Beach: హైదరాబాద్‌లోనూ బీచ్ కనువిందు చేయబోతోందని మీకు తెలుసా?

Beach: హైదరాబాద్ విశ్వనగరంగా ఎదిగి పర్యాటకులను బ్యూటిఫుల్ ఫ్లేసులతో మెస్మరైజ్ చేస్తున్నా.. బీచ్ లేదన్న కొరత వేధిస్తూనే ఉంటుంది. అయితే ఇకపై ఆ కోరిక తీరబోయే వేళ ఆసన్నమయింది.

Beach

నిజానికి, సముద్రం(Beach) లేని మన నగరంలో ఇసుక తిన్నెలు, అలల శబ్దం, బీచ్ ఫ్రంట్‌ లైఫ్… ఇవన్నీ వినడానికి అసాధ్యం అనిపించినా, ఇప్పుడు ఆ కల నిజం కాబోతోంది. ఇప్పటివరకు దుబాయ్, సింగపూర్ లాంటి చోట్ల మాత్రమే చూసిన ఆర్టిఫిషియల్ బీచ్ అనుభవం, ఇక మన హైదరాబాద్ శివార్లలో కూడా అందుబాటులోకి రాబోతోంది. ఇది కేవలం ఒక ప్రాజెక్ట్ కాదు… హైదరాబాద్‌ చరిత్రలో పర్యాటక రంగానికి ఒక కొత్త అధ్యాయం మొదలవబోతోంది.

హైదరాబాద్‌కు సమీపంలోని కొత్వాల్ గూడలో 35 ఎకరాల విస్తీర్ణంలో ₹225 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుంది. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మొట్టమొదటి కృత్రిమ బీచ్. ఈ ప్రాజెక్టు పర్యాటక రంగంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

beach

ఇందులో లగ్జరీ హోటల్స్, ఫ్లోటింగ్ విల్లాస్, వేవ్ పూల్స్, ఫుడ్‌కోర్ట్‌లు, థియేటర్లు, సాహస క్రీడలు వంటి సదుపాయాలు ఉంటాయి. ఇది ఒకే చోట అన్ని రకాల వినోదాలకు కేంద్రంగా నిలుస్తుంది. డిసెంబర్ నెల నుంచి దీని నిర్మాణం ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్టు పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ కింద నిర్మిస్తున్నారు.

ఒక కృత్రిమ బీచ్‌(Beach)ను నిర్మించడం అంత తేలిక కాదు. దీనికి కొన్ని సాంకేతిక సవాళ్లు ఎదురవుతాయి. నీటిని స్థిరంగా ఉంచడం, అలలను సరిగ్గా సృష్టించే సిస్టమ్‌లు, ఇసుకను నిరంతరం సరఫరా చేయడం వంటివి ఈ ప్రాజెక్టు విజయానికి చాలా అవసరం.
అయితే, దుబాయ్ పామ్ జుమైరా, సింగపూర్ సెంటిసా వంటి ప్రాజెక్టులు ఈ సవాళ్లను అధిగమించి విజయవంతమయ్యాయి. ఇది హైదరాబాద్‌లోని ప్రాజెక్టుపై కూడా ఆసక్తిని పెంచింది.

beach

హైదరాబాద్ ఒక ల్యాండ్‌లాక్డ్ సిటీ. ఈ ప్రాజెక్టు వల్ల పర్యాటక రంగానికి పెద్ద బూస్ట్ వస్తుంది. ఇప్పటివరకు బీచ్ అనుభవం కోసం పర్యాటకులు విశాఖపట్నం లేదా గోవా వంటి నగరాలకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇక నుంచి ఇక్కడే బీచ్ వాతావరణాన్ని అనుభవించవచ్చు.

ఇది స్థానిక ప్రజలకే కాకుండా, అంతర్జాతీయ పర్యాటకులనూ ఆకర్షిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సహజ సముద్రం అందించే సౌందర్యాన్ని కృత్రిమంగా సృష్టించడం కష్టమే అయినా, ఇది నగర ప్రజలకు బీచ్(Beach) వాతావరణాన్ని దగ్గర చేయడంలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే, హైదరాబాద్ పర్యాటక రంగంలో ఒక కొత్త గుర్తింపు సాధించడం ఖాయం.

Family card: ఆధార్ తరహాలో ఫ్యామిలీ కార్డు.. దీని వల్ల కలిగే లాభాలు!

Exit mobile version