Mobile battery:మొబైల్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా? ఈ చిట్కాలు పాటించండి

Mobile battery:మొబైల్ బ్యాటరీ త్వరగా అయిపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి స్క్రీన్ బ్రైట్‌నెస్ ఎక్కువగా ఉండటం.

Mobile battery

మొబైల్ ఫోన్ బ్యాటరీ (Mobile battery)లైఫ్ త్వరగా అయిపోవడం అనేది చాలా మందికి ఒక పెద్ద సమస్య. దీనివల్ల ఎమర్జెన్సీ సమయాలలో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. ఈ సమస్యను అధిగమించడానికి, బ్యాటరీ లైఫ్‌ను పెంచడానికి కొన్ని సులభమైన చిట్కాలు ఉన్నాయి.

స్క్రీన్ బ్రైట్‌నెస్..మొబైల్ బ్యాటరీ త్వరగా అయిపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి స్క్రీన్ బ్రైట్‌నెస్ ఎక్కువగా ఉండటం. అవసరానికి మించి బ్రైట్‌నెస్ ఉంచడం వల్ల బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుంది. ఆటోమేటిక్ బ్రైట్‌నెస్ ఫీచర్‌ను ఆన్ చేసుకోవడం లేదా అవసరమైనప్పుడు బ్రైట్‌నెస్ తగ్గించడం మంచిది.

బ్యాక్‌గ్రౌండ్ యాప్స్.. మనం వాడని యాప్స్ కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూ ఉంటాయి. దీనివల్ల అవి బ్యాటరీని ఎక్కువగా ఖర్చు చేస్తాయి. బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయ్యే అనవసరమైన యాప్స్‌ను మూసివేయడం లేదా వాటి బ్యాక్‌గ్రౌండ్ రిఫ్రెష్ ఫీచర్‌ను డిసేబుల్ చేయడం వల్ల బ్యాటరీ ఆదా అవుతుంది.

Mobile battery

నోటిఫికేషన్‌లు.. యాప్ నోటిఫికేషన్‌లు కూడా బ్యాటరీ(Mobile battery)ని ఖర్చు చేస్తాయి. ప్రతి నోటిఫికేషన్‌ వచ్చినప్పుడు స్క్రీన్ ఆన్ అవడం, సౌండ్ రావడం వల్ల బ్యాటరీ త్వరగా అయిపోతుంది. అనవసరమైన యాప్స్ నోటిఫికేషన్‌లను ఆఫ్ చేసుకోవడం మంచిది.

వైఫై, బ్లూటూత్, లొకేషన్.. వైఫై, బ్లూటూత్, లొకేషన్ సర్వీసులు ఎల్లప్పుడూ ఆన్‌లో ఉంటే బ్యాటరీ త్వరగా అయిపోతుంది. వాటిని ఉపయోగించనప్పుడు ఆఫ్ చేయడం మంచిది.

ఎక్స్‌ట్రీమ్ టెంపరేచర్స్.. మొబైల్ ఫోన్‌ను అధిక వేడి లేదా చల్లని వాతావరణంలో ఉంచడం బ్యాటరీ లైఫ్‌ను ప్రభావితం చేస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Exit mobile version