Gemini AI:జెమినీ AIలో ఫోటోలు పెడితే డేంజరా ? వాస్తవాలు ఏంటి?

Gemini AI:AI రూపొందించిన ఆ కొత్త ఫోటోలో, అమ్మాయికి భుజంపై పుట్టుమచ్చ కనిపించింది.నిజంగానే ఆ ప్లేసులో తనకు పుట్టుమచ్చ ఉండటంతో.. ఈ విషయం చూసి ఆ అమ్మాయి షాక్ అయ్యి, ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Gemini AI

సోషల్ మీడియాలో ఇటీవల ఒక సంఘటన చాలా చర్చనీయాంశమైంది. ఒక అమ్మాయి నిండుగా చుడీదార్ వేసుకున్న తన ఫోటోను జెమినీ AIకి ఇచ్చి, దాన్ని చీర కట్టుకున్న ఫోటోగా మార్చమని అడిగింది. AI రూపొందించిన ఆ కొత్త ఫోటోలో, అమ్మాయికి భుజంపై పుట్టుమచ్చ కనిపించింది.నిజంగానే ఆ ప్లేసులో తనకు పుట్టుమచ్చ ఉండటంతో.. ఈ విషయం చూసి ఆ అమ్మాయి షాక్ అయ్యి, ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.దీనితో చాలామందిలో AI భద్రతపై భయాలు పెరిగాయి.

సాంకేతిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, AI ఇలాంటి సమాచారాన్ని ఊహించడం దాదాపు అసాధ్యం. జెమినీ AI(Gemini AI)కి మీరు ఇచ్చిన ఫోటోలో దుస్తుల వెనుక ఉన్న పుట్టుమచ్చ గురించి తెలియదు. ఈ సంఘటనలో AI కేవలం యాదృచ్ఛికంగా ఒక పుట్టుమచ్చను సృష్టించింది. ఇది ఎలా జరుగుతుంది అంటే, AIకి లక్షలాది ఫోటోలతో శిక్షణ ఇస్తారు. ఆ డేటాలో పుట్టుమచ్చలు ఉన్న చాలా ఫోటోలు ఉండొచ్చు. అందువల్ల, AI ఒక ఫోటోను రూపొందించేటప్పుడు, సహజమైన రూపాన్ని ఇవ్వడానికి కొన్నిసార్లు ఇలాంటి చిన్నపాటి వివరాలను యాదృచ్ఛికంగా సృష్టించొచ్చు. ఆ అమ్మాయి విషయంలో, అది నిజమైన పుట్టుమచ్చ ఉన్న చోట రావడం కేవలం ఒక కో ఇన్నిడెన్స్ (coincidence) మాత్రమే అంటున్నారు.

Gemini AI

సాంకేతిక నిపుణులు, సైబర్ సెక్యూరిటీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇలా జరగడం అసాధ్యం. మనం ఇమేజ్ రికగ్నిషన్‌ కోసం ఉపయోగించే ఏ AI మోడల్ కూడా, ఒక దుస్తులు ధరించిన వ్యక్తి శరీర భాగాలను ఊహించి, వాటిని పుట్టుమచ్చలతో సహా చూపెట్టలేదు. ఇలాంటి టెక్నాలజీ ఇంకా అందుబాటులో లేదు.
నిజానికి AI మోడల్స్, వాటికి శిక్షణ ఇచ్చిన డేటా ఆధారంగా పని చేస్తాయి.

ఉదాహరణకు, మీరు ఒక కుక్క ఫోటోను AIకి ఇస్తే, అది ఆ కుక్క జాతిని, రంగును, దాని కళ్ల ఆకారాన్ని గుర్తించగలదు. ఎందుకంటే, దానికి లక్షల కుక్కల ఫోటోలతో శిక్షణ ఇచ్చారు. అదే ఒక మనిషి ఫోటోను నగ్నంగా చూపించడం లాంటివి చేయలేదు. ఎందుకంటే, ఇలాంటి వాటికి దానికి శిక్షణ ఇవ్వలేదు. ఒకవేళ ఇస్తే, ఆ AIని నేరపూరిత ఉద్దేశాలకు ఉపయోగించినట్టు అవుతుంది. ఇలాంటి మోడల్స్‌ను గూగుల్ లాంటి పెద్ద సంస్థలు తయారు చేయవు.

అయితే యూజర్లు ఇలాంటి పుకార్లను నమ్మి భయపడాల్సిన అవసరం లేదు. కానీ, ఇంటర్నెట్‌లో ఫోటోలు షేర్ చేసేటప్పుడు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. గుర్తు తెలియని యాప్స్, వెబ్‌సైట్లలో ఫోటోలు అప్లోడ్ చేయకండి. మీ పర్సనల్ డేటాను ఎవరితో షేర్ చేయవద్దు.సైబర్ సెక్యూరిటీ నియమాలను పాటించండి.జెమినీ AI(Gemini AI)పై వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవే అయినా కూడా మనం ఏ యాప్ ఉపయోగించినా, దాని వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాల గురించి తెలుసుకోవడం చాలా అవసరం.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Exit mobile version