మీరు తరచుగా ఇన్‌స్టాగ్రామ్(Instagram)ను వినియోగిస్తున్నట్లయితే, మీలాంటి కంటెంట్ క్రియేటర్ల కోసం ఇన్‌స్టా ఇప్పుడు ఒక విప్లవాత్మకమైన ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అదే మల్టీ-ఆడియో ట్రాక్ ఫీచర్. గతంలో రీల్స్ చేసేటప్పుడు ఒకటికి మించి పాటలను జోడించడానికి అవకాశం ఉండేది కాదు. యూజర్ల ఈ ఇబ్బందిని గుర్తించిన ఇన్‌స్టాగ్రామ్, తాజాగా ఈ కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది.
ఈ తాజా అప్‌డేట్‌తో యూజర్లు ఒకే రీల్‌కు ఏకంగా 20 ఆడియో ట్రాక్‌లను జత చేసుకునే అద్భుతమైన వెసులుబాటు లభించింది. దీనివల్ల కంటెంట్‌ను మరింత సృజనాత్మకంగా (Creative), ఆకర్షణీయంగా మార్చుకునే అవకాశం దొరుకుతుంది. ఇన్‌స్టాగ్రామ్(Instagram) హెడ్ ఆడమ్ మొస్సేరీ ఈ విషయాన్ని వెల్లడిస్తూ, ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ కంటెంట్‌తో మరింత క్రియేటివిటీని జోడించవచ్చని అభిప్రాయపడ్డారు.
మల్టీ-ఆడియో ట్రాక్ ఫీచర్ ప్రత్యేకతలు.. ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్లకు లభించే ప్రధాన ప్రయోజనాలు ఇవి:
మల్టీ-ఆడియో మిక్సింగ్.. యూజర్లు రీల్స్‌కు బహుళ ఆడియో ట్రాక్‌లను (పాటలు, వాయిస్ ఓవర్లు, సౌండ్ ఎఫెక్ట్స్) యాడ్ చేసుకునే అవకాశం ఉంది.
అలైన్‌మెంట్ సౌలభ్యం.. ఎడిటింగ్ ప్రక్రియలో ఈ ఆడియో ట్రాక్‌లను టెక్స్ట్ కంటెంట్, స్టిక్కర్లు, వీడియో క్లిప్‌లతో సులభంగా అనుగుణంగా (అలైన్) చేసుకోవచ్చు. దీనివల్ల వీడియో ఎడిటింగ్‌కి కొత్తవారు కూడా తమ కంటెంట్‌ను మరింత ఆకర్షణీయంగా కస్టమైజ్ చేసుకోవచ్చు.
సొంత ట్రాక్ సృష్టి.. యూజర్లు ఇలా క్రియేటివ్‌గా సృష్టించిన ప్రత్యేకమైన ఆడియో మిక్స్‌ను సొంతంగా ఆడియో ట్రాక్‌గా తయారు చేసుకోవచ్చు.
క్రెడిట్ & వినియోగం.. యూజర్ క్రియేట్ చేసిన ఈ ప్రత్యేకమైన ఆడియో ట్రాక్‌లను ఇతరులు కూడా సేవ్ చేసుకొని వాడుకునే వీలుంది. ఈ ట్రాక్‌లను సృష్టించిన యూజర్ పేరు మీదే లేబుల్ చేసి, వారికి తగిన క్రెడిట్ కూడా ఇవ్వనున్నారు.
ఈ కొత్త అప్‌డేట్‌ను పొందడానికి యూజర్లు తమ ఇన్‌స్టాగ్రామ్(Instagram) యాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలి.అప్‌డేట్ చేసిన తర్వాత, యాప్‌లోని వీడియో ఎడిటర్‌లోకి వెళ్లాలి.అక్కడ కనిపించే ‘Add to mix’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.తర్వాత, మీకు కావాల్సిన ఆడియో ట్రాక్‌లను ఒకదాని తర్వాత ఒకటిగా సెలెక్ట్ చేసుకోవచ్చు.అంతేకాక, ఒక్కో ఆడియోలో కావాల్సిన భాగాన్ని కూడా ఎంచుకునే వెసులుబాటు ఇందులో ఉంటుంది.
ప్రస్తుతానికి, ఈ మల్టీ-ఆడియో ట్రాక్ ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చినా , మన దేశంలో కొంతమంది యూజర్లకు మాత్రమే కనిపిస్తోందని, త్వరలోనే అందరికీ అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ఈ ఫీచర్ రీల్స్‌ను మరింత సరదాగా, అత్యధిక క్రియేటివిటీతో సృష్టించడానికి అవకాశం ఇస్తుందనడంలో సందేహం లేదు.