Revanth Reddy
తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి, మాటల్లో పదును ఏమాత్రం తగ్గలేదు. ఓ తెలుగు పత్రిక 10వ వార్షికోత్సవంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి (revanth reddy), యూట్యూబ్ జర్నలిజాన్ని లక్ష్యంగా చేసుకొని కొన్ని వ్యాఖ్యలు చేశారు. అక్కడ మాట్లాడిన రేవంత్.. తనకు అప్పుడప్పుడూ కిందకు వెళ్లి.. జర్నలిస్టుల చెంపలు చెడా మడా పగలగొట్టాలని అనిపిస్తుందంటూ చేసిన కామెంట్లు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ అయ్యాయి.
అంతేకాదు..ఇప్పుడు అలా చేయాలంటే పరిస్థితులు, హోదా అడ్డు వస్తాయని సీఎం రేవంత్ అన్నారు. గతంలో జర్నలిస్టులను చూస్తే, మర్యాద ఇచ్చి, పలుకరించేవాడిని అని.. ప్రెస్ మీట్ అయ్యాక, వాళ్లతో పది నిమిషాలయినా మాట్లాడేవాడినని గుర్తు చేసుకున్నారు. గతంలో జర్నలిస్టులు ప్రజల తరపున నిలబడే వారని చెప్పిన రేవంత్ రెడ్డి..కానీ ఇప్పుడు కొంతమంది వాణిజ్య ప్రయోజనాల కోసం మీడియా ముసుగులో కుట్రలే చేస్తున్నారు” అంటూ విమర్శించారు.
అయితే ఇప్పుడే కాదు గతంలో కూడా రేవంత్ రెడ్డి (revanth reddy) ఇదే స్థాయిలో జర్నలిస్టులపై ఫైర్ అయిన దాఖలాలు ఉన్నాయి. ముఖ్యంగా 2025 మార్చిలో మహిళలపై అభ్యంతరకరమైన కంటెంట్ పోస్ట్ చేసేవారిని.. నీచమైన జర్నలిస్టులు అని అనడంతో పాటు అలాంటి వారిని బట్టలిప్పి ఊరేగించాలని అన్నారు. అప్పట్లోనే ఆ మాటలు పెద్ద ఎత్తున దుమారాన్ని రేపాయి.
పాలనలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా యాక్టివిస్టులు, యూట్యూబ్ చానెల్స్ ముఖ్యంగా రేవంత్‌ను మెయిన్ ఫోకస్ చేస్తూ, ఆయన కుటుంబం గురించి వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తుండటం రేవంత్ రెడ్డి (revanth reddy) కి తీవ్ర అభ్యంతరం కలిగిస్తోంది. పైగా, ఈ విమర్శలు పక్కా స్కెచ్‌తో, డిజిటల్ మీడియా ద్వారా కావడం వల్ల రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇక్కడ రేవంత్ మాటల్లో స్పష్టత ఉంది . మీడియా అంటే మొత్తం కాదని పర్సనల్ అయ్యే, హద్దులు దాటుతూ వార్తలు క్రియేట్ చేసే వారి మీదే కోపం అని చెబుతూనే ఉన్నారు. కానీ అదే మాటలు పదే పదే వచ్చినప్పుడు ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుందన్న విషయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి గ్రహించాలని విశ్లేషకులు చెబుతున్నారు.
Also read: Trump : పాక్‌తో డీల్, భారత్‌పై డ్యామేజ్.. ట్రంప్ ప్లాన్ ఏంటి?