Videos:ఏఐతో మీ ఫోటోలను ప్రొఫెషనల్ వీడియోలుగా మార్చుకోండి.. ఈ టిప్స్ మీ కోసమే..

Videos: చేతిలో ఫోన్ ఉంటే చాలు, కేవలం కొద్ది సెకన్లలోనే ఫోటోలకు ప్రాణం పోయొచ్చు. ఫోటోలో ఉన్న మనుషులు నవ్వడం, నడవడం, మాట్లాడటం వంటివి ఏఐ టూల్స్‌తో ఈజీగా చేయొచ్చు.

Videos

సాంకేతిక ప్రపంచం ఇప్పుడు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) చుట్టూ పరుగులు తీస్తోంది. ఒకప్పుడు ఒక ఫోటోను వీడియోగా మార్చాలంటే పెద్ద పెద్ద సాఫ్ట్‌వేర్లు, ఎడిటింగ్ నాలెడ్జ్ కావాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు చేతిలో ఫోన్ ఉంటే చాలు, కేవలం కొద్ది సెకన్లలోనే ఫోటోలకు ప్రాణం పోయొచ్చు. ఫోటోలో ఉన్న మనుషులు నవ్వడం, నడవడం, మాట్లాడటం వంటివి ఏఐ టూల్స్‌తో ఈజీగా చేయొచ్చు. సోషల్ మీడియాలో ఇన్ స్టాగ్రామ్ రీల్స్ చేసేవారికి,అయితే ఇవి ఇంకా బాగా ఉపయోగపడతాయి. దీనికోసం బెస్ట్ ఫ్రీ ఏఐ టూల్స్ ఏమున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

క్లింగ్ ఏఐ (Kling AI)..ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా స్పీడుగా వైరల్ అవుతున్న టూల్ ఇది. దీనిలో మీరు ఏదైనా ఫోటోను అప్‌లోడ్ చేసి, కింద ఒక చిన్న ప్రాంప్ట్ (టెక్స్ట్) ఇస్తే చాలు అది అద్భుతమైన వీడియో(Videos)ను నిమిషాల్లో క్రియేట్ చేస్తుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి ఫోటో పెట్టి ‘ఈ వ్యక్తి భోజనం చేస్తున్నట్లు వీడియో కావాలని చెబితే చాలు, చాలా నేచురల్‌గా ఆ వీడియో తయారవుతుంది. ఇది చాలా వరకు ఫ్రీగానే వాడుకోవచ్చు.

లూమా డ్రీమ్ మెషీన్ (Luma Dream Machine)..మీ పాత ఫోటోలు లేదా జ్ఞాపకాలను మరోసారి సజీవంగా చూడాలనుకుంటే ఈ టూల్ బెస్ట్. ఇది ఫోటోలోని వస్తువులను, మనుషులను కూడా చాలా డీటెయిల్డ్ గా ఒక ఫెర్ఫెక్ట్ వీడియో(Videos)గా మారుస్తుంది. సినిమాటిక్ ఎఫెక్ట్స్ కావాలనుకునే వారికి అయితే ఇది మంచి ఆప్షన్. దీని వెబ్‌సైట్ లోకి వెళ్లి మీ ఈమెయిల్ తో లాగిన్ అయి ఫ్రీగా వీడియోలు చేసుకోవచ్చు.

Videos

రన్‌వే జెన్-2 (Runway Gen-2)..ప్రొఫెషనల్స్ ఎక్కువగా వాడే టూల్ ఇది. దీనిలో మోషన్ బ్రష్ అనే ఫీచర్ చాలా బాగుంటుంది. మీ ఫోటోలో ఎక్కడ కదలిక ఉండాలో మీరు బ్రష్ తో పెయింట్ చేస్తే చాలు, ఆ పార్టు మాత్రమే కదులుతుంది. సముద్రపు అలలు లేదా ఎగిరే జుట్టు వంటివి సెట్ చేయడానికి ఇది చాలా అద్భుతంగా పని చేస్తుంది.

పిక్సార్ట్ ఏఐ (Picsart AI)..చాలామందికి తెలిసిన పిక్సార్ట్ యాప్‌లోనే ఇప్పుడు ఏఐ వీడియో(Videos) జనరేటర్ వచ్చేసింది. ఇది వాడటం చాలా సులభం. మీ ఫోటోను అప్‌లోడ్ చేసి వివిధ రకాల యానిమేషన్ స్టైల్స్ ను ఎంచుకోవచ్చు. సోషల్ మీడియా పోస్టులకు ఇది చాలా బాగుంటుంది.

వీడియో క్రియేట్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

ఎప్పుడూ హై-క్వాలిటీ ఫోటోలను మాత్రమే వాడాలి. బ్లర్ గా ఉన్న ఫోటోలకు ఏఐ సరిగ్గా పని చేయదు.
మీరు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ (ప్రాంప్ట్) క్లియర్‌గా ఉండాలి.
వాటర్ మార్క్ లేకుండా కావాలనుకుంటే కొన్ని టూల్స్‌లో ఫ్రీ క్రెడిట్స్ అయిపోయాక ..ఆ తర్వాత కొత్త మెయిల్ ఐడితో లాగిన్ అవ్వొచ్చు.

ఇంకెందుకు ఆలస్యం..టెక్నాలజీని వాడుకుంటూ మీ ఫోటోలను సరికొత్తగా సోషల్ మీడియాలో షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరచండి. గెట్ రెడీఏఐ తో ఫోటోలను వీడియోలుగా మార్చడం ఎలా, బెస్ట్ ఫ్రీ ఏఐ వీడియో యాప్స్, ఫోటో ఎడిటింగ్ ఏఐ ట్రిక్స్ తెలుగు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Exit mobile version