iPhone: ఓ మై గాడ్.. ఐఫోన్‌లో ఇన్ని మైండ్ బ్లోయింగ్ ఫీచర్లున్నాయా?

iPhone : 99 శాతం మందికి ఐఫోన్‌లో ఈ ఫీచర్లున్న సంగతే తెలియదట.

iPhone

యాపిల్ ఫోన్‌(iPhone)లో ఉన్న ఒక్క “నోట్” ఆప్‌తో మీరు ఏవేవో చేయొచ్చు అనేది తెలుసా? చాలా మందికి ఇది ఓ చిన్న నోట్‌ప్యాడ్‌ అనిపించొచ్చు. కానీ Notes App లో అసలు జాబితా చాలా పెద్దది. స్కానర్ లా పనిచేస్తుంది, లాక్ పెట్టుకోవచ్చు, సీక్రెట్ డాక్యుమెంట్ దాచుకోవచ్చు. సొంతంగా డ్రాయింగ్ చేయొచ్చు, టు-డూ లిస్ట్ ప్లాన్ చేసుకోవచ్చు, PDF లు తయారుచేయొచ్చు. ఇవన్నీ మీ iPhone లోనే చేయొచ్చు. అదీ పూర్తి సెక్యూరిటీలో! చూస్తుంటేనే వావ్ అన్పిస్తుంది కదా.. వెంటనే వీడి వాడి ఇంకా పూర్తి వైబ్‌లోకి వెళ్లిపోండి..

I Phone Notes App: ఒకే App లో ఎన్నో పనులు

అందరూ చిన్న నోట్ రాసుకునే App అనుకుంటారు. కానీ Notes App లో అసలు జాబితా చాలా పెద్దది. స్కానర్ లా పనిచేస్తుంది, లాక్ పెట్టుకోవచ్చు, సీక్రెట్ డాక్యుమెంట్ దాచుకోవచ్చు. సొంతంగా డ్రాయింగ్ చేయొచ్చు, టు-డూ లిస్ట్ ప్లాన్ చేసుకోవచ్చు, PDF లు తయారుచేయొచ్చు. ఇవన్నీ మీ iPhone లోనే చేయొచ్చు.

iPhone

డాక్యుమెంట్ స్కాన్ చేయడం

Notes App ఓపెన్ చేయండి → Write new note → కెమెరా గుర్తుపై ప్రెస్ చేయండి → “Scan Documents” సెలక్ట్ చేయండి → డాక్యుమెంట్ స్కాన్ చేసి “Save” చేయండి.

వ్యక్తిగత నోట్‌కి లాక్ పెట్టడం

మీ నోట్ ఓపెన్ చేయండి → పై ఉన్న మూడు బొట్టు గుర్తుపై ప్రెస్ చేయండి → Lock సెలక్ట్ చేయండి → Face ID లేదా Password సెట్ చేయండి.

PDF లా సేవ్ చేయడం

నోట్ కంప్లీట్ అయిన తర్వాత → Share బటన్ ప్రెస్ చేయండి → “Send a Copy” సెలక్ట్ చేయండి → “Markup” లో అవసరమైన మార్పులు చేయండి → “Save to Files” సెలక్ట్ చేయండి.

Checklist ఉపయోగించడం

New Note ఓపెన్ చేయండి → టూల్‌బార్‌లో ✓ గుర్తుపై ప్రెస్ చేయండి → టాస్కులు టైప్ చేయండి → Share చేయాలంటే “Collaborate” సెలక్ట్ చేసి మీ స్నేహితులతో పంచుకోండి.

iPhone

Tag లు వాడడం

ఒకే టైప్‌కి సంబంధించిన నోట్‌లను వేరే చేయాలంటే Tag వాడండి. ఉదాహరణకి #travel, #work ఇలా టైప్ చేస్తే Folders లిస్టులో ఆ ట్యాగ్ కనిపిస్తుంది. క్లిక్ చేస్తే సంబంధిత నోట్‌లు అన్నీ వస్తాయి.

Drawing Tool ఉపయోగించడం

Drawing చేయాలంటే + గుర్తుపై ప్రెస్ చేసి Drawing సెలక్ట్ చేయండి → Pen, Pencil, Marker వంటివి వాడండి → Save చేయొచ్చు.

Handwriting టూల్

Markup మోడ్ ఓపెన్ చేయండి → Pen టూల్ సెలక్ట్ చేయండి → మీ చేతి రాతలో నోట్స్ రాయండి → ఫొటోల్లో సంతకం చెయ్యాలి అంటే కూడా ఇది ఉపయోగపడుతుంది.

లింక్‌డ్ నోట్‌ల ఫీచర్

ఒక ప్రాజెక్ట్ కి సంబంధించిన రెండు నోట్స్‌ను కనెక్ట్ చేయాలి అంటే, నోట్ టైటిల్ టైప్ చేసి లింక్ చేయొచ్చు. క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా ఆ నోటుకి వెళ్లిపోతుంది.

ఇది మామూలు నోట్‌ రాసుకునే App కాదు. ఇది ఒక ప్రొఫెషనల్ ప్లానర్, సీక్రెట్ రికార్డర్, స్మార్ట్ డ్రాయింగ్ ప్యాడ్, డాక్యుమెంట్ స్కానర్, పర్సనల్ అసిస్టెంట్ అన్నమాట. మీరు ఎలా వాడతారో బట్టే, ఇది ఎంత పనికొచ్చే App అనేది మారుతుంది!

Also Read: Bhadrachalam: గదిలో కెమెరా ..ప్రైవేట్ క్షణాలతో బ్లాక్ మెయిల్

 

Exit mobile version