Biometric
టెక్నాలజీ మనిషి జీవితాన్ని ఎంత స్పీడుగా మారుస్తుందో చెప్పడానికి పేమెంట్లో వ్యవస్థలో (Payments) వస్తున్న మార్పులే నిదర్శనం. ఒకప్పుడు డబ్బుతో మాత్రమే వ్యాపారం సాగేది. ఆ తర్వాత క్రెడిట్, డెబిట్ కార్డులు వచ్చాయి. ఇప్పుడు యూపీఐ ద్వారా ఫోన్లతోనే పేమెంట్స్ చేసేస్తున్నాం.. కావాల్సినవి కొనుక్కుంటున్నాంజ
అయితే రాబోయే రోజుల్లో ఫోన్ కూడా అవసరం పడదు. కేవలం మన ఫింగర్ ప్రింట్ (Fingerprint), మన కళ్లు(Iris) , మన ముఖం (Face) ద్వారానే లావాదేవీలు పూర్తి చేసే బయోమెట్రిక్(Biometric) పేమెంట్స్ టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా విప్లవం సృష్టిస్తోంది. ఈ పద్ధతిలో.. మన బాడీలోని ప్రత్యేకమైన గుర్తులను డిజిటల్ డేటాగా మార్చి మన బ్యాంకు అకౌంట్‌కు లింక్ చేస్తారు. దీనివల్ల కార్డులు మర్చిపోతామనే భయం లేదా పిన్ నంబర్లు దొంగిలిస్తారనే టెన్షన్ ఉండదు.
బయోమెట్రిక్ పేమెంట్స్ లో పామ్ రికగ్నైజేషన్ (Palm Recognition) అనేది చాలా పాపులర్ అవుతోంది. అమెజాన్ వంటి సంస్థలు ఇప్పటికే కొన్ని చోట్ల చేతిని స్కాన్ చేయడం ద్వారా పేమెంట్స్ చేసే పద్ధతిని ఇప్పటికే ప్రవేశపెట్టాయి. అలాగే ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా షాపింగ్ మాల్స్ లో.. లైన్ లో నిలబడకుండానే బిల్లులు చెల్లించే అవకాశం కలుగుతోంది.
ఈ టెక్నాలజీ వల్ల టైమ్ చాలా సేవ్ అవుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు లేదా చదువుకోని వారు కూడా పిన్ నంబర్లు , ఫోన్ పాస్‌వర్డ్‌లతో ఇబ్బంది పడకుండా ఈజీగా ట్రాన్జాక్జన్స్ చేయొచ్చు. సెక్యూరిటీ పరంగా చూస్తే, ఒకరి బయోమెట్రిక్ డేటాను మరొకరు కాపీ చేయడం చాలా కష్టం కాబట్టి ఇది సురక్షితమైన పద్ధతి అని టెక్ నిపుణులు చెబుతున్నారు.
అయితే ఏ టెక్నాలజీలో అయినా కొన్ని లోపాలున్నట్లే, దీనిలో కూడా డేటా ప్రైవసీకి సంబంధించిన భయాలున్నాయి. మన ఫింగర్ ప్రింట్స్ లేదా ఫేస్ డేటా సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కుతుందేమోనని చాలా మంది భయపడుతున్నారు. కానీ కంపెనీలు ఈ డేటాను ‘ఎన్‌క్రిప్టెడ్’ ఫార్మాట్‌లో దాచి ఉంచుతామని.. భరోసా ఇస్తున్నాయి.
భారతదేశంలో కూడా ఆధార్ ఆధారిత చెల్లింపుల (AEPS) ద్వారా ఈ బయోమెట్రిక్(Biometric) మెథడ్ ఇప్పటికే పాక్షికంగా అందుబాటులో ఉంది. ఫ్యూచర్లో మనం ఒక సూపర్ మార్కెట్‌కు వెళ్లి వస్తువులు తీసుకుని బయటకు వచ్చేటప్పుడు, కేవలం మన ముఖాన్ని కెమెరాకు చూపిస్తే చాలు.. మన అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయిపోతాయి. ఈ టెక్నాలజీ వల్ల నగదు రహిత సమాజం దిశగా మనం మరో అడుగు ముందుకు వేస్తున్నామనే చెప్పొచ్చు.
Aadhaar card:ఆధార్ కార్డు ఉంటే చాలు.. కేంద్రం నుంచి రూ. 90 వేలు!
