Telegram users: వాట్సాప్,టెలిగ్రామ్ యూజర్స్‌కు  షాకింగ్ న్యూస్..

Telegram users: ఎవరైనా తమ ఫోన్ నుంచి ఆ సిమ్ కార్డును తొలగిస్తే, వారికి యాప్‌ సేవలు బ్లాక్ అవుతాయి లేదా పనిచేయవు.

Telegram users

దేశంలో సైబర్ మోసాలు పెరిగిపోతుండటంతో.. కేంద్ర ప్రభుత్వం టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) ద్వారా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వాట్సాప్ (WhatsApp), టెలిగ్రామ్ (Telegram users), సిగ్నల్ (Signal), స్నాప్‌చాట్ (Snapchat) వంటి అన్ని మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించే విధానం పూర్తిగా మారబోతోంది. ఈ కొత్త నియమాల ప్రకారం, మొబైల్ నంబర్ ఆధారిత కమ్యూనికేషన్ సర్వీసులు అందించే ప్రతి యాప్, వినియోగదారు యొక్క డివైజ్‌లో రిజిస్ట్రేషన్ కోసం వాడిన ఫిజికల్ సిమ్ కార్డు ఉండటాన్ని తప్పనిసరి చేయనుంది.

ఈ కొత్త ‘సిమ్ బేసిడ్ యాక్సెస్’ నిబంధనల ప్రకారం, మెసేజింగ్ యాప్‌ల వినియోగదారులు రిజిస్ట్రేషన్ సమయంలో ఏ సిమ్ కార్డును ఉపయోగించారో, ఆ సిమ్ కార్డును తప్పనిసరిగా తమ డివైజ్‌లో (ఫోన్‌లో) ఎప్పుడూ ఉంచుకోవాలి. ఎవరైనా తమ ఫోన్ నుంచి ఆ సిమ్ కార్డును తొలగిస్తే, వారికి యాప్‌ సేవలు బ్లాక్ అవుతాయి లేదా పనిచేయవు. ఈ నిబంధనలను పాటించడానికి కమ్యూనికేషన్ యాప్‌లకు 90 రోజుల గడువు ఇచ్చారు. ఈ సిమ్ బైండింగ్ ద్వారా అసలైన కస్టమర్లను గుర్తించడం సులభమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Telegram users

ఈ కొత్త మార్పు కేవలం ఫోన్‌లో యాప్‌(Telegram users)ను ఉపయోగించే వారికి మాత్రమే కాదు, వెబ్ ఆధారిత సెషన్‌లను ఉపయోగించే వారికి కూడా వర్తిస్తుంది. వాట్సాప్ వెబ్ (WhatsApp Web) తో సహా, ఈ యాప్‌ల యొక్క వెబ్ వెర్షన్‌లు ఇకపై ప్రతి 6 గంటలకు ఒకసారి ఆటోమాటిక్‌గా లాగ్ అవుట్ అయ్యేలా నిబంధనల్లో మార్పులు తీసుకురానున్నారు. అంటే, ఆఫీసుల్లో ల్యాప్‌టాప్‌లు లేదా కంప్యూటర్‌లలో వాట్సాప్ ఉపయోగించే వారు ప్రతి 6 గంటలకు మళ్లీ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇది సైబర్ మోసాలను, అనధికారిక లాగిన్‌లను భారీగా తగ్గిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

భారతీయ వినియోగదారులు ఎక్కువగా వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు. చాలా మంది మల్టీ-డివైజ్‌లలో (రెండు స్మార్ట్‌ఫోన్‌లు లేదా టాబ్లెట్‌లలో) ఒకే వాట్సాప్ అకౌంట్‌ను లింక్ చేసి వాడుతున్నారు. అయితే, ఈ సిమ్-బైండింగ్ రూల్ వలన ఒకే సిమ్ కార్డును రెండు వేర్వేరు డివైజ్‌లలో వాడుకోవడం కష్టమవుతుంది, ఇది వాట్సాప్ కనెక్టివిటీకి అంతరాయం కలిగించొచ్చు. అయితే దేశం వెలుపల నుంచి పెరిగిపోతున్న సైబర్ మోసాలను అరికట్టేందుకు, టెలికాం సైబర్ భద్రతకు సవాలుగా మారుతున్న ఇటువంటి అంశాలను పరిష్కరించడానికి ఈ కొత్త నియమాలను తీసుకొస్తున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Exit mobile version