Bathukamma: పూల పండుగ..ప్రపంచ రికార్డు: ఈసారి బతుకమ్మ వేడుకల ప్రత్యేకత ఇదే

Bathukamma: ఈసారి బతుకమ్మ ఉత్సవాలు ఒక ప్రత్యేక లక్ష్యంతో జరగనున్నాయి. కేవలం తెలంగాణకే కాదు, ప్రపంచానికే ఈ పండుగ గొప్పతనం చాటి చెప్పేలా తెలంగాణ ప్రభుత్వం ఒక భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

Bathukamma

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలకు సర్వం సిద్ధమవుతోంది. పూలను పూజించే ఈ ఉత్సవాలు సెప్టెంబర్ 21న మొదలుకానున్నాయి. అయితే, ఈసారి బతుకమ్మ(Bathukamma) ఉత్సవాలు ఒక ప్రత్యేక లక్ష్యంతో జరగనున్నాయి. కేవలం తెలంగాణకే కాదు, ప్రపంచానికే ఈ పండుగ గొప్పతనం చాటి చెప్పేలా తెలంగాణ ప్రభుత్వం ఒక భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు.

సెప్టెంబర్ 28న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఒక అద్భుతమైన కార్యక్రమం జరగనుంది. ఏకంగా 11 లక్షల మంది మహిళలతో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించి, గిన్నిస్‌ రికార్డు సృష్టించాలని జీహెచ్ఎంసీ ప్రణాళికలు వేసింది. దీనికోసం స్వయం సహాయక బృందాల మహిళలను ఈ వేడుకల్లో భాగం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జీహెచ్ఎంసీ అర్బన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ విభాగం ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ లక్ష్యం కోసం ప్రభుత్వం 11 లక్షల బతుకమ్మ చీరలను కేటాయించనుంది.

ఈ భారీ ప్రణాళిక వెనుక ఒక పెద్ద లక్ష్యం ఉంది. కేరళలో సామూహికంగా జరుపుకునే ఓనం పండుగ రికార్డును బ్రేక్ చేయాలనేది తెలంగాణ ప్రభుత్వ ఆలోచన. ఒకే చోట ఇంత భారీ సంఖ్యలో ప్రజలు ఒక పండుగను జరుపుకోవడం ఒక అరుదైన రికార్డుగా నిలుస్తుంది. ఇది తెలంగాణ సంస్కృతిని ప్రపంచ పటంలో నిలుపుతుంది.

Bathukamma

బతుకమ్మ (Bathukamma)ఉత్సవాల్లో ఇతర ముఖ్య కార్యక్రమాలు ఇలా ఉన్నాయి. సెప్టెంబరు 27న సాయంత్రం: ట్యాంక్‌బండ్‌ వద్ద బతుకమ్మ కార్నివాల్ జరగనుంది. అదే రోజున ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా మాదాపూర్‌లోని శిల్ప కళా వేదికలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

సెప్టెంబరు 29న: పీపుల్స్‌ ప్లాజా వద్ద ఉత్తమ బతుకమ్మ(Bathukamma) పోటీలు ఉంటాయి.
సెప్టెంబరు 29న: ఐటీ ఉద్యోగులు మరియు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల మధ్య పోటీలు జరుగుతాయి.
సెప్టెంబరు 30న: ట్యాంక్‌బండ్‌ వద్ద గ్రాండ్‌ పూల పండుగతో ఉత్సవాలు ముగుస్తాయి.

ఈ ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టడమే కాకుండా, మహిళా సాధికారతను, సామూహిక ఐక్యతను చాటి చెబుతాయి.

NTR: ఎన్టీఆరే కాదు తారక్ ఫ్యాన్స్ కూడా సెన్సేషనే.. ఎందుకలా అంటారా?

Exit mobile version