Gateway:హైదరాబాద్‌కు గేట్‌వే.. బుర్జ్ ఖలీఫా కంటే ఎత్తైన టవర్‌

Gateway:హైదరాబాద్‌ను కేవలం టెక్ హబ్‌గా కాకుండా, గ్లోబల్ ఫైనాన్స్ ,టూరిజం డెస్టినేషన్‌గా మార్చడమే దీని ముఖ్య ఉద్దేశం.

Gateway

హైదరాబాద్ ప్రపంచస్థాయిలో నిలబడబోతోంది. అవును, మీరు విన్నది నిజమే. ఔటర్ రింగ్ రోడ్ మీద “గేట్ వే ఆఫ్ హైదరాబాద్” (Gateway)పేరుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఐకానిక్ టవర్ రాబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మాస్టర్ ప్లాన్‌కు స్వయంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది కేవలం ఒక కట్టడం కాదు, హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా మార్చే ఒక బిగ్ టర్నింగ్ పాయింట్ అనే చెప్పొచ్చు.

ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న విజన్ చాలా పెద్దది. హైదరాబాద్‌ను కేవలం టెక్ హబ్‌గా కాకుండా, గ్లోబల్ ఫైనాన్స్ ,టూరిజం డెస్టినేషన్‌గా మార్చడమే దీని ముఖ్య ఉద్దేశం. దీనిలో భాగంగా మూసీ నది పరీవాహక ప్రాంతాన్ని పూర్తిగా మార్చి, దానికి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకురావడానికి ఈ ప్రణాళికను రూపొందించారు.

హిమాయత్ సాగర్ దగ్గర, బాపూ ఘాట్ వైపు ఔటర్ రింగ్ రోడ్( ORR) సమీపంలో ఈ టవర్ నిర్మాణం జరగనుంది. ఈ టవర్ డిజైన్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇది ఇండియా గేట్ లేదా గేట్ వే ఆఫ్ ఇండియా లాగా గేట్ స్టైల్, టవర్ స్టైల్ రెండింటినీ కలిపి ఒక అధునాతన స్ట్రక్చర్‌తో ఉంటుంది.

అధికారులు దీని ఎత్తును బుర్జ్ ఖలీఫా(Burj Khalifa) కంటే ఎక్కువ ఉండేలా చూస్తున్నారు. ఇది గనుక జరిగితే, ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన టవర్‌గా హైదరాబాద్ టవర్ రికార్డు సృష్టిస్తుంది.

దీంతో పాటు, హిమాయత్ సాగర్ సమీపంలో ఒక ఎకో థీమ్ పార్క్, దానిని టవర్‌తో కలిపే ఒక ఎలివేటెడ్ గేట్‌వే(Gateway) కూడా నిర్మించనున్నారు. అలాగే, హిమాయత్ సాగర్ అప్రోచ్ రోడ్‌కు కొత్త ఫ్లైఓవర్, ఒక గ్రీన్ కారిడార్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు.

ఈ భారీ ప్రాజెక్ట్‌ను కేవలం మూడు సంవత్సరాల్లో అంటే 2028 లోగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. డిజైన్లు ఫైనల్ అయిన తర్వాత, రెండు నెలల్లోనే టెండర్లు పిలుస్తామని సీఎం తెలిపారు. అంటే, పనులు చాలా వేగంగా జరగబోతున్నాయని అర్థం.

Gateway

ఈ ప్రాజెక్ట్ వల్ల హైదరాబాద్ వాసులకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి.ఈ టవర్ నగరానికి ప్రపంచస్థాయిలో ఒక ప్రత్యేక ల్యాండ్‌మార్క్‌ను తెచ్చిపెడుతుంది. నిర్మాణం మొదలైనప్పటి నుంచి వేలాది మందికి కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఆఫీసులు, హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు ఏర్పడి ఆర్థిక వ్యవస్థకు బూస్ట్ వస్తుంది.

అడ్వాన్స్‌డ్ వాటర్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీతో తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ఈ కొత్త డెవలప్‌మెంట్ వల్ల సిటీలోని రియల్ ఎస్టేట్ విలువలు భారీగా పెరిగే అవకాశం ఉంది.

ఈ బహుళ ప్రయోజన ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత,(Gateway) గేట్ వే ఆఫ్ హైదరాబాద్ ఒక కొత్త చరిత్రను సృష్టిస్తుందనడంలో నో డౌట్.అప్పుడు హైదరాబాద్( Hyderabad) మ్యాప్‌లో ఒక అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రదేశంగా మారనుంది.

 

Exit mobile version