Employment for prisoners: దేవాలయ వ్యర్థ పుష్పాల నుంచి అగరబత్తుల తయారీ – అక్కడ ఖైదీలకు గౌరవప్రదమైన ఉపాధి

Employment for prisoners: భద్రాచలం దేవాలయం నుంచి నిత్యం వృథాగా వచ్చే పూలను సేకరించి, వాటిని కర్బన రహిత (Charcoal-free), పర్యావరణహిత అగరబత్తులుగా మారుస్తుంది.

Employment for prisoners

దేవాలయాల నుంచి వృథాగా పోయే పుష్పాలను ఉపయోగించి పర్యావరణహిత అగరబత్తులు తయారుచేసే వినూత్న యూనిట్‌ను భద్రాచలంలోని స్పెషల్ సబ్-జైలులో డా. సౌమ్య మిశ్రా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్(Employment for prisoners) గారు ప్రారంభించారు.

స్వచ్ఛత, పర్యావరణం ,ఉపాధి..ఈ అగరబత్తి తయారీ యూనిట్, స్పెషల్ సబ్-జైలులో స్థాపించబడిన మొట్టమొదటి వినూత్న యూనిట్ అని డా. సౌమ్య మిశ్రా తెలిపారు. ఇది భద్రాచలం దేవాలయం నుంచి నిత్యం వృథాగా వచ్చే పూలను సేకరించి, వాటిని కర్బన రహిత (Charcoal-free), పర్యావరణహిత అగరబత్తులుగా మారుస్తుంది.

ఈ ఆవిష్కరణ(Employment for prisoners) మూడు ప్రధాన లక్ష్యాలను నెరవేరుస్తుంది.

Employment for prisoners

జైలు శాఖ (Prisons Department) ఖైదీలలో క్రమశిక్షణతో కూడిన పని సంస్కృతి , విశ్వాసం పెంపొందించడం ద్వారా, వారు సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా తిరిగి స్థిరపడటానికి సహాయం చేస్తుందని ఆమె హామీ ఇచ్చారు.

కరీంనగర్ జిల్లా జైలులో ప్రారంభించిన తొలి పైలట్ యూనిట్ విజయవంతమైంది. ఆ యూనిట్‌లో ఖైదీలలో సానుకూల ప్రవర్తన మార్పులు, క్రమశిక్షణ మెరుగుదల కనిపించడంతో, ఇలాంటి సుస్థిర పరిశ్రమలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నట్లు డా. మిశ్రా తెలిపారు.

ఈ కార్యక్రమంలో భద్రాచలం సబ్-కలెక్టర్ మృణాళ్ శ్రేష్ఠ, ఐజీ ప్రిజన్స్ ఎన్. మురళి బాబు, డిఐజి ప్రిజన్స్ (వరంగల్ రేంజ్) ఎం. సంపత్, ఖమ్మం జిల్లా సబ్ జైళ్ల అధికారి ఎ. శ్రీధర్ ,స్పెషల్ సబ్-జైలు సూపరింటెండెంట్ జె. ఉపేందర్ పాల్గొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version