి రూపాయలకే స్విమ్మింగ్ పూల్ సౌకర్యం ఉన్న అద్భుతమైన విల్లాలు లేదా హోమ్ స్టేలు లభిస్తాయి.ఇక వియత్నాంలో హోస్ట్ ఫ్యామిలీస్‌తో ఉంటే భోజనం, వసతి కలిపినా కూడా చాలా తక్కువ ఖర్చు అవుతుంది.

Vietnam or Bali

ఇక భోజనం విషయానికి వస్తే స్థానిక స్ట్రీట్ ఫుడ్ ని ట్రై చేయండి. వియత్నాం ‘ఫో’ (Pho) సూప్ , బాలి ‘నాసి గోరెంగ్’ ప్రపంచ ప్రసిద్ధి చెందినవే కాకుండా ధర కూడా చాలా తక్కువ. అక్కడ తిరగడానికి లోకల్ ట్యాక్సీల కంటే ‘గ్రాబ్’ (Grab) అనే యాప్ వాడటం కానీ రోజుకు ఐదు వందలకే స్కూటర్ అద్దెకు తీసుకోవడం కానీ చేయడం వల్ల వేల రూపాయలు ఆదా అవుతాయి.

వియత్నాంలోని హానోయ్ లోని ప్రాచీన వీధులు, బాలిలోని పవిత్రమైన ఆలయాలు ,బీచ్‌లు సందర్శించడానికి పెద్దగా ఖర్చు అవ్వదు. ఈ చిన్న ప్లానింగ్ తో మీరు మీ ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ లలో విదేశీ యాత్ర ఫోటోలతో రచ్చ చేసేయొచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version