Digital assets:మనం లేని లోకంలో మన డిజిటల్ ఆస్తుల సంగతేంటి?

Digital assets: అసలు డిజిటల్ వారసత్వం అంటే ఏమిటి?.. డిజిటల్ వారసత్వం అనేది ఒక వ్యక్తి మరణం తర్వాత వారి ఆన్‌లైన్ ఉనికి, డేటా , ఆస్తులను నిర్వహించడానికి లేదా తొలగించడానికి ముందుగానే తీసుకునే నిర్ణయం.

Digital assets

ప్రస్తుత డిజిటల్ యుగంలో, మన జీవితంలో సగభాగం ఇంటర్నెట్లోనే గడుస్తోంది. మన ఫోటోలు, వీడియోలు, మెయిల్స్, సోషల్ మీడియా ఖాతాలు, బ్యాంక్ లావాదేవీలు, క్రిప్టో కరెన్సీ వాలెట్‌లు.. అన్నీ ఇప్పుడు డిజిటల్ ఆస్తులే(Digital assets). ఇవి భౌతిక ఆస్తుల (Physical Assets) కంటే తక్కువ విలువైనవి కావు. కానీ, మనం అనుకోకుండా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతే, ఈ “డిజిటల్ వారసత్వం” (Digital Legacy) సంగతేంటి? అనే ప్రశ్న ఇప్పుడు చాలామందిని కలవరపెడుతోంది. దీనికి సమాధానమే డిజిటల్ లెగసీ ప్లానింగ్.

అసలు డిజిటల్ వారసత్వం అంటే ఏమిటి?.. డిజిటల్ వారసత్వం అనేది ఒక వ్యక్తి మరణం తర్వాత వారి ఆన్‌లైన్ ఉనికి, డేటా , ఆస్తుల(Digital assets)ను నిర్వహించడానికి లేదా తొలగించడానికి ముందుగానే తీసుకునే నిర్ణయం. ఇది ఒక రకమైన ఆధునిక వీలునామా (Modern Will) వంటిది. మీ స్మార్ట్‌ఫోన్ పాస్‌వర్డ్‌లు, గూగుల్ డ్రైవ్ ఫోటోలు, ఫేస్‌బుక్ మెమోరియల్ పేజీ, మీ వెబ్‌సైట్ డొమైన్‌లు… ఇవన్నీ డిజిటల్ ఆస్తులే(Digital assets).

సాధారణంగా, ఒక వ్యక్తి మరణిస్తే, వారి బ్యాంకు అకౌంట్లు, ఆస్తులు లీగల్ డాక్యుమెంట్స్ ద్వారా వారసులకు బదిలీ అవుతాయి. కానీ, డిజిటల్ ప్రపంచంలో ఈ ప్రక్రియ చాలా సంక్లిష్టంగా ఉంటుంది. చాలా సోషల్ మీడియా కంపెనీలు, టెక్నాలజీ కంపెనీలు గోప్యతా (Privacy) నిబంధనల పేరుతో పాస్‌వర్డ్‌లు లేదా డేటాను కుటుంబ సభ్యులకు ఇవ్వడానికి నిరాకరిస్తాయి. దీనివల్ల, మనకు ఎంతో విలువైన జ్ఞాపకాలు (ఫోటోలు, చాట్స్) శాశ్వతంగా లాక్ అయిపోయే ప్రమాదం ఉంది. క్రిప్టో వంటి ఆర్థిక ఆస్తులై(Digital assets)తే మళ్లీ దొరకనే దొరకవు.

డిజిటల్ లెగసీ ప్లానింగ్ ఎందుకు ముఖ్యం అంటే.. మీ ప్రియమైనవారికి మీ పాత ఫోటోలు, వీడియోలు, మీ భావోద్వేగాలను పంచుకున్న చాటింగ్ హిస్టరీ వంటి అమూల్యమైన జ్ఞాపకాలు అందాలంటే ఈ ప్లానింగ్ తప్పనిసరి.

Digital assets

మీ ఆన్‌లైన్ ట్రేడింగ్ ఖాతాలు, ఫ్రీలాన్సింగ్ ఆదాయం, వెబ్‌సైట్ ఆదాయం లేదా క్రిప్టో వాలెట్ల వివరాలు కుటుంబానికి తెలియకపోతే భారీ ఆర్థిక నష్టం వాటిల్లుతుంది.

మీరు లేని సమయంలో, మీ ఖాతాలను మూసివేయడం లేదా మెమోరియల్ పేజీగా మార్చడం వంటి బాధ్యతాయుతమైన పనుల కోసం మీ కుటుంబ సభ్యులు కంపెనీల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఇది భవిష్యత్తులో మీ ప్రియమైనవారికి అనవసరమైన ఇబ్బందులు లేకుండా చేస్తుంది.

ఎలా ప్లాన్ చేసుకోవాలంటే..మీకు ఏయే ప్లాట్‌ఫామ్‌లలో అకౌంట్లు ఉన్నాయో (Facebook, Instagram, Gmail, Cloud Storage) ఒక లిస్ట్ తయారు చేయండి. మీ పాస్‌వర్డ్‌లు, యూజర్‌నేమ్‌లను సురక్షితమైన, ఎన్‌క్రిప్టెడ్ పద్ధతిలో (ఉదాహరణకు, పాస్‌వర్డ్ మేనేజర్) సేవ్ చేసి పెట్టుకోండి.

మీ డిజిటల్ ఆస్తులను నిర్వహించడానికి మీరు నమ్మే వ్యక్తిని (భర్త/భార్య, లేదా ఒక లీగల్ ఏజెంట్) నియమించి, వారికి యాక్సెస్ ఇచ్చే విధానాన్ని డాక్యుమెంట్‌లో రాయండి.

ప్లాట్‌ఫామ్ టూల్స్ వాడండి.. Google (Inactive Account Manager), Facebook (Legacy Contact) వంటి కంపెనీలు ఇప్పటికే కొన్ని టూల్స్‌ను అందిస్తున్నాయి. వాటిని వినియోగించుకుని, మీ మరణం తర్వాత అకౌంట్ స్టేటస్‌ను ముందే నిర్ణయించండి.

డిజిటల్ వారసత్వం అనేది నేటి తరం అత్యవసర బాధ్యత. ఇది మన డిజిటల్ జ్ఞాపకాలకు , ఆస్తులకు రక్షణ కవచం లాంటిది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Exit mobile version